Ibuprofen uses in Telugu

Ibuprofen Tablets – ఐబుప్రోఫెన్ టాబ్లెట్ ఉపయోగాలు

Ibuprofen ఒక నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ (NSAIDs) మెడిసిన్. జ్వరాన్ని తగ్గించడానికి మరియు ఆర్థరైటిస్, తలనొప్పి, పంటి నొప్పి, వెన్ను నొప్పి, స్త్రీలలో ఋతు సమయంలో కలిగే నొప్పి నివారణ లేదా చిన్నపాటి గాయాల వల్ల కలిగే పలు రకాల నొప్పులను లేదా వాపును తగ్గించడానికి Ibuprofen (ఐబుప్రోఫెన్) ఉపయోగపడుతుంది. ఈ మెడిసిన్ పెద్దలకు మరియు కనీసం ఆరు నెలల వయస్సు పైబడ్డ పిల్లలకు  ఉపయోగించబడుతుంది.

Ibuprofen మెడిసిన్ గురించి ఇంగ్లీషులో చదవండి

Ibuprofen ఎలా పని చేస్తుంది? – How does Ibuprofen work?

ఇది cyclooxygenase (సైక్లో అక్సిజినేజ్) అనబడే ఎంజైమ్ ను అదుపు చేస్తుంది. శరీరానికి ఏదైనా దెబ్బ లేదా గాయం అయినపుడు, ఈ ఎంజైమ్ prostaglandins (ప్రోస్టాగ్లాన్డిన్స్) అనే రసాయనాలను విదుల చేస్తుంది. నొప్పి వాపు కలగాడానికి రసాయనాలే కారణం. కనుక ఐబుప్రోఫెన్ మెడిసిన్, సైక్లో అక్సిజినేజ్ అనే ఎంజైమ్ ను అదుపు చేయడం వల్ల ప్రోస్టాగ్లాన్డిన్స్ రసాయనాలు తక్కువ విడుదల అవుతాయి, తద్వారా నొప్పి ఇంకా వాపు తగ్గుతాయి. ఐబుప్రోఫెన్ యొక్క ప్రభావం సుమారు 30 నుండి 60 నిమిషాల లోపు పని చేయడం మొదలవుతుంది.

ఐబుప్రోఫెన్ ఉపయోగాలు – Ibuprofen uses:

ఆస్టియో ఆర్థరైటిస్ – Osteoarthritis

ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కలిగే కీల్లనోప్పి, తొంటినోప్పి(హిప్ పెయిన్), మెడనొప్పి, వెన్నునొప్పి వంటి నొప్పులను మెరుగు పరచడానికి సిఫర్సు చేస్తారు

రుమటాయిడ్ ఆర్థరైటిస్ – Rheumatoid Arthritis

రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్లనొప్పులను, మరియు వాపులను తగ్గించడానికి సిఫార్సు చేస్తారు

డిస్మెనోరియా – Dysmenorrhea

స్త్రీలలో ఋతు సంభంధ నొప్పులను తగ్గించడానికి సిఫార్సు చేస్తారు

జ్వరం మరియు నొప్పి – Fever and Pain

Ibuprofen ను తలనొప్పి, వెన్నునొప్పి, మరియు జ్వరం నియంత్రణకు సిఫార్సు చేస్తారు

Ibuprofen యొక్క ఇతర ఉపయోగాల:

 • కండరాల నొప్పి మరియు కీళ్ళు బెణుకులు
 • మూత్రపిండాల్లో లేదా పిత్తాశయంలో రాళ్ళు ఉన్న సందర్భాల్లో కలిగే తేలికపాటి నొప్పి నివారణకు
 • Bursitis – బర్సైటిస్ (కాపు తిత్తుల వాపు ఉన్నపుడు)
 • Migraine – మైగ్రేయిన్ తలనొప్పికి
 • Tendinitis – టెండినైటిస్ (ఎముకలు మరియు కండరాలను కలిపే టెన్డాన్ లు లేదా స్నాయువుల వాపు)
 • Polymyositis (inflammation of muscles) – పాలీ మయో సిస్టిస్ అంటే కండార వాపు
 • TMJ (temporomandibular joint) pain – దవడల నొప్పి
 • Dental pain – దంతసమస్య వల్ల వచ్చే నొప్పు

Ibuprofen ను సిఫార్సు చేయబడని సందర్భాలు:

అలెర్జీ – Allergy

Ibuprofen లేదా ఇతర NSAID రకానికి చెందిన ఏ ఇతర మందులైన పడని వారు వీటిని వాడ కూడదు

ఆస్థమా – Asthma

ఆస్థమా లేదా ఊపిరి తిత్తులకు సంభందించిన ఏ ఇతర సమస్యలైన ఉన్నపుడు వీటిని సిఫార్సు చేయరు

రక్తస్రావం – Bleeding

శరీరంలో ఏదైన రక్తస్రావం జరుగుతుంటే కూడా ఈ మెడిసిన్ సిఫార్సు చేయరు. ఇలాంటపుడు ఇది వాడడం వల్ల శరీరంలో అంతర్గతంగా ఉదాహరణకు ప్రేగులలో రక్తస్రావం ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది

Ibuprofen మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేదా దుష్ప్రభావాలు:

 • ఈ మెడిసిన్ పడకపోతే కలిగే ముఖ్య దుష్ప్రభావాలు – పొత్తికడుపులో నొప్పి, చర్మంపై దద్దుర్లు, చెవిలో శబ్దాలు వినపడడం, తలనొప్పి, మైకము, మగతగా ఉండడం, అతిసారం లేదా నీళ్ల విరేచనాలు, వికారం (వాంతి వచ్చేటట్టు ఉండడం), గుండెల్లో మంట, మరియు మలబద్దకం.
 • ప్రేగులలో అల్సర్ కలగడం, కొన్ని సార్లు రక్తస్రావం కూడా ఉండడం వంటి కొన్ని తీవ్ర దుష్ప్రభావాలు
 • అలర్జీ కలగడం, ముఖ్యంగా ఆస్థమా ఉన్నవారిలో ఎక్కువ అవకాశం ఉంటుంది
 • కిడ్నిలకు రక్తప్రసరణ తగ్గడం, మరియు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం

Ibuprofen Tablet వాడకం పట్ల డాక్టర్లు ఇచ్చే సలహా:

 • కొద్దికాలం పాటు మాత్రమే వాడినపుడు ఈ మెడిసిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది
 • ఎక్కువ మోతాదులో వాడడం, లేదా ఎక్కువ కాలంపాటు వాడడం వల్ల కిడ్నిలకు హానికరం అవుతుంది ఇంకా జీర్ణాశయంలో రక్తస్రావం కావచ్చు
 • కిడ్నీ సమస్య ఉన్నవారు ముందే డాక్టర్ కు తెలియజేయాలి, వీరి విషయంలో ఈ మెడిసిన్ మోతాదులో వారికి అనుగుణంగా మార్పులు అవసరం కావచ్చు (డాక్టర్ సూచిస్తారు)
 • మద్యపానం చేసినపుడు ఈ Ibuprofen మెడిసిన్ ను తీసుకోకూడదు, అలా వాడడం లివర్ కు హానికరం కావచ్చు
 • పొరపాటున ఎపుడైనా మోతాదుకు మించి ఈ Ibuprofen మెడిసిన్ ను వాడినట్లయితే, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి

Ibuprofen గురించి కొన్ని సాధారణ హెచ్చరికలు:

ఓవర్ డోసెజ్ – Over dosage:

మోతాదుకు మించి వాడడం కొన్ని తీవ్ర దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కలిగినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవాలి

సమయానికి వేఉకోవలసిన డోస్ మిస్ అయినపుడు – Missing dosage:

ఎపుడైనా పొరపాటున వేసుకోవలసిన డోస్ మర్చిపోతే, వీలైనంత వెంటనే వేసుకోవాలి. ఒకవేళ తదుపరి డోస్ కు సమయం దగ్గర పద్దపుడు ఆ పూట వేసుకోవలసిన డోస్ వేసుకోవాలే తప్ప అదనంగా రెండు డోస్ లు కలిపి వేసుకోకూడదు. అదనపు డోస్ వేసుకోకూడదు.

గర్భిణి స్త్రీలలో – Pregnancy

తప్పనిసరి అయితే తప్ప గర్భిణి స్త్రీలకు ఈ Ibuprofen మెడిసిన్ సిఫార్సు చేయబడదు. వీరు ఈ మందు వాడడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. గర్భంలోని శిశువుకు అయితే హాని కలుగవచ్చు అనే ఋజువులేమీ లేవు కానీ, వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

పాలిచ్చే తల్లుల్లో – Breastfeeding

Ibuprofen ను వీరు వాడవచ్చు, కానీ వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

Diclofenac tablet వాడేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:

కొన్నిసార్లు కొన్ని రకాల రుగ్మతలు ఉన్నవారికి కొన్ని రకాల మందులు పడకపోవచ్చు. కనుక Ibuprofen మెడిసిన్ వాడేప్పుడు కూడా జాగ్రత్త వహించడం మంచిది. డాక్టర్ ను సంప్రదించి వాడడం ఉత్తమం:

 • అల్సర్ తో బాధ పడుతున్నవారు, Crohn’s disease లేదా ulcerative colitis వంటి ప్రేగులకు సంభందించిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు
 • ఆస్థమా, లేదా వేరే ఏ రకమైన అలెర్జీ రుగ్మతలు ఉన్నా
 • గర్భిణిలు, పాలు ఇచ్చే తల్లులు
 • బి.పి. – అధిక రక్తపోటు ఉన్నా
 • గుండె సంభంధ ఆరోగ్య సమస్యలు ఉంటె
 • కొంతమందిలో రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలంటి వారి జాగ్రత్త వహించాలి
 • వేరే ఏ ఇతర నొప్పి నివారణ మందుల వల్ల అయినా ఇంతకూ మునుపు పాడనీ వారు (Aspirin, Naproxen, మరియు Diclofenac, indometacin వంటి మందులు పడని వారు)
 • కిడ్ని, లేదా లివర్ సమస్యలు ఉన్న వారు

Diclofenac టాబ్లెట్స్ కు ప్రత్యామ్నాయ టాబ్లెట్స్:

క్రింద పేర్కొన్న కొన్ని టాబ్లెట్లలో Ibuprofen టాబ్లెట్లతో సరిసమానమైన, కాంబినేషన్, డోస్, మరియు సామర్ధ్యం ఉంటుంది కనుక వీటిని డోలో టాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు:

 • Addaprin
 • Cedaprin
 • Advil
 • I-Prin
 • Motrin
 • Midol
 • NeoProfen
 • Motrin IB
 • Profen IB
 • Ultraprin
 • Proprinal

మీకు దగ్గరలో అనుభవజ్ఞుడైన డాక్టర్ అందుబాటులో లేనట్లయితే, మీరు ఇక్కడ మమ్మల్ని సంప్రదించవచ్చు.

Ibuprofen uses in Telugu, Ibuprofen in Telugu, Ibuprofen benefits in Telugu

Reviews

Ibuprofen Tablets – ఐబుప్రోఫెన్ టాబ్లెట్ ఉపయోగాలు
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.
Name
Email
Review Title
Rating
Review Content

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *