Slipped disk in Telugu

స్లిప్ డిస్క్ తో బాధపడుతున్నారా? సరైన నిర్ణయం తీసుకోండి!

ఈ బిజీ బిజీ జీవితంలో దాదాపు చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో నడుం నొప్పి ప్రధానమైనది. పని ఒత్తిడి, ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, అధిక పనిగంటలు వంటి ఎన్నో కారణాల వల్ల నడుం నొప్పి వస్తుంటుంది. నూటికి 60-85 శాతం మంది తమ జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి నడుం నొప్పి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. నడుము నొప్పి ముఖ్యంగా స్లిప్ డిస్క్ వల్ల ఎక్కువగా వస్తుంది.

స్లిప్ డిస్క్

వెన్నుపూస ఎముకల మధ్య ఉండే కుషన్ వంటి మృదులాస్థి (జెల్లీ లాంటి డిస్క్) పక్కకు జరిగి కాళ్ళలోకి వచ్చే నరాల మీద ఒత్తిడిని కలిగిస్తున్నప్పుడు దానిని స్లిప్ డిస్క్ అంటారు.

స్లిప్ డిస్క్ కారణాలు

  • ఎక్కువ సేపు కూర్చోని పనిచేయడం
  • స్థూలకాయం (obesity)
  • వయసు పై బడడం
  • ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణం చేయడం
  • ఎక్కువ సేపు వంగి పనిచేయడం
  • అతిగా బరువులు మోయటం
  • యాక్సిడెంట్స్ వల్ల వెన్నెముకకు దెబ్బలు తగలడం

డిస్క్‌లో వచ్చే మార్పులు

వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినపుడు డిస్క్‌ల మీద ఒత్తిడి పెరుగుతుంది. వాపు రావటం, డిస్క్ లో రక్తప్రసరణ సరిగా లేకపోవటం, డిస్క్ అరిగి పోవటం వంటి సమస్యల వల్ల నడుం నొప్పి వస్తుంది.

స్లిప్ డిస్క్ లక్షణాలు

నడుం నొప్పి, వాపు, ఏ కాస్త శ్రమించినా నొప్పి తీవ్రత పెరగడం, సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, కాళ్లలో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. కొన్ని సార్లు స్లిప్ డిస్క్ వల్ల నరాలపై ఒత్తిడి ఎక్కువై స్పర్శజ్ఞానం కోల్పోవడం మరియు నరాల బలహీనతకు దారితీస్తుంది.

స్లిప్ డిస్క్ వల్ల వచ్చే నడుము నొప్పి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది రోగులలో డిస్క్‌ ప్రొలాప్స్‌ను నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనగా మందులతో, ఫిజియోథెరపి ద్వార  తగ్గించవచ్చు. ఒక వేళ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ విఫలమయితే (నొప్పి తగ్గకుంటే) శస్త్రచికిత్స తో నొప్పిని తగ్గించవచ్చు.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ జనరల్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వార రోగికి 6 వారాలలో ఉపశమనం కలగకుంటే శస్త్రచికిత్సను ఎంచుకోవచ్చు. శస్త్రచికిత్స ద్వార డిస్క్ సమస్యలను పూర్తిగా నయం చేయవచ్చు, రోగి  హాయిగా జీవితాన్ని కొనసాగించవచ్చు. చాలా కేసులలో  శస్త్రచికిత్స అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ అధ్యయనంలో, కొందరు రోగులు నాన్ సర్జికల్ చికిత్సల ద్వార కూడా తరచుగా నొప్పి నుండి ఉపశమనం పొందుతున్నారని  పరిశోధకులు గమనించారు. కాబట్టి వారు నాన్ సర్జికల్ మరియు శస్త్రచికిత్స పద్ధతుల ఎంపికలో మిశ్రమ ఫలితాలను కనుగొన్నారు.

ఈ అధ్యయనం ప్రకారం రోగి అతని పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఏ చికిత్స ఉత్తమంగా పని చేస్తుందో నిర్ధారించుకోవాలి, మరియు అందుబాటులో ఉన్న చికిత్స విధానాల గురించి తెలుసుకోవాలి. చికిత్స విధానాల గురించి తెలుసుకోవడానికి ముందు మంచి అనుభవం ఉన్న ఓ ఇద్దరు డాక్టర్లను సంప్రదించడం ద్వారా చికిత్సా ఎంపికల గురించి అవగాహన పెరుగుతుంది.

Slip disc in telugu, Slip disc causes in telugu, Slip disc symptoms in telugu, Slip disc treatment options in telugu, Disc prolapse in telugu, Slip disc and back pain in telugu, Back pain causes in telugu.

Have a question?

Feel free to ask us for any help or information here!

Reviews

స్లిప్ డిస్క్ తో బాధపడుతున్నారా? సరైన నిర్ణయం తీసుకోండి!
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.
Name
Email
Rating
Review

 

 

 

 

 

2 thoughts on “స్లిప్ డిస్క్ తో బాధపడుతున్నారా? సరైన నిర్ణయం తీసుకోండి!

  1. my wife have more back pain
    more medicine use but no any good result sir
    pls give sir any suggestion
    any medicine name
    injection also taken but no control back pain sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *