Osteoporosis in woman

ఎందుకు స్త్రీలలో Osteoporosis వచ్చే ప్రమాద౦ ఎక్కువగా ఉ౦ది?

ఒక అధ్యయనం 45 సంవత్సరాలు వయసు పైబడిన మహిళల్లో ఆస్టియోపొరోసిస్ (Osteoporosis) వ్యాధి ప్రమాదాన్ని విశ్లేషించింది. ఈ అధ్యయనం ప్రకారం మహిళల్లో ఎముకల ఖనిజ సాంద్రత సగం కంటే మరింత తక్కువ ఉందని తెలిసింది! ఎముక ఖనిజ సాంద్రత ఒక రకమైన పరీక్ష. ఇది మీ ఎముకల యొక్క మొత్తం బలాన్ని సూచిస్తుంది. ఎముక ఖనిజ సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు, ఎముకలకు చిన్న గాయాలు కూడా పగుళ్లకు (fractures) కారణమవుతాయి.

భారతదేశంలో ప్రతి ముగ్గురు మహిళల్లో(మెనోపాజ్ తర్వాత) ఒకరికి, అలాగే పురుషులు(60 సంవత్సరాలకు పైబడి) కూడా ఈ వ్యాధిబారిన పడుతుంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.

Osteoporosis కలిగే ప్రమాదం ఉండడానికి కారణాలు:

  1. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న జనాభా లో సరైన పోషకాహారం అందకపోవడం వల్ల ఈ వ్యాది బారినపడుతున్నారు.
  2. మహిళల్లో, ఎవరైతే ఎక్కువగా ఇళ్ళలోనే ఉండేవారు మరియు సంప్రదాయ అలంకరణలో ఎక్కువగా ఉండేవారిలో అనగా “చీర” మరియు “బురఖా”, “సల్వార్ కమీజ్” ఇలాంటివి మన శరీరానికి సూర్యరశ్మి తగలకుండా చేస్తాయి. తక్కువ విటమిన్ డి, కాల్షియం శోషణ తగ్గిస్తుంది.
  3. ఆధునిక జీవన శైలి మరియు నగరాలలో పనిచేసే వారు రోజంతా ఆఫీసులోనే ఎక్కువ సమయం గడుపుతారు. దీని వల్ల తగిన సూర్యరశ్మి వీరి శరీరానికి అందదు.
  4. యువతులు మరియు మహిళలు ఎవరైతే పోషకాహారాన్ని లేదా పాల పదార్థాలకు దూరంగా ఉంటారో అలాంటి వారిలో వయసు పైబడిన తరువాత ఆస్టెయోపొరోసిస్ తో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  5. ఇకస్త్రీలలో రుతుక్రమం ఆగిపోయి (మెనోపాజ్), ఈస్ట్రోజన్ తగ్గిపోయినప్పుడు ఖనిజసాంద్రత తగ్గిపోవడం మరో కారణం.

మీ ఎముకలు 30 సంవత్సరాల వరకు ధృడంగా మరియు బల౦గా పెరుగుతాయి. ఆ తరువాత, ఎముకలు వాటి సాంద్రత కోల్పోవడం మొదలవుతుంది. అయితే మీరు యుక్తవయస్సులో ఉన్నప్పుడే  తగినంత కాల్షియంతో కూడిన ఆహారం సమృద్ధిగా తీసుకోకపోతే, తరువాత వయసులో ఈ వ్యాధి బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆస్టియోపొరోసిస్ (Osteoporosis) వృద్ధ మహిళల్లో, పురుషులలో తుంటి పగుళ్లకు మరియు వెన్నుపూస పగుళ్లకు ప్రధాన కారణం. ఆస్టియోపొరోసిస్ వ్యాది ప్రతి ముగ్గరు మహిళల్లో ఒకరికి పగుళ్ళకు (fractures) కారణమవుతుంది.

Osteoporosis – సాధారణ నివారణ పద్దతులు:

  1. ప్రతిరోజు మంచి ఆరోగ్యకరమైన పోషకాహరన్ని, అనగా పాల పదార్ధాలు మరియు కాల్షియ౦ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
  2. కనీసం మీ శరీరానికి ఐదు నిమిషాల సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి. మరియు వీలైనంత వరకు అన్ని శరీర భాగాలకు సూర్యరశ్మి తాకేలా చూసుకోవాలి.
  3. తల్లితండ్రులు పిల్లలకు తగిన పోషకాహారం మరియు విటమిన్ D కలిగిన ఆహారం అందేలా చూసుకోవాలి. దీని వల్ల బాల్యంలో సరైన పోషకాహరం అందక తర్వాత వయసులో ఆస్టియోపొరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది.

రోజుకు తీసుకోవలసిన కాల్షియం పరిమాణం

 Sources:

  1. Journal of Midlife Health, 2011 Jul-Dec; 2(2): 81–85.
  2. International Osteoporosis Foundation
  3. Photo credit: R.H.Sumon™ via Foter.com / CC BY-NC-SA

Reviews

ఎందుకు స్త్రీలలో Osteoporosis వచ్చే ప్రమాద౦ ఎక్కువగా ఉ౦ది?
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.
Name
Email
Rating
Review

 

 

 

 

 

2 thoughts on “ఎందుకు స్త్రీలలో Osteoporosis వచ్చే ప్రమాద౦ ఎక్కువగా ఉ౦ది?

    • It’s a very good question. It is quite understandable that due to various reasons such as clothing and indoor working, women may not be able to get adequate exposure to sunlight to meet the Vitamin D requirements. Further, as we age, our skin becomes less efficient in making Vitamin D from sun exposure. Therefore, every woman should get the Vitamin D level checked once after crossing the age of 45 or 50. If the tests indicate a deficiency of Vitamin D, it can easily be cured by taking the Vitamin D supplements.

      The other thing to watch out for is that there should be enough Calcium in the diet while you take Vitamin D supplements through regular intake of dairy products like milk, and other sources of Calcium.

      https://www.healthclues.net/blog/en/poor-mans-rich-calcium-diet/

      Women are more susceptible to Osteoporosis which causes bones to become brittle and prone to fracture. A Calcium rich diet, Vitamin D and some form of regular exercise such as walking can really help all these diseases at a distance. Hope this helps.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *