Paracetamol in telugu

Paracetamol – పారసిటమాల్ ఉపయోగాలు

పారాసెటమాల్ (అసిటమినోఫెన్) అనేది నొప్పి నివారణకు వాడే ఒక రకమైన నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ (NSAIDs). Paracetamol ను కండరాల నొప్పులకు, తల నొప్పికి, ఒంటి నొప్పులకు, కీళ్ల నొప్పులకు, మరియు జ్వరానికి కూడా వాడతారు. కనుక చాలావరకు నొప్పి ఉన్న రుగ్మతలకు వైద్యులు దీనిని సిఫార్సు చేస్తారు.

Read about Paracetamol in English

Paracetamol ఎలా పని చేస్తుంది:

Paracetamol ఒక నాన్-స్టెరాయిడల్ యంటి ఇంఫ్లమేటరీ డ్రగ్ (NSAIDs). సాధారణంగా Paracetamol మన మెదడు లోని ఒక భాగమైన హైపోథాలమస్ లో ఉండే, వేడిని నియంత్రించే COX-3 అనే ఎంజైమ్ పై పనిచేస్తుంది. ఫీవర్ ఉన్నప్పుడు ఈ సెంటర్ ని ఎక్కువ వేడిని నియంత్రిస్తుంది. Paracetamol నొప్పిని మరియు వాపును కలిగించే కొన్ని రకాల రసాయనాలను మెదడులో విడుదల కాకుండా అడ్డుకొని నొప్పిలేకుండా చేస్తుంది.

Paracetamol ఉపయోగాలు:

కొన్ని రుగ్మతలలో వేరే ఇతర మందులతో పాటుగా వాడే Counter medication గా Paracetamol ను సిఫార్సు చేయడం జరుగుతుంది. కొన్ని తీవ్రమైన రుగ్మతలు, ఉదాహరణకు కాన్సర్ లేదా ఏదైనా శస్త్రచికిత్స తరువాత కలిగే నొప్పిని తగ్గించడానికి ఈ Paracetamol టాబ్లెట్స్ ను సూచిస్తారు. ఈ మెడిసిన్ ను సాధారణంగా టాబ్లెట్స్ రూపంలో, ఇంకా ఇంట్రావీనస్ (ఇంజక్షన్) రూపంలో వాడడం జరుగుతుంది.

పారసిటమాల్ ట్యాబ్లేట్స్ ని కింద పేర్కొన్న వ్యాధులు మరియు లక్షణాల చికిత్సకు, వాటి నియంత్రణ, మరియు నివారణకు ఉపయోగిస్తారు:

అమెజాన్ (Amazon) వంటి ఆన్‌లైన్ స్టోర్స్‌లో లభించే కొన్ని నొప్పి నివారణ పరిష్కార ఉత్పత్తులు.

Paracetamol సైడ్ ఎఫెక్ట్స్:

 • చర్మంపై ఎర్రని దద్దుర్లు
 • అలెర్జీ
 • శ్వాస ఆడకపోవుట
 • జలుబు
 • వికారం
 • కాలేయం పై ప్రభావం
 • రక్త కణాలు తగ్గిపోవడం
 • చర్మంపై బొబ్బలు
 • ముఖ వాపు

Paracetamol వాడే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు:

Paracetamol ను సిఫార్సు చేయబడిన మోతాదు కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు. అలా మోతాదుకు మించి వాడడం తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. పెద్దవారికి సిఫార్సు చేయబడిన గరిష్ట మోతాదు ఒకసారికి ఒక గ్రామ (1000 మి.గ్రా) మోతాదు మరియు రోజుకు నాలుగు గ్రాములు (4000 మి.గ్రా). అదనపు పారాసెటమాల్ ఉపయోగం కాలేయానికి హాని కలిగించవచ్చు. మద్యపానం అలవాటు ఉంటే, ఇంకా రోజుకు ఎక్కువ మోతాదులో మద్యపానం చేసేవారు పారసిటమాల్ ను వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం. మరియు వీరు రోజుకు 2 గ్రాములు (2000 మి.గ్రా) కన్నా అదనంగా ఉపయోగించక  పోవడం శ్రేయస్కరం. పిల్లలకు అయితే పెడియాట్రిక్ తరహా Paracetamol మందులనే వాడాలి. జాగ్రత్తగా మందుల ప్యాకెట్ మీద సూచించిన మోతాదు ఆదేశాలు అనుసరించండి. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలకు డాక్టర్ సలగా లేకుండా వాడకూడదు. పారసిటమాల్ ను వాడే మునుపు మీకు ఏ విధమైన అలర్జీలైనా ఉంటె ముందే డాక్టర్ కు తెలియజేయాలి. పారాసెటమాల్ లో క్రియారహిత (Inactive) పదార్థాలు ఉండవచ్చు, ఇవి అలెర్జీ ప్రతిచర్యలు లేదా ఇతర సమస్యలను కలిగిస్తాయి.

Hot & Cold Pack

Paracetamol వల్ల కలిగే కొన్ని అరుదైన దుష్ప్రభావాలు:

 • మల, మూత్ర విసర్జన రంగులలో మార్పు ఉండవచ్చు
 • వెన్ను నొప్పి (క్రింది భాగం) కలుగవచ్చు
 • పెదవులు, నోటిలో పుళ్ళు, లేదా తెలుపు మచ్చలు
 • స్కిన్ దద్దుర్లు, దద్దుర్లు, లేదా దురద మరియు చర్మంపై చిక్కని ఎరుపు మచ్చలు
 • చలితో, జ్వరం లేదా రెండు కలుగవచ్చు.
 • గొంతు మంట
 • మూత్రం మొత్తంలో ఆకస్మిక క్షీణత
 • అసాధారణ రక్తస్రావం లేదా గాయాల
 • అసాధారణ బలహీనత లేదా అలసట

మోతాదు అధికం అవడం వల్ల కలిగే లక్షణాలు:

 • విరేచనాలు
 • ఆకలి కోల్పోవడం
 • చెమటలు అధికంగా పట్టడం
 • కడుపు నొప్పి
 • వికారం లేదా వాంతులు
 • నొప్పి, వాపు, ఉదరం లేదా కడుపు ప్రాంతంలో ఇబ్బంది

సాధారణ హెచ్చరిక:

అధిక మోతాదు:

సూచించిన మోతాదు కంటే ఎక్కువ తీసుకోవడం హానికరమైన దుష్ప్రభావాలకు కారణం కావచ్చు. మీరు ఏవైనా దుష్ప్రభావాలకు లోనైనపుడు వెంటనే, మీ డాక్టర్ను సంప్రదించండి. వివిధ మోతాదు రూపాల్లో మార్కెట్లో పారాసెటమాల్ లభిస్తుంది. మితిమీరిన మోతాదును నివారించేందుకు ఈ మెడిసిన్ ను తీసుకునే ముందు జాగ్రత్తగా లేబుల్ని చదవండి.

Paracetamol ను ఎపుడైనా సమయానికి వేసుకోవలసిన డోస్ మర్చిపోయినపుడు:

ఎపుడైనా సమయానికి వేసుకోవడం మర్చిపోతే వీలైనంత తొందరగా తీసుకోవడానికి ప్రయత్నించాలి. లేదా సమయం మించిపోయి తరువాతి డోస్ తీసుకోవలసిన సమయం దగ్గర పడ్డపుడు ఆ ఒక్క డోస్ మాత్రమె వేసుకావాలి తప్ప అదనంగా రెండు పూటల డోస్ లు కలిపి వాడకూడదు.

గర్భిణీ స్త్రీలు

Paracetamol ను చాలా అవసరం అయితే తప్ప గర్భిణి స్త్రీలకు వాడకూడదు. అదికూడా సరైన డాక్టర్ సలహా మేరకే వాడాలి. గర్భ సమయంలో దీనిని వాడడం వల్ల కలిగే ప్రయోజనాలకంటే నష్టాలే ఎక్కువ అనవచ్చు. కనీ దీనివల్ల గర్భంలోని శిశువుకు ఎటువంటి హాని కలుగకపోవచ్చు, కానీ డాక్టర్ సలహా మేరకు మాత్రమె వాడడం శ్రేయస్కరం.

పాలిచ్చే తల్లులలో

పాలిచ్చే తల్లులు పారసిటమాల్ ను వాడడం శ్రేయస్కరమే, కానీ డాక్టర్ సలహా మేరకు వాడడం ఉత్తమం.

పారాసెటమాల్ టాబ్లెట్ ఇతర ప్రత్యామ్నాయాలు:

క్రింద పేర్కొన్న మందులను Paracetamol కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. వీటిలో కూడా Paracetamol తో సమానమైన రసాయన మిశ్రమం (composition) ఉంటుంది.

 • PCM 500 MG Tablet
 • Lupicin 500 MG Tablet
 • Macfast 500 MG Tablet
 • Acticin 500 MG Tablet
 • Ultragin 500 MG Tablet

మీకు దగ్గరలో అనుభవజ్ఞుడైన డాక్టర్ అందుబాటులో లేనట్లయితే, మీరు ఈ form ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.

Error: Contact form not found.

Paracetamol in Telugu, Paracetamol uses in Telugu, Paracetamol side effects in Telugu

Reviews

Paracetamol - పారసిటమాల్ ఉపయోగాలు
4.0 rating based on 12,345 ratings
Overall rating: 4 out of 5 based on 1 reviews.

★★★★☆
I want to imformation total tablet name and how to uses in tablets
- Ramavath sairam rathod
Name
Email
Rating
Review

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *