Mitigate Tablet Uses

Mitigate Tablet – మిటిగేట్ టాబ్లెట్ ఉపయోగాలు

Mitigate Tablet SR అనేది ఒక NSAID (నాన్-స్టెరాయిడల్ యాంటి-ఇన్ఫ్లమేటరి డ్రగ్). ఈ మెడిసిన్ ను రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid arthritis), ఆస్టియో ఆర్థరైటిస్ (Osteoarthritis), మరియు ఆంకోలోజింగ్ స్పాండిలైటిస్ (Ankylosing spondylitis) వంటి రుమాటిక్ రుగ్మతల వల్ల కలిగే నొప్పుల నివారణలో ఉపయోగ పడుతుంది. మన శరీరంలో అసలు నొప్పికి కారణమైన ప్రోస్టాగ్లాన్డిన్స్ అనే రసాయనాలను తయారుచేసే COX (సైక్లో-ఆక్సిజినేజ్) అనే ఎంజైములను, Mitigate Tablet అదుపు చేస్తుంది. తద్వారా నొప్పిని తగ్గిస్తుంది. ఈ మెడిసిన్ టాబ్లెట్ రూపంలో లభిస్తుంది. ఈ మెడిసిన్ గర్భవతులు, పాలు ఇచ్చే స్త్రీలు, మరియు చిన్న పిల్లలకు సిఫార్సు చేయరు.

Mitigate Tablet ఉపయోగపడే కొన్ని ఆరోగ్య పరిస్థుతులు:

రుమటాయిడ్ ఆర్థరైటిస్ – Rheumatoid Arthritis

రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పుల నియంత్రణకు సిఫార్సు చేస్తారు

ఆస్టియో ఆర్థరైటిస్ – Osteoarthritis

ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ళనొప్పులు, మోకాళ్ల నొప్పులు, తొంటి నొప్పి, వెన్ను నొప్పి వంటి వాటిని నియంత్రించడానికి సిఫార్సు చేస్తారు

ఆంకోలోజింగ్ స్పాండిలైటిస్ – Ankylosing Spondylitis

ఆంకోలోజింగ్ స్పాండిలైటిస్ వల్ల కలిగే వెన్ను నొప్పికి నివారణ మందుగా ఈ Mitigate Tablet లను సిఫార్సు చేస్తారు

Mitigate Tablet యొక్క ఇతర ఉపయోగాలు:

  • బెనుకులు, మరియు కండరాల నొప్పులు
  • మూత్రపిండాల్లో రాళ్ళు మరియు పిత్తాశయ రాళ్ళు వంటి సందర్భాల్లో కలిగే తేలికపాటి నొప్పిని తగ్గించడానికి
  • మైగ్రెయిన్ – Migraine
  • స్త్రీల రుతుస్రావం సమయంలో నొప్పిని తగ్గించడానికి – Dysmenorrhea(painful periods or menstrual cramps)
  • కాపు తిత్తుల వాపు – Bursitis
  • స్నాయువుల నొప్పి (ఎముకలను మరియు కండరాలను కలిపే టెన్డన్ల వాపు) – Tendinitis
  • కండరాల ఇన్ఫ్లమేషన్ – Polymyositis (inflammation of muscles)
  • దంత నొప్పి
  • TMJ (టెంపోరోమ్యాండిబ్యులర్ జాయింట్) దవడల నొప్పి – TMJ (temporomandibular joint) pain

Mitigate Tablet ను సిఫార్సు చేయని సందర్భాలు:

అలెర్జీ – Allergy

ఇతర NSAID రకానికి చెందిన ఏ ఇతర మందులైన పడని వారు వీటిని వాడ కూడదు

ఆస్థమా – Asthma

ఆస్థమా లేదా ఊపిరి తిత్తులకు సంభందించిన ఏ ఇతర సమస్యలైన ఉన్నపుడు వీటిని సిఫార్సు చేయరు

రక్తస్రావం – Bleeding

శరీరంలో ఏదైన రక్తస్రావం జరుగుతుంటే కూడా ఈ మెడిసిన్ సిఫార్సు చేయరు. ఇలాంటపుడు ఇది వాడడం వల్ల శరీరంలో అంతర్గతంగా ఉదాహరణకు ప్రేగులలో రక్తస్రావం ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది

మిటిగేట్ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేదా దుష్ప్రభావాలు – Mitigate Tablet side effects:

ఈ మెడిసిన్ వల్ల ఉపయోగాలే కాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగవచ్చు. ఈ మెడిసిన్ ఉపయోగించడం వల్ల ఏదైనా ఇబ్బందికర సూచనలు అనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి

  • చర్మం దద్దుర్లు
  • మత్తుగా అనిపించడం
  • దురద, ఎక్కువగా చెమటలు పట్టడం
  • వికారం, వాంతులు
  • పొత్తికడుపులో నొప్పి
  • మలబద్దకం అనిపించడం
  • నీళ్ల విరేచనాలు
  • వాంతులు
  • రక్తపోటు (బిపి) పెరగడం

Mitigate Tablet వాడకం పట్ల డాక్టర్లు ఇచ్చే సలహా:

  • కొద్దికాలం పాటు మాత్రమే వాడినపుడు ఈ మెడిసిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది
  • ఎక్కువ మోతాదులో వాడడం, లేదా ఎక్కువ కాలంపాటు వాడడం వల్ల కిడ్నిలకు హానికరం అవుతుంది ఇంకా జీర్ణాశయంలో రక్తస్రావం కావచ్చు
  • కిడ్నీ సమస్య ఉన్నవారు ముందే డాక్టర్ కు తెలియజేయాలి, వీరి విషయంలో ఈ మెడిసిన్ మోతాదులో వారికి అనుగుణంగా మార్పులు అవసరం కావచ్చు (డాక్టర్ సూచిస్తారు)
  • మద్యపానం చేసినపుడు ఈ Mitigate Tablet ను తీసుకోకూడదు, అలా వాడడం లివర్ కు హానికరం కావచ్చు
  • పొరపాటున ఎపుడైనా మోతాదుకు మించి ఈ Mitigate Tablet ను వాడినట్లయితే, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి

కొన్ని సాధారణ హెచ్చరికలు:

ఓవర్ డోసెజ్

మోతాదుకు మించి వాడడం కొన్ని తీవ్ర దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కలిగినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవాలి.

సమయానికి వేఉకోవలసిన డోస్ మిస్ అయినపుడు

ఎపుడైనా పొరపాటున వేసుకోవలసిన డోస్ మర్చిపోతే, వీలైనంత వెంటనే వేసుకోవాలి. ఒకవేళ తదుపరి డోస్ కు సమయం దగ్గర పద్దపుడు ఆ పూట వేసుకోవలసిన డోస్ వేసుకోవాలే తప్ప అదనంగా రెండు డోస్ లు కలిపి వేసుకోకూడదు. అదనపు డోస్ వేసుకోకూడదు.

గర్భిణి స్త్రీలలో

తప్పనిసరి అయితే తప్ప గర్భిణి స్త్రీలకు ఈ Mitigate Tablet సిఫార్సు చేయబడదు. వీరు ఈ మందు వాడడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. గర్భంలోని శిశువుకు అయితే హాని కలుగవచ్చు అనే ఋజువులేమీ లేవు కానీ, వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

పాలిచ్చే తల్లుల్లో

Mitigate Tablet ను వీరు వాడవచ్చు, కానీ వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

Mitigate Tablet వాడేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:

కొన్నిసార్లు కొన్ని రకాల రుగ్మతలు ఉన్నవారికి కొన్ని రకాల మందులు పడకపోవచ్చు. కనుక Mitigate Tablets వాడేప్పుడు కూడా జాగ్రత్త వహించడం మంచిది. డాక్టర్ ను సంప్రదించి వాడడం ఉత్తమం.

  • ఆస్థమా, లేదా వేరే ఏ రకమైన అలెర్జీ రుగ్మతలు ఉన్నా
  • గర్భిణిలు, పాలు ఇచ్చే తల్లులు తప్పని సరిగా డాక్టర్ సలహా మేరకే వాడాలి
  • బి.పి. – అధిక రక్తపోటు ఉన్నా
  • అల్సర్ తో బాధ పడుతున్నవారు, Crohn’s disease లేదా ulcerative colitis వంటి ప్రేగులకు సంభందించిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు
  • గుండె సంభంధ ఆరోగ్య సమస్యలు ఉంటె
  • కొంతమందిలో రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలంటి వారి జాగ్రత్త వహించాలి
  • వేరే ఏ ఇతర నొప్పి నివారణ మందుల వల్ల అయినా ఇంతకూ మునుపు పాడనీ వారు (Aspirin, Ibuprofen, మరియు Diclofenac, Indometacin వంటి మందులు పడని వారు)
  • SLE (systemic lupus erythematosus) వంటి కనెక్టివ్ కణజాల రుగ్మత ఉన్నవారు
  • కిడ్ని, లేదా లివర్ సమస్యలు ఉన్న వారు

Mitigate టాబ్లెట్స్ కు కొన్ని ప్రత్యామ్నాయ మెడిసిన్స్ – Substitutes for Mitigate:

క్రింద పేర్కొన్న కొన్ని టాబ్లెట్లలో Mitigate టాబ్లెట్లతో సరిసమానమైన, కాంబినేషన్, డోస్, మరియు సామర్ధ్యం ఉంటుంది కనుక వీటిని డోలో టాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు:

  • Aroff 200 MG Tablet SR
  • Acuflam 200 MG Tablet SR
  • Artigag 200 MG Tablet SR
  • Valus Sr 200 MG Tablet SR
  • Dolokind 200 MG Tablet SR

మీకు దగ్గరలో అనుభవజ్ఞుడైన డాక్టర్ అందుబాటులో లేనట్లయితే, మీరు ఇక్కడ మమ్మల్ని సంప్రదించవచ్చు.

Mitigate Tablet in Telugu, Mitigate Tablet uses in Telugu

 

Reviews

Mitigate Tablet – మిటిగేట్ టాబ్లెట్ ఉపయోగాలు
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *