ఈ రోజు మీరు ఆరోగ్య భీమాను కొనడానికి గల 5 ప్రముఖ కారణాలు

ఆరోగ్య భీమా అనేది భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్య సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ఎవాల పెట్టుబడి పెట్టడం వంటిది. ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవర్చుకోవడం మరియు ఆహారపు అలవాట్లు పాటించడం చాలా ముఖ్యం. ఆరోగ్య భీమా కలిగి ఉండడం అనేది భవిష్యత్తులో మీకుకాని మీ కుటుంబ సభ్యులకుకానీ ఏదైనా ఊహించని ఆరోగ్య సమస్య తలెత్తినపుడు ఉపయోగపడుతుంది. మీ కోసం కానీ  లేదా మీ ప్రియమైనవారి కోసం కానీ ఆరోగ్య బీమాను తీసుకొనే ముందు కొన్ని విషయాలను పరిగణించవలసిఉంటుంది. అవేంటో ఈ వ్యాసంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.       

హెల్త్ క్లూస్ నందు తరచూ మమ్మల్ని చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మాకు ఈ ప్రశ్నలు చాలా వరకు ముఖ్యమైన శస్త్రచికిత్సలు లేదా ఇతర చికిత్సల వివరాల కోసం చూస్తున్నవారి నుండి వస్తుంటాయి. కానీ ఇటువంటి శాస్త్రచికిత్సలకు అయ్యే ఖర్చు పరమైన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతుంటారు. ఇటువంటి శస్త్రచికిత్సలకు అయ్యే ఖర్చు మేము భరించలేము అనే ప్రశ్నలు ఎక్కువగా వస్తూంటాయి. ఆరోగ్య సంరక్షణకు అయ్యే ఖర్చు చాలా కుటుంబాలను పేదరికం లోకి తీసుకురాగలదు. నెలకు కొన్ని వందల రూపాయల చెల్లింపుతో ఒక ఆరోగ్య భీమాను తీసుకోగలిగినపుడు నిర్ణయాన్ని వాయిదా వేయడంలో అర్ధమే లేదని చెప్పవచ్చు.

అతిముఖ్యంగా మనం ఇపుడు దేశవ్యాప్తంగా కొరోనా వైరస్ వ్యాప్తి చెందడం చూస్తున్నాం, ఇటువంటి సమయంలో ముందుజాగ్రత్త వహించడం చాలా ఉత్తమం. చాలా రకాల హెల్త్ ఇన్షూరెన్స్ ప్లాన్లు ఇటువంటి ఇన్ఫెక్షన్స్, లేదా రోగాలు, కోరోనా వంటి కేసులతో సహా చేసే చికిత్సలకు అయ్యే ఖర్చులను కూడా కవర్ చేస్తాయి. కానీ ఇంచుమించు అన్ని ఇన్షూరెన్స్ ప్లాన్లలోనూ 30 రోజుల కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే ఆరోగ్య భీమా తీసుకున్న తేదీకి 30 రోజుల మునుపే ఇన్షూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఇటువంటి అనారోగ్యం పాలు అయ్యుంటే ఈ ఇన్షూరెన్స్ వర్తించదు. ఈ సమయం లో వీలైనంత తొందరగా హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకోవడం సరైనది అని చెప్పడానికి ఇది కూడా ఒక కారణంగా పరిగణించవచ్చు.

హెల్త్ ఇన్షూరెన్స్ కావాలా?
ఆరోగ్య భీమాపై సరైన సలహా కోసం సంప్రదించండి.

మీరు ఈరోజు ఒక ఆరోగ్య భీమాను తీసుకోవడానికి పరిగణలోకి తీసుకోవలసిన 5 ముఖ్య కారణాలను పరిశీలిద్దాం.    

జీవనశైలి లో మార్పులు  

సాంకేతిక అభివృద్ధి మనల్ని చాలా రంగాలలో పురోగతి సాధించగలిగేలా చేసింది. సగటు జీవన నాణ్యతను పెంచింది. కానీ అదే సమయంలో, డయాబెటిక్, కార్డియాక్ మరియు ఆర్థరైటిస్ సమస్యలు వంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలకు కొన్ని కారణాలు కారణమవుతాయి. నిశ్చల జీవనశైలి మరియు మారుతున్న ఆహారపు అలవాట్లు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఫిట్‌నెస్ మరియు నిబద్ధతపై పెరుగుతున్న అవగాహనతో ఈ కారకాలను నియంత్రించవచ్చు, అయితే అదే సమయంలో, మన నియంత్రణలో లేని కొన్ని పర్యావరణ కారకాలు మనకు ఉన్నాయి, ఇవి ఆసుపత్రిలో చేరాల్సిన అనారోగ్యాలకు కారణమవుతాయి. ఆరోగ్య బీమా పథకాన్ని కలిగి ఉండటం ఎల్లప్పుడూ మంచిది మరియు ఇది మనకు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది.         

ఖరీదైన మెడికల్ ఖర్చులను భరించడం కోసం

వైద్యానికి అయ్యే ఖర్చులు గత దశబ్ధం క్రితం ఉన్నట్లు ఇపుడు లేవనే చెప్పవచ్చు. వైద్య రంగంలో కూడా చాలా అభివృద్ది చెందడం వల్ల కావచ్చు లేదా కార్పొరేట్ హాస్పిటల్ కల్చర్ వల్ల కావచ్చు, వైద్యపరమైన ఖర్చులు పోను పోను పెరిగే అవకాశమే తప్ప మున్ముందు ఎట్టి పరిస్థితిల్లోనూ తక్కువ అయ్యే అవకాశం ఉండదు. సాధారణ ఆరోగ్య సమస్యలతో పోలిస్తే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు అధిక ఖర్చు కలిగించేవి కావచ్చు. ఈ రోజుల్లో చాలా ఆరోగ్య భీమా పధకాలు అందుబాటులో ఉన్నాయి, వీటిని ప్రముఖ ఇన్షూరెన్స్ కంపెనీలు అందిస్తున్నాయి. మీ అవసరాన్ని బట్టి ఎటువంటి ఆరోగ్య భీమా కావాలో వీటిలో మీరు ఎంచుకోవచ్చు.                     

Parents Health Insurance Plans

ఆరోగ్య భీమా మీ ఇన్కమ్ టాక్స్ పై ఆదా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది

చాలావరకు ఆరోగ్య భీమా పధకాలు భారతీయ ఇన్కమ్ టాక్స్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 80డి పరిధిలో ఇన్కమ్ టాక్స్ క్లెయిమ్ బెనిఫిట్ ను పొందే వెసులుబాటు కలిగి ఉంటాయి. మీరు తీసుకున్న ఇండివిడ్యువల్ మరియు ఫామిలి ఫ్లోటర్ ప్లాన్స్ మొత్తం కలిపి మీరు చెల్లించే సంవత్సర ప్రీమియం మొత్తంకు ఈ ఇన్కమ్ టాక్స్ బెనిఫిట్ వర్తిస్తుంది. అదనంగా ఒకవేళ మీకు అరవై ఏళ్లకు పైబడ్డ తల్లిదండ్రులు ఉంటే, వారికోసం తీసుకున్న ఆరోగ్య భీమాకు సంభంధించిన ప్రీమియం చెల్లింపు మొత్తం కూడా ఈ ఇన్కమ్ టాక్స్ బెనిఫిట్ కు జత అవుతుంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో ఖర్చయ్యే ఈ మొత్తం ప్రీమియం ల చెల్లింపుకు సంభంధించిన అమౌంట్ ను టాక్స్ పేమెంట్ లో మినహాయించుకోవచ్చు.

ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జీలు చెల్లించడానికి ఉపయోగపడుతుంది

చాలా ఆరోగ్య భీమా ప్లాన్లు వాటి డాక్యుమెంట్స్ లో పేర్కొన్న విధంగా పలు చికిత్సా పద్దతులకు అయ్యే ఖర్చును భరిస్తాయి. ఇవి ప్రాధమిక ఖర్చులు క్రిందికి వర్తిస్తాయి. చాలా ఆరోగ్య భీమా పధకాలు ఈరకమైన ప్రాధమిక ఖర్చులే కాక హాస్పిటల్ లే చేరే ముందు అయ్యే ఖర్చులు, ఓపిడి కి అయ్యే ఖర్చు లు, డాక్టర్ ఫీజులు, సహజంగా అధికంగా ఉండే డయాగ్నోస్టిక్ పరీక్షలకు అయ్యే ఖర్చులు కూడా కొన్ని ఆరోగ్య భీమాలు కవర్ చేస్తాయి. కొన్ని రకాల ప్లాన్లు హాస్పిటల్ లో చేరే ముందు, హాస్పిటల్ లో ఉన్నపుడు మరియు డిశ్చార్జ్ అయ్యాక కూడా మందులకు అయ్యే ఖర్చులు, పేషెంట్ హాస్పిటల్ కు వెళ్లలేని పరిస్థితిలో ఇంటివద్దే చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండి ఒకవేళ ఈ చికిత్స 3 రోజులకంటే మించినపుడు, అటువంటి చికిత్స కి అయ్యే ఖర్చులు కూడా కవర్ చేస్తాయి. ఎంచుకున్న పాలసీ ను బట్టి అంబులెన్స్ అయ్యే ఖర్చులు మరియు కొన్ని చిన్నపాటి శస్త్రచికిత్సలు, అంటే వేటికైతే పేషెంట్ హాస్పిటల్ ఒక రోజు మొత్తం ఉండవలసిన అవసరం ఉండదో (ఈ రకమైన శస్త్రచికిత్స ను డే-కేర్ శస్త్రచికిత్స అంటారు) అటువంటి ఖర్చులు కూడా కొన్ని రకాల అరరోగ్య భీమాలు కవర్ చేస్తాయి.                           

  

మీ అవసరాన్ని బట్టి రకరకాల ఫ్యామిలీ ఫ్లోటర్స్ ను ఎంచుకొనే అవకాశం ఉంటుంది

ఈ రోజుల్లో ఆరోగ్య బీమా మార్కెట్‌లోని పలు అగ్ర బీమా కంపెనీలు మీ అవసరాలకు సరిపోయే అనేక రకాల బీమా పాలసీలను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఇండివిడ్యువల్ మరియు ఫ్యామిలీ ఫ్లోటర్స్ బెనిఫిట్స్. అంటే కాక మీ అవసరాన్ని బట్టి కస్టమైజ్ కూడా చేసుకునే వెసులుబాటు కొన్ని ఆరోగ్య భీమలలో ఉంటుంది. కొన్ని ప్లాన్లు ఒకే వ్యక్తికి మరియు భార్యభర్తలకు సరిపోయే ప్రణాళికలు, పిల్లలు కల చిన్న కుటుంబాలు మరియు వృద్ధ తల్లిదండ్రులతో ఉన్న కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా రకరకాల ప్లాన్లు ఉంటాయి. ఆరోగ్య భీమా కంపెనీలమధ్య పోటీ ఉండడం మూలాన చాలా వరకు అన్ని ప్రఖ్యాత ఆరోగ్య భీమా సంస్థలు ఇవాళ పలు రకాల హెల్త్ ఇన్షూరెన్స్ ప్లాన్లు ఆఫర్ చేస్తున్నాయి. మీ అవసరాన్ని బట్టి వీటిలో మీకు తగ్గ ప్లాన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు.     

Are you Looking For a Health Insurance? – Read this for More Information

Health Insurance for Family

క్లుప్తంగా చెప్పాలంటే, ఇవాళ ఇన్షూరెన్స్ మార్కెట్ లో చాలా రకాల హెల్త్ ఇన్షూరెన్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఒక్కొకరికి వారి వారి ఆరోగ్య అవసరాన్ని బట్టి అనుకూలమైనవిగా ఉంటాయి. మీరు ఏదైనా ఆరోగ్య భీమా తీసుకునే ముందు మార్కెట్ లో అందుబాటులో ఉన్న రకరకాల హెల్త్ ఇన్షూరెన్స్ ప్లాన్లను స్టడీ చేసి, పోల్చి చూసి మీకు ఏది సరిపోతుందో ఒక నిర్ణయానికి రావచ్చు.       

మీకు కానీ మీ ఫ్యామిలీ కి కానీ సరిపడా ఆరోగ్య భీమాను ఎంచుకునే ముందు ఈ పద్దతి పాటించడం చాలా ముఖ్యం అని చెప్పవచ్చు. కొంతమందికి ఫైనాన్షియల్ పరంగా ఇటువంటి విషయాలలో అంత అవగాహన ఉండకపోవచ్చు. అలాంటివారు ఈ పరమైన అవగాహన గల తమ స్నేహితుల సహాయం తీసుకోవడం మంచిది. ఆరోగ్య భీమా పధకాల గురించి సంక్షిప్త ఆలోచన పొందడానికి వివిధ ఆరోగ్య భీమాలను పోల్చి చూడడానికి ఉపయోగపడే కొన్ని ఆన్‌లైన్ సాధనాలు ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవి ఆరోగ్య భీమా పధకాల పై ఒక అవగాహనకు రావడానికి ఉపయోగపడుతాయి.        

Reviews

ఈ రోజు మీరు ఆరోగ్య భీమాను కొనడానికి గల 5 ప్రముఖ కారణాలు
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.
Name
Email
Review Title
Rating
Review Content

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *