ఇప్పటికే అనేక అధ్యయనాలలో శస్త్రచికిత్స తర్వాత ధూమపానం (Smoking) చేసేవారిలో చాలా సమస్యలు కలుగుతాయని తేలింది. Arthritis Care and Research లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం మోకాళ్ళ మార్పిడి మరియు తొంటి మార్పిడి (hip & knee replacement) చికిత్స చేయించుకున్న 33 వేల మందిలో 57% మంది ధూమపాన అలవాట్లు లేనివారు, 19% మంది శస్త్రచికిత్సకు ముందు ధూమపానం చేసేవారు, మరియు 24% మంది ప్రస్తుతం ధూమపానం అలవాటు ఉన్నవారు[1]. ఈ అధ్యయనం ప్రకారం శస్త్రచికిత్స తర్వాత ధూమపానం కొనసాగించే వారిలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు, అనగా న్యుమోనియా, స్ట్రోక్ మరియు గాయాల ఇన్ఫెక్షన్ల సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా రుజువైనది. మరియు ఇలాంటి వారిలో శస్త్రచికిత్స తర్వాత ఇంటెన్సివ్ కేర్ అవసరం ఎక్కువగా ఉoటుంది. అంతే కాక మరణాల శాతం ఎక్కువగా వుందని వెల్లడైంది.
ఉదాహరణకు, ఆపరేషన్ జరిగిన శరీర భాగంలో ఇన్ఫెక్షన్ల విషయం లో odds ratio ప్రస్తుతం పొగత్రాగేవారికి 1.41 ఉంటే, పొగ త్రాగడం వల్ల న్యుమోనియా మూలంగా odds ratio 1.53 కు పెరిగింది. ప్రస్తుతం ధూమపానం అలవాటు ఉన్నవారి, ఒక సంవత్సరం మరణాల odds ratio 1.63 గా ఉంది.
ధూమపానం (Smoking) శస్త్రచికిత్స తర్వాత కోలుకొనే సామర్ధ్యాన్ని ఎలా తగ్గిస్తుంది?
అనేక మంది రోగులు ధూమపానం తమ ఊపిరితిత్తులు మరియు ఒక విజయవంతమైన మోకాలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఎలా సమస్యలకు కారణమవుతుందా అని ఆశ్చర్యపోవచ్చు. అది ఎలానో కాస్త చూద్దాం.
ధూమపానం ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది
ఆక్సిజన్ వివిధ క్రియలను చేసేందుకు మన శరీరంలోని కణాలకు అవసరమవుతుంది. అయితే, రక్తం లోని హీమోగ్లోబిన్ అనే అణువులు మన అన్ని శరీర భాగాలకు ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ ను సరఫరా చేస్తాయి, ఈ అణువులు పొగ వల్ల ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించలేవు. మరియు శస్త్రచికిత్స తర్వాత గాయపడిన కణజాలం పెరగడానికి, పూర్తిగా నయమవడానికి ఆక్సిజన్ అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా, ధూమపానం లో ఉండే tar వంటి వివిధ రసాయనాల శోషణ వల్ల రక్తo చిక్కగా అవుతుంది. మరియు రక్త ప్రసరణకు తోడ్పడే చిన్న రక్తనాళాలు లేదా కేశనాళికల గోడలు సన్నగా మారతాయి. దీని వల్ల రక్త ప్రసరణ తగ్గి, శస్త్రచికిత్స తర్వాత గాయపడిన కణజాలానికి ఆక్సిజన్ సరిగా అందక నయమవడానికి ఆటంకం కలుగుతుంది. రక్త ప్రసరణ తగ్గడం వల్ల కండరాల మరియు అస్థిపంజర కణజాలం పెరుగుదలను పరిమితం చేసి శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడం ఆలస్యమవుతుంది. శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపి తరచుగా కండరాల శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కానీ రక్త ప్రసరణ ఆగడం మరియు ఆక్సిజన్ తగినంత లేకపోవడం వల్ల శస్త్రచికిత్స అయిన ప్రదేశం కోలుకోవడానికి చాలా ఆలస్యం అవుతుంది.
ధూమపానం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది
పరిశోధనల ప్రకారం పొగలో ఉండే రసాయనాలు అంటురోగాలు కలిగించే బ్యాక్టీరియాలను నియంత్రించే తెల్లరక్తకణాల సామర్ధ్యాన్ని తగ్గిస్తాయి. తెల్లరక్తకణాల ప్రాధమిక పాత్ర అంటువ్యాధులను కలిగించే బ్యాక్టీరియాలను శరీరం నుండి పారద్రోలడం. ఎప్పుడయితే తెల్లరక్తకణాల క్రియాశీలత తగ్గుతుoదో, శస్త్రచికిత్స జరిగిన చోట అంటురోగాలు పెరగడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.
ధూమపానం రక్తపోటు పెంచుతుంది
పొగ తాగడం వల్ల, రక్త పోటు పెరుగుతుంది దీని వల్ల గుండెకు సంభందించిన వివిధ రోగాలకు దారితీస్తుంది. అది కూడా ఒక రోగి శస్త్రచికిత్స తర్వాత కోలుకుoటున్నప్పుడు. చాలా నివేదికలు పొగ త్రాగడం వల్ల అనస్థీషియాకు ముందు మరియు అనస్థీషియా తర్వాత ఊపిరితిత్తుల సామర్ధ్యాo పైన ప్రభావం చూపుతాయని వెల్లడించాయి.
ఈ నష్టాలను నివారించడానికి ఎమైన చేయవచ్చా?
అదృష్టవశాత్తూ, పరిశోధనలో ఈ నష్టాలను నివారించడానికి కొన్ని అంశాలను సూచించారు:
ఎవరయితే సాధారణంగా పొగ తాగుతారో వాళ్ళు కనీసం శస్త్రచికిత్సకు 6-8 వారాల ముందే ధూమపానాన్ని విడిచిపెట్టాలి. మరియు శస్త్రచికిత్స తర్వాత కూడా పొగ తాగడం నిలిపివేయాలి దీని వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు.
ఒక వ్యక్తి శస్త్రచికిత్సకు చాలా రకాల ప్రమాద కారకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మధుమేహ వ్యాధి, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి తప్పించుకోలేకపోవచ్చు కాని ధూమపానం నుండి దూరంగా ఉండడం వల్ల కాస్తైనా ఉపశమనం పొందవచ్చు. ధూమపానం నుండి దూరంగా ఉండడం ఒక రోగికి సులభం కానప్పుడు కౌన్సిలింగ్ సహాయపడుతుంది.
డెన్మార్క్ లో నిర్వహించిన ఒక అధ్యయనం, శస్త్రచికిత్సకు అలవాటు ఉన్న వారు, శస్త్రచికిత్స తరువాత మళ్ళి రెండు సంవత్సరాల తరువాత తిరిగి ధూమపానం అలవాటు కొనసాగించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
References
- Smoking as a risk factor for short‐term outcomes following primary total hip and total knee replacement in veterans; Singh, Jasvinder A.; Houston, Thomas K.; Ponce, Brent A.; Maddox, Grady; Bishop, Michael J.; Arthritis Care and Research, Volume 63 (10) – Oct 1, 2011
- Long‐term effects of a preoperative smoking cessation programme; Villebro, Nete; Pedersen, Tom; Møller, Ann M.; Tønnesen, Hanne; The Clinical Respiratory Journal, Volume 2 (3) – Jul 1, 2008
Image Source: Wikimedia
Reviews