yogurt in Telugu

Yogurt in Telugu

మనం ప్రతిరోజూ అన్నంలో పెరుగు (Yogurt in Telugu) కలిపి తింటుంటాము. కానీ ఆ పెరుగు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మనకు పూర్తిగా తెలీయవు. పెరుగు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఎల్లప్పుడూ మానవజాతికి ముఖ్యమైనవి. పాలలో ఉన్న వివిధ విటమిన్లు మరియు ఖనిజాలు పెరుగులో కూడా  ఉంటాయి. ఇంకా, పెరుగు సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్లకు మంచి మూలం. పెరుగు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి కంట్రోల్లో ఉంచి, రక్తపోటు మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఇది ఎముకలు మరియు దంతాల బలాన్ని పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాక చర్మ సంరక్షణకి కూడా ఉపయోగపడుతుంది.

లాక్టోబాసిల్లస్ అనేది పాలను పెరుగుగా మార్చడానికి ఉపయోగపడే ఒక లాభదాయక బాక్టీరియా. ఈ లాక్టోబాసిల్లస్ బాక్టీరియా మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం లో కూడా తోడ్పడుతుంది.

పెరుగులో (Yogurt in Telugu) ఉండే పోషకాలు

మనం తీసుకునే డైట్ లో పెరుగు కీలకమైంది. ఇది 89% పైగా నీటిని కలిగి ఉండే పెరుగులో నాణ్యమైన ప్రొటీన్లు, దాదాపు అన్ని రకాల అమైనో యాసిడ్లు, కాల్షియం తగిన మోతాదులో లభిస్తాయి.

పెరుగులో లభించే పోషకాలు గ్రాముల్లో

  • నీరు – 89.1 గ్రా
  • ప్రోటీన్లు – 3.1 గ్రా
  • కొవ్వు పదార్థాలు – 4.0 గ్రా
  • కార్బోహైడ్రేట్స్ – 3.0 గ్రా
  • కాల్షియం – 149 మి.గ్రా
  • ఫాస్పరస్ – 93 మి.గ్రా
  • పొటాషియం – 130 మి.గ్రా
  • సోడియం – 32 మి.గ్రా
  • విటమిన్ సీ – 1 మి.గ్రా
  • రైబోఫ్లెవిన్ – 0.16 మి.గ్రా
  • నియాసిన్ – 0.1 మి.గ్రా
  • ఫోలిక్ యాసిడ్ – 12.5 మైక్రో.గ్రా
  • కెరోటిన్ – 102 మైక్రో.గ్రా
  • శక్తి – 60 కిలో కేలరీలు

పెరుగులో ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి

పెరుగు లో శరీరానికి కావలసిన దాదాపు చాలా పోషక పదార్థాలు ఉంటాయి. ఇందులో ఎముకల మరియు దంతాల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం అధికంగా ఉంటుంది. కేవలం ఒక కప్పు పెరుగులో మన శరీరానికి అవసరమైన కాల్సియంలో సుమారు 49 శాతం దాకా అందుతుంది.

పెరుగులో బి-విటమిన్ ప్రత్యేకించి విటమిన్ బి-12 మరియు రైబోఫ్లెవిన్ లు అదికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి. అంతేకాక పెరుగులో ఫాస్పరస్, మెగ్నీషియం, మరియు పొటాషియం లు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు. ఇవి అనేక శరీర జీవక్రియలకు మరియు రక్తపోటును నియంత్రించడానికి, ఎముకల ఆరోగ్యానికి కూడా అవసరం.

పెరుగు శరీర బరువు నియంత్రణకు సహాయపడుతుంది

ప్రతి 200 గ్రాముల పెరుగు లో సుమారు 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అనేది మన శరీరానికి అతిముఖ్యమైన పోషక పదార్ధం. ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటీన్ చాలా అవసరం. మన శరీర జీవక్రియలు సక్రమంగా కొనసాగడానికి మన శరీరానికి ప్రోటీన్ల ఆవశ్యకత చలా ఉంటుంది.

పెరుగులో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల దీనిని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ కొంత దీనివల్ల కూడా అందించవచ్చు. చాలామంది పెరుగు తినడం వల్ల బరువు పెరుగుతామని అనుకుంటారు. నిజానికి పెరుగు బరువు తగ్గడానికి చాలా ఉపగాపడుతుంది. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉండడం దీనికి ప్రధమ కారణం.

పెరుగు శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది

పెరుగు ను తరచూ తినడం వల్ల క్రమంగా మీ రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి, అనారోగ్యానికి లోనయ్యే అవకాశాలను తగ్గించవచ్చు.

సాధారణంగా మనం బ్యాక్టీరియా అనగానే వ్యాధులను కలుగజేసే హానికరమైనవిగా భావిస్తాం. కానీ మన శరీరంలో మంచి మరియు చెడు చేసే రెండు రకాల బ్యాక్టీరియాలూ ఉంటాయి. మనకు మంచి చేసే బ్యాక్టీరియాలను ప్రోబయోటిక్స్ అని అంటారు.

మనం తీసుకునే ఆహారంలో సజీవంగా ఉండే బాక్టీరియా మరియు ఈస్ట్ లను ప్రోబయోటిక్స్ అంటారు. పెరుగు లో ఉండే లాక్టోబాసిల్లస్ అనే ప్రోబయోటిక్ మన జీర్ణ వ్యవస్థకు ఏంతో మేలు చేస్తుంది. కనుక పెరుగు తీసుకోవడం వల్ల మన శరీరం లోని ప్రోబయోటిక్స్, అంటే మంచి చేసే బాక్టీరియా సంఖ్య పెరుగుతుంది, తద్వారా ఇమ్మ్యూనిటి (రోగ నిరోధక శక్తి ) కూడా పెరుగుతుంది.

పెరుగు బోలుఎముకల వ్యాధి (ఆస్టియోపోరోసిస్) ని నిరోధించడానికి సహాయపడుతుంది

కాల్షియం, ప్రోటీన్, పొటాషియం, భాస్వరం మరియు విటమిన్ డి వంటి పోషకాలు పెరుగులో ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడానికి పెరుగు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

ఆస్టియోపోరోసిస్ అనేది వయసు పెరిగే కొలది ముఖ్యంగా స్త్రీలలో కాల్షియమ్ మరియు విటమిన్-D ల లోపం వల్ల సంభవించే ఎముకలకు సంభందించిన వ్యాధి. ఇందులో ఎముకలు డెన్సిటీ (సాంద్రత) తగ్గడం వల్ల అవి పెలుసుబారి, చిన్నపాటి దెబ్బలకే సులువుగా విరిగే అవకాశం అధికంగా ఉంటుంది.

పెరుగులో విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి, ఇవి ఎముక ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. తరచూ పెరుగును తినడం వలన ఆస్టియోపోరోసిస్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

పెరుగు గుండెకు మంచిదా?

పెరుగులో కొవ్వు పద్దార్థం ఉంటుందని అది గుండెకు అంట మంచిది కాదని అనుకుంటారు. కానీ కొన్ని అధ్యయనాలలో వెల్లడైన విషయం ఏంటంటే, పెరుగులో సాచురేటేడ్ ఫాట్స్ ఉన్నప్ప్పటికీ అవి మన శరీరానికి మేలుచేసే HDL కొలెస్టరాల్ ను పెంచడంలో ఉపయోగపడుతాయి.

అంతేకాక అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి కూడా ఉపయోగకరమని కొన్ని అధ్యయనాలలో రుజువైంది.

పెరుగు కొంతమందికి సహించక పోవచ్చు

పెరుగు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ అందరికీ ఇది వర్తించకపోవచ్చు. కొంతమందికి పాలు సహించవు. దీనిని లాక్టోస్-ఇంటాలరెన్స్ అంటారు. పాలను జీర్ణం చేసుకోవడానికి అవసరమైన ల్యాక్టేస్ అనే ఎంజైమ్ సహజంగానే వీరి శరీరంలో ఉండదు. పాలలో ఉండే లాక్టోస్ అనే పిండి పదార్థాన్ని జీర్ణం చేసుకోవడానికి దోహదపడుతుంది.

కనుక అటువంటి వారిలో కూడా కంతమందికి పెరుగు పడవచ్చు. అందుకు కారణం పాలు పెరుగుగా మారే క్రమంలో పాలలోని కొంత లాక్టోస్ తగ్గిపోతుంది. ఇంకా పెరుగులోని ఆరోగ్యకర బ్యాక్టీరియా, పెరుగు సులువుగా జీర్ణం అవడానికి దోహదపడుతుంది.

పాల ఉత్పత్తులలో కాసైన్ ప్రోటీన్ మరియు వే-ప్రోటీన్ ఉంటాయి. వీటివల్ల కొంతమందిలో పాల వల్ల అలర్జీ ఉంటుంది. అటువంటివారు పెరుగును వాడకపోవడం శ్రేయస్కరం.

కొన్ని రెడీమేడ్ పెరుగు రకాలలో (యోగర్ట్) చక్కర కూడా ఉంటుంది. ఏదేమైనా పెరుగును సహజమైన రూపంలో తీసుకోవడం చాలా శ్రేయస్కరం.

yogurt in Telugu, yogurt uses in Telugu, yogurt health benefits in Telugu

Reviews

Yogurt in Telugu
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *