Zerodol Tablet Uses in Telugu

Zerodol Tablets Telugu – జీరోడోల్ టాబ్లెట్ ఉపయోగాలు

Zerodol అనేది Aceclofenac మెడిసిన్ యొక్క ఒక బ్రాండ్ పేరు. ఇది ఒక నాన్ స్టెరాయిడల్ యాంటి ఇన్ఫ్లమేటరీ (NSAID) మెడిసిన్. దీనిని ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, జువెనైల్ ఆర్థరైటిస్, ఆంకీలోజింగ్ స్పాండిలైటిస్, వెన్నునొప్పి, భుజం యొక్క పెరీ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు వాడుతారు. Zerodol టాబ్లెట్ లో ఉండే ముఖ్య పదార్ధం Aceclofenac. మన శరీరంలో అసలు నొప్పికి కారణమైన ప్రోస్టాగ్లాన్డిన్స్ అనే రసాయనాలను తయారుచేసే COX (సైక్లో-ఆక్సిజినేజ్) అనే ఎంజైములను, Zerodol Tablet అదుపు చేస్తుంది. తద్వారా నొప్పిని తగ్గిస్తుంది.

Zerodol Tablet ఉపయోగాలు – Zerodol Tablet Uses in Telugu:

జెరోడాల్ టాబ్లెట్ సాధారణంగా ఈ కింది వ్యాధులు, పరిస్థితులు మరియు లక్షణాల చికిత్స, నియంత్రణ, నివారణలో సిఫార్సు చేయబడుతుంది:

Zerodol Tablet యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేదా దుష్ప్రభావాలు – Zerodol Tablet Side-effects in Telugu:

ఈ మెడిసిన్ వల్ల కలిగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ క్రింద పేర్కొనడం జరిగింది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని సందర్భాలలో అందరికి కలగకపోవచ్చు. ఈ మెడిసిన్ ఉపయోగించడం వల్ల ఏదైనా ఇబ్బందికర సూచనలు అనిపిస్తే, ఇంకా వెంటనే మానకపోతే తక్షణమే డాక్టర్ ను సంప్రదించాలి.

  • పొత్తి కడుపు నొప్పి – Abdominal pain
  • దద్దుర్లు – Rash
  • మగత – Drowsiness
  • అజీర్తి – Dyspepsia
  • వికారం – Nausea
  • మైకము – Dizziness

Zerodol Tablet ను సిఫార్సు చేయని సందర్భాలు:

  • Aceclofenac మెడిసిన్ అంటే అలర్జీ ఉంటె
  • అల్సర్ ఉన్నపుడు
  • ఆస్థమా ఉన్నవారికి
  • Acute Rhinitis – అలర్జీ వల్ల కలిగే జలుబు
  • Urticaria – చర్మంపై దద్దుర్లు
  • Zerodol Tablet పడని వారికి

Zerodol Tablet వాడకం పట్ల డాక్టర్లు ఇచ్చే సలహా:

  • కొద్దికాలం పాటు మాత్రమే వాడినపుడు ఈ మెడిసిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది
  • ఎక్కువ మోతాదులో వాడడం, లేదా ఎక్కువ కాలంపాటు వాడడం వల్ల కిడ్నిలకు హానికరం అవుతుంది ఇంకా జీర్ణాశయంలో రక్తస్రావం కావచ్చు
  • కిడ్నీ సమస్య ఉన్నవారు ముందే డాక్టర్ కు తెలియజేయాలి, వీరి విషయంలో ఈ మెడిసిన్ మోతాదులో వారికి అనుగుణంగా మార్పులు అవసరం కావచ్చు (డాక్టర్ సూచిస్తారు)
  • మద్యపానం చేసినపుడు ఈ Zerodol Tablet ను తీసుకోకూడదు, అలా వాడడం లివర్ కు హానికరం కావచ్చు
  • పొరపాటున ఎపుడైనా మోతాదుకు మించి ఈ Zerodol Tablet ను వాడినట్లయితే, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి

కొన్ని సాధారణ హెచ్చరికలు:

ఓవర్ డోసెజ్

మోతాదుకు మించి వాడడం కొన్ని తీవ్ర దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కలిగినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవాలి.

సమయానికి వేఉకోవలసిన డోస్ మిస్ అయినపుడు

ఎపుడైనా పొరపాటున వేసుకోవలసిన డోస్ మర్చిపోతే, వీలైనంత వెంటనే వేసుకోవాలి. ఒకవేళ తదుపరి డోస్ కు సమయం దగ్గర పద్దపుడు ఆ పూట వేసుకోవలసిన డోస్ వేసుకోవాలే తప్ప అదనంగా రెండు డోస్ లు కలిపి వేసుకోకూడదు. అదనపు డోస్ వేసుకోకూడదు.

గర్భిణి స్త్రీలలో

తప్పనిసరి అయితే తప్ప గర్భిణి స్త్రీలకు ఈ Zerodol Tablet సిఫార్సు చేయబడదు. వీరు ఈ మందు వాడడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. గర్భంలోని శిశువుకు అయితే హాని కలుగవచ్చు అనే ఋజువులేమీ లేవు కానీ, వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

పాలిచ్చే తల్లుల్లో

Zerodol Tablet ను వీరు వాడవచ్చు, కానీ వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

Mitigate Tablet వాడేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:

కొన్నిసార్లు కొన్ని రకాల రుగ్మతలు ఉన్నవారికి కొన్ని రకాల మందులు పడకపోవచ్చు. కనుక Zerodol Tablets వాడేప్పుడు కూడా జాగ్రత్త వహించడం మంచిది. డాక్టర్ ను సంప్రదించి వాడడం ఉత్తమం:

  • అల్సర్ తో బాధ పడుతున్నవారు, Crohn’s disease లేదా ulcerative colitis వంటి ప్రేగులకు సంభందించిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు
  • ఆస్థమా, లేదా వేరే ఏ రకమైన అలెర్జీ రుగ్మతలు ఉన్నా
  • గర్భిణిలు, పాలు ఇచ్చే తల్లులు తప్పని సరిగా డాక్టర్ సలహా మేరకే వాడాలి
  • బి.పి. – అధిక రక్తపోటు ఉన్నా
  • గుండె సంభంధ ఆరోగ్య సమస్యలు ఉంటె
  • కొంతమందిలో రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలంటి వారి జాగ్రత్త వహించాలి
  • వేరే ఏ ఇతర నొప్పి నివారణ మందుల వల్ల అయినా ఇంతకూ మునుపు పాడనీ వారు (Aspirin, Ibuprofen, మరియు Diclofenac, Indometacin వంటి మందులు పడని వారు)
  • SLE (systemic lupus erythematosus) వంటి కనెక్టివ్ కణజాల రుగ్మత ఉన్నవారు
  • కిడ్ని, లేదా లివర్ సమస్యలు ఉన్న వారు

Zerodol టాబ్లెట్స్ కు కొన్ని ప్రత్యామ్నాయ మెడిసిన్స్:

క్రింద పేర్కొన్న కొన్ని టాబ్లెట్లలో Zerodol టాబ్లెట్లతో సరిసమానమైన, కాంబినేషన్, డోస్, మరియు సామర్ధ్యం ఉంటుంది కనుక వీటిని డోలో టాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు:

  • Voltanec 100 MG Tablet
  • Vorth-A 100 MG Tablet
  • Altraflam 100 MG Tablet
  • Mahanac 100 MG Tablet
  • Fico 100 MG Tablet

మీకు దగ్గరలో అనుభవజ్ఞుడైన డాక్టర్ అందుబాటులో లేనట్లయితే, మీరు ఇక్కడ మమ్మల్ని సంప్రదించవచ్చు.

Zerodol Tablets in Telugu, Zerodol TabletsUses in Telugu

 

Reviews

Zerodol Tablets Telugu – జీరోడోల్ టాబ్లెట్ ఉపయోగాలు
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *