Naproxen-Uses-Side-Effects

Naproxen tablets – ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్

Naproxen అనేది ఒక NSAID (నాన్-స్టెరాయిడల్ యాంటి-ఇన్ఫ్లమేటరి డ్రగ్). ఈ మెడిసిన్ ను రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid arthritis), ఆస్టియో ఆర్థరైటిస్ (Osteoarthritis), బాల్య ఆర్థరైటిస్ (Juvenile arthritis), ఆంకోలోజింగ్ స్పాండిలైటిస్ (Ankylosing spondylitis), బర్సైటిస్ (Bursitis), టెండినిటిస్ (Tendinitis), గౌట్ (gout), మరియు స్త్రీలలో రుతుపరమైన నొప్పులను (menstrual cramps) నివారించడానికి సిఫార్సు చేస్తారు. ఇది శరీరంలో నొప్పికి కారణమయ్యే హార్మోన్ల పై ప్రభావితం చూపడం వల్ల నొప్పిని తగ్గిస్తుంది.

Naproxen మెడిసిన్ గురించి ఇంగ్లీషులో చదవండి

Naproxen ఎలా పని చేస్తుంది?

మన శరీరంలో అసలు నొప్పికి కారణమైన ప్రోస్టాగ్లాన్డిన్స్ అనే రసాయనాలను తయారుచేసే cyclooxygenase (సైక్లో-ఆక్సిజినేజ్) అనే ఎంజైములను, Naproxen Tablet అదుపు చేస్తుంది. తద్వారా నొప్పిని తగ్గిస్తుంది.

Naproxen ఉపయోగాలు – Naproxen uses:

క్రింద పేర్కొన్న రుగ్మతల వల్ల కలిగే నొప్పుల నివారణకు ఉపయోగపడుతుంది:

 • ఆస్టియో ఆర్థరైటిస్
 • రుమటాయిడ్ ఆర్థరైటిస్
 • జువెనైల్ ఆర్థరైటిస్
 • ఆంకోలోజింగ్ స్పాండిలైటిస్
 • సోరియాటిక్ ఆర్థరైటిస్

ఆస్టియో ఆర్థరైటిస్ – Osteoarthritis

ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్లనొప్పి, మోకాళ్ళనొప్పి, తొంటినొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలనుండి ఉపశమనానికి Naproxen ఉపయోగ పడుతుంది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ – Rheumatoid Arthritis

రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ల నొప్పి, వాతం వంటి లక్షణాలను నియంత్రించడానికి ఉపయోగ పడుతాయి.

డిస్మెనోరియా – Dysmenorrhea

Naproxen ను స్త్రీలలో ఋతుసమయంలో కలిగే నొప్పులనుండి ఉపశమనానికి సిఫార్సు చేస్తారు.

జ్వరం మరియు నొప్పి

Naproxen మెడిసిన్ జ్వరం, నొప్పి, వాపు లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

అంతేకాక ఈ మెడిసిన్ యొక్క మరికొన్ని ఉపయోగాలు:

 • తలనొప్పి
 • గౌట్ ఆర్థరైటిస్
 • స్త్రీల ఋతు సమయ నొప్పి
 • కండరాల నొప్పులు
 • వెన్నునొప్పి
 • దంతాల నొప్పులు
 • భుజం కాపు తిత్తుల – Shoulder bursitis
 • టెండినిటిస్ – Tendinitis

Naproxen వాడకూడని కొన్ని సందర్భాలు:

అలెర్జీ – Allergy

ఇతర NSAID రకానికి చెందిన ఏ ఇతర మందులైన పడని వారు వీటిని వాడ కూడదు

ఆస్థమా – Asthma

ఆస్థమా లేదా ఊపిరి తిత్తులకు సంభందించిన ఏ ఇతర సమస్యలైన ఉన్నపుడు వీటిని సిఫార్సు చేయరు

రక్తస్రావం – Bleeding

శరీరంలో ఏదైన రక్తస్రావం జరుగుతుంటే కూడా ఈ మెడిసిన్ సిఫార్సు చేయరు. ఇలాంటపుడు ఇది వాడడం వల్ల శరీరంలో అంతర్గతంగా ఉదాహరణకు ప్రేగులలో రక్తస్రావం ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది

మిటిగేట్ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేదా దుష్ప్రభావాలు – Naproxen side effects:

 • Naproxen మెడిసిన్ ను దీర్ఘకాలం పాటు వాడడం వల్ల, ముఖ్యంగా ధూమపానం చేసేవారిలో, ఇంకా వీరికి వంశపారంపర్యంగా అధిక రక్తపోటు, మరియు గుండె జబ్బు ఉన్నవారిలో, హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 • మలబద్దకం కలగవచ్చు
 • విరేచనాలు
 • పొత్తి కడుపు నొప్పి
 • వికారం
 • వాంతులు
 • అజీర్ణం
 • నోటిలో పుళ్ళు
 • పద్ద ప్రేగు సమస్యలు
 • మితిమీరిన దాహం
 • తలనొప్పి
 • మైకంగా ఉండడం
 • మగత
 • చేతులు లేదా కాళ్ళలో బర్నింగ్ లేదా తిమ్మిర్లు
 • వినికిడి సమస్యలు
 • చెవులులో శబ్దాలు వినిపించడం

Naproxen గురించి వైద్యులు ఇచ్చే సలహా

 • గర్భవతులు, పాలిచ్చే తల్లులు, డాక్టర్ సలహా మేరకే వాడాలి.
 • ఈ మెడిసిన్ ను దీర్ఘకాలం పాటు వాడడం వల్ల కిడ్నీ సమస్యలు కలుగవచ్చు, కడుపులో రక్తస్రావం కలుగవచ్చు.
 • ఎక్కువ కాలం Naproxen వాడటం వల్ల గుండెపోటు, రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడం లేదా స్ట్రోక్ వంటివి కలిగే ప్రమాదాన్ని పెంచుతుంది.
 • ఇంతక మునుపు ఏమైనా లివర్ లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ మెడిసిన్ వాడే ముందు డాక్టర్ ను సంప్రదించాలి.
 • ఏమైనా ఆహారం తిన్న తరువాతనే ఈ మెడిసిన్ ను వాడాలి. లేదంటే కడుపులో ఇబ్బంది కలుగవచ్చు.

Naproxen tablet వాడేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:

కొన్నిసార్లు కొన్ని రకాల రుగ్మతలు ఉన్నవారికి కొన్ని రకాల మందులు పడకపోవచ్చు. కనుక Naproxen Tablets వాడేప్పుడు కూడా జాగ్రత్త వహించడం మంచిది. డాక్టర్ ను సంప్రదించి వాడడం ఉత్తమం.

 • అల్సర్ తో బాధ పడుతున్నవారు, Crohn’s disease లేదా ulcerative colitis వంటి ప్రేగులకు సంభందించిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు
 • ఆస్థమా, లేదా వేరే ఏ రకమైన అలెర్జీ రుగ్మతలు ఉన్నా
 • గర్భిణిలు, పాలు ఇచ్చే తల్లులు తప్పని సరిగా డాక్టర్ సలహా మేరకే వాడాలి
 • బి.పి. – అధిక రక్తపోటు ఉన్నా
 • గుండె సంభంధ ఆరోగ్య సమస్యలు ఉంటె
 • కొంతమందిలో రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలంటి వారి జాగ్రత్త వహించాలి
 • వేరే ఏ ఇతర నొప్పి నివారణ మందుల వల్ల అయినా ఇంతకూ మునుపు పాడనీ వారు (Aspirin, Ibuprofen, మరియు Diclofenac, Indometacin వంటి మందులు పడని వారు)
 • కిడ్ని, లేదా లివర్ సమస్యలు ఉన్న వారు

Naproxen tablet వాడకం పట్ల కొన్ని హెచ్చరికలు:

ఓవర్ డోసెజ్

మోతాదుకు మించి వాడడం కొన్ని తీవ్ర దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కలిగినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవాలి.

సమయానికి వేఉకోవలసిన డోస్ మిస్ అయినపుడు

ఎపుడైనా పొరపాటున వేసుకోవలసిన డోస్ మర్చిపోతే, వీలైనంత వెంటనే వేసుకోవాలి. ఒకవేళ తదుపరి డోస్ కు సమయం దగ్గర పద్దపుడు ఆ పూట వేసుకోవలసిన డోస్ వేసుకోవాలే తప్ప అదనంగా రెండు డోస్ లు కలిపి వేసుకోకూడదు. అదనపు డోస్ వేసుకోకూడదు.

గర్భిణి స్త్రీలలో

తప్పనిసరి అయితే తప్ప గర్భిణి స్త్రీలకు ఈ Naproxen Tablet సిఫార్సు చేయబడదు. వీరు ఈ మందు వాడడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. గర్భంలోని శిశువుకు అయితే హాని కలుగవచ్చు అనే ఋజువులేమీ లేవు కానీ, వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

పాలిచ్చే తల్లుల్లో

Naproxen Tablet ను వీరు వాడవచ్చు, కానీ వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

Naproxen టాబ్లెట్స్ కు కొన్ని ప్రత్యామ్నాయ మెడిసిన్స్:

 • Arthopan–Crescent Therapeutics Ltd
 • Artagen–Sun Pharmaceutical Industries Ltd
 • Naprosyn–RPG Life Sciences Ltd
 • Proxidom– Arinna Lifescience Pvt
 • Napexar–RPG Life Sciences Ltd
 • Naproz–Sigmund Promedica

మీకు దగ్గరలో అనుభవజ్ఞుడైన డాక్టర్ అందుబాటులో లేనట్లయితే, మీరు ఇక్కడ మమ్మల్ని సంప్రదించవచ్చు.

  Reviews

  Naproxen tablets – ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్
  0.0 rating based on 12,345 ratings
  Overall rating: 0 out of 5 based on 0 reviews.
  Name
  Email
  Review Title
  Rating
  Review Content

   

   

   

   

   

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *