Flax Seeds in Telugu

Flax Seeds in Telugu

ఫ్లాక్స్ సీడ్స్ (Flax Seeds) ను తెలుగులో అవిసె గింజలు అంటారు. అవిసె గింజలను భూమిపై అత్యంత శక్తివంతమైన ఆహారంగా చెప్పుకోవచ్చు. సంస్కృతంలో అవిసె గింజలను “ఉమ” అనే పేరుతొ పిలుస్తారు. క్రీస్తు పూర్వం ౩౦౦౦ కాలం లోనే అవిసె గింజల పెంపకం ఉన్నట్లు చరిత్రలో మనం గమనించవచ్చు.

ఈ రోజుల్లో అవిసె గింజలు చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అవిసె గింజలు (Flax Seeds in Telugu) నేడు చాలా రకాల ఆహారపదార్ధాలలో ఉపయోగిస్తున్నారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మొక్కలు మన గ్రామాలలో కూడా పెరుగుతాయి. అవిసె గింజలలో ఫైబర్ అంటే పీచు పదార్ధం అదికంగా లభ్యం అవుతుంది.

అవిసె గింజలు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి అలాగే గుండె వ్యాధి ప్రమాదాన్ని తగ్గించ గలుగుతాయి మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని కొన్ని వైద్యపరమైన అధ్యయనాలలో నిరూపితమైనది.

అవిసె గింజల (Flax Seeds in Telugu) వల్ల ఉపయోగాలు చాలానే ఉన్నప్పటికీ, ప్రధాన ఉపయోగాలు:

ఒమేగా-3 ఎసెన్షియల్ ఫాటీ యాసిడ్ (Omega-3 essential fatty acid):

అవిసె గింజల్లో ఒమేగా-3 ఎసెన్షియల్ ఫాటీ యాసిడ్ విలువలు అదికంగా ఉండడం వల్ల, ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజల్లో సుమారు 1.8 గ్రాముల ఒమేగా-3 ఉంటుందిట.

లిగ్నన్స్ (Lignans) క్యాన్సర్ తో పోరాడడానికి సహాయపడుతాయి:

అవిసె గింజల్లో లభించే లిగ్నన్స్  (Lignans) లో యాంటి-ఈస్ట్రోజెనిక్ మరియు యాంటి-ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల సమర్థవంతంగా హార్మోన్-సంబంధిత క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

The Health Benefits of Flax seeds – అవిసె గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

అవిసె గింజలు (Flax Seeds in Telugu) కొన్ని రకాల క్యాన్సర్ల అలాగే గుండెపోటు మరియు ఊపిరితిత్తుల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి.

అవిసె గింజలు గుండెకు మంచి చేస్తాయి:

కొన్ని పరిశోధనల అనుసారం మొక్కలనుండి లభించే ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాన్ని కలిగి ఉంటుంది, మరియు హృదయ స్పందనను సమతుల్యం చేస్తుందని వెల్లడైంది. అవిసె గింజల్లోని లిగ్నన్స్ గుండె ఆరోగ్యానికి కూగా చాలా ఉపయోగకరం.

శరీర అధిక బరువు నియంత్రణకు ఉపయోగపడుతాయి:

అవిసె గింజల్లో పీచు పదార్ధం అధికంగాను కార్బోహైడ్రేట్ లు తక్కువగాను ఉంటాయి. అవిసె గింజల యొక్క అత్యంత అసాధారణ ప్రయోజనాల్లో ఒకటి, అవి అధిక స్థాయి మ్యుసిలెజ్ గమ్ కంటెంట్ (mucilage gum content) కలిగి ఉంటాయి. ఈ రకమైన పీచు పదార్ధం నీటిలో కరిగే గుణం కలిగి ఉంటుంది. దీనివల్ల ప్రేగులలో అద్భుతమైన లాభాలను కలిగిస్తుంది. ఇది శరీరంలో అధిక కొవ్వును తగ్గించుకోవడానికి ఉపయోగ పడుతుంది, ఫైబర్ అధికంగా ఉండడం వల్ల నెమ్మదిగా జీర్ణం అవుతుంది, తద్వారా ఎక్కువ సార్లు పిండి పదార్థాలు తినాలన్న కోరికను తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది:

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం వారి అధ్యయనంలో రోజువారి ఆహారంలో ఫ్లాక్స్ విత్తనాలను జోడించడం వల్ల సహజంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు అని కనుగొన్నారు.

అవిసె గింజల్లో (Flax Seeds in Telugu) గ్లుటెన్ ఉండదు:

గ్లుటెన్ అనేది గోధుమలు, బార్లి గింజలలో ఉండే ఒక రకమైన ప్రోటీన్. సిలియాక్ డిసీస్ ఉన్న వారికి సహజంగానే గ్లుటెన్ ఉన్న ఆహారం సహించదు. వీరికి గ్లుటెన్ ఉన్న ఆహారం తీసుకున్నపుడు చిన్న ప్రేగులలో ఇన్ఫ్లమేషన్ కలుగుతుంది. కనుక ఇటువంటివారికి అవిసె గింజలు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కాన్సర్ – అవిసె గింజల ఉపయోగాలు:

అవిసె గింజల వాడకం వల్ల బ్రెస్ట్ కాన్సర్, ఒవెరియన్ కాన్సర్, ప్రోస్టేట్ కాన్సర్, పెద్దప్రేగు కాన్సర్ వంటి కొన్ని కాన్సర్ ల నుండి కూడా కాపాడగలదని కొన్ని పరిశోధనల్లో నిరూపితమైంది. క్లినికల్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్ (clinical cancer research journal) లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, అవిసె గింజలు వాడకం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కనుగొన్నారు.

అవిసె గింజల వల్ల స్త్రీలకు గల ఉపయోగాలు:

అవిసె గింజల్లో ఉన్న లిగ్నన్స్ రుతుక్రమం ఆగిన స్త్రీలకు ప్రయోజనాలు కలిగి ఉన్నాయని అధ్యయనాలలో తేలింది. అవిసె గింజల లక్షణాలు బోలుఎముకల వ్యాధి (ఆస్టియోపొరోసిస్) ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అవిసె గింజలు (Flax Seeds in Telugu) వల్ల కొన్ని ఉపయోగాలు క్లుప్తంగా:

  • క్యాన్సర్ ను నిరోధిస్తుంది
  • జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది
  • అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది
  • గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
  • మధుమేహం నియంత్రిస్తుంది
  • స్త్రీలలో వేడి ఆవిర్లు ను తగ్గిస్తుంది
  • ప్రేగుల కదలికను మెరుగుపరుస్తుంది
  • చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

Flax Seeds in Telugu, Flax Seeds benefits in Telugu, Flax Seeds health benefits in Telugu, Flax Seeds uses in Telugu

Reviews

Flax Seeds in Telugu
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.
Name
Email
Rating
Review

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *