Dolo 650 Tablets ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, జాగ్రత్తలు

Dolo 650 – డోలో 650 గురించి కొన్ని ముఖ్య సూచనలు

Dolo 650 అనేది ఒళ్ళు నొప్పులు మరియు జ్వరం నివారణకు వాడే టాబ్లెట్లలో ఒక రకానికి చెందిన బ్రాండ్ పేరు. ఇది Micro Labs Ltd; మెడికల్ కంపెనీ ద్వారా తయారు అయి, మార్కెటింగ్ చేయబడుతుంది. మార్కెట్ లో Dolo 650 ఒక పట్టీలో 15 టాబ్లెట్స్ చొప్పున లభ్యం అవుతున్నాయి. Dolo 650 టాబ్లెట్ అనేది బ్రాండ్ పేరు మాత్రమే, కానీ అందులో ఉండే మెడిసిన్ Paracetamol (పారాసెటమాల్ ను acetaminophen అని కూడా అంటారు). డోలో-650 ఒక్కో టాబ్లెట్ 650 మి.గ్రాముల మోతాదులో ఉంటుంది. దీని ముఖ్య ఉపయోగాలు ఒంటినొప్పులు మరియు జ్వరం నివారణ.

Dolo 650 మెడిసిన్ గురించి ఇంగ్లీషులో చదవండి

Dolo 650 ఎలా పని చేస్తుంది?

Dolo 650 యొక్క ముఖ్య కంపోనేంట్ Paracetamol. కనుక దీని పనితీరు ముఖ్యంగా రెండు రకాలకు చెందింది. ఒకటి జ్వరాన్ని తగ్గించే గుణాన్ని యాంటిఫైరిటిక్ (antipyretics) అంటారు. రెండు నొప్పులు తగ్గించే గుణాన్ని పెయిన్ కిల్లర్ (analgesics) అంటారు. టాబ్లెట్ల రూపంలో తీసుకున్నపుడు, ఈ మెడిసిన్ ను శరీరం అతివేగంగా గ్రహిస్తుంది, తద్వారా తొందరగా ఉపసమనం కలుగుతుంది.

యాంటిఫైరిటిక్ గుణం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడులోని ఒక భాగంపై పనిచేస్తుంది, చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతే కాక వేడిని తగ్గించి చెమటలు పట్టేలా చేస్తుంది. తద్వారా జ్వరం తగ్గుతుంది. Paracetamol యొక్క అనాల్జెసిక్ (analgesic) గుణం, శరీరానికి నొప్పిని భరించే సామర్ధ్యాన్ని పెంచుతుంది, తద్వారా నొప్పిని తగ్గిస్తుంది.

ఈ మెడిసిన్ పని చేయడానికి అరగంట నుండి గంట సమయం పడుతుంది. ప్రభావం 6 గంటల దాకా ఉంటుంది.

Dolo 650 MG Tablet ఉపయోగాలు:

Dolo 650 టాబ్లెట్ క్రింది వ్యాధులు, లక్షణాల చికిత్స, నియంత్రణ, నివారణకు సిఫార్సు చేయబడుతుంది:

Tynor Hot and Cold Pack

Dolo 650 Tablet ను ఎటువంటి సందర్భాలలో వాడకూడదు:

Dolo 650 tablet ను క్రింది లక్షణాలు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు వాడకూడదు:

 • Allergy – ఎలర్జీ
 • Liver Disease – కాలెయ లేదా లివర్ రుగ్మతలు
 • Analgesic Nephropathy (Kidney Disease) – కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు

Dolo 650 టాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్:

దిగువన పేర్కొన్న కొన్ని సైడ్ ఎఫెక్ట్ లక్షణాలు ఉండవచ్చు. కానీ అందరికీ అన్ని సందర్భాలలో కలుగక పోవచ్చు. డోలో 650 లో ఉండే అన్ని మూలకాల కారణగా కలిగే అవకాశం ఉన్న అన్ని లక్షానాలు క్రింద పేర్కొనడం జరిగింది. ఇక్కడ పెర్కొనబడని కొన్ని ఇతర లక్షాణాలు కూడా కలుగవచ్చు. వీటిలో ఎటువంటి లక్షణాలు ఉన్నా, అవే వెంటనే తగ్గకపోయినా వెంటనే తగిన సలహా కొరకు డాక్టర్ ను సంప్రదించాలి.

 • చర్మం ఎర్రగా మారడం
 • అలెర్జీ రియాక్షన్స్
 • శ్వాస ఆడకపోవుట
 • అనారోగ్య భావన
 • దద్దుర్లు
 • లివర్ డ్యామేజ్
 • గ్యాస్ట్రిక్ / మౌత్ అల్సర్స్
 • రక్తహీనత
 • జలుబు
 • వికారం

DOLO 650 టాబ్లెట్స్ పట్ల డాక్టర్స్ ఇచ్చే సలహా:

 • డోలో టాబ్లెట్స్ స్వల్ప కాలం వాడినపుడు చాలా సురక్షితమైన మెడిసిన్ గా పరిగణించవచ్చు
 • ఎక్కువ మోతాడులో వాడడం వల్ల లివర్/ కాలెయం డ్యామేజ్ కావచ్చు
 • మునుపే మీరు ఏదైనా కాలేయ సంభంధ రుగ్మతలతో బాధపడుతుంటే ముందుగానే డాక్టర్ కు తెలియజేయాలి. దానికి అనుగుణంగా మీ మెడిసిన్ డోస్ ను మార్చవలసి ఉంటుంది
 • మద్యపానం చేసినపుడు ఈ డోలో మెడిసిన్ తీసుకోకపోవడం శ్రేయస్కరం. ఎందుకంటె మందు, డోలో రెంటి కలయిక లివర్ కు ఇంకా ఎక్కువగా నష్టం వాటిల్లేలా చేస్తుంది
 • పొరపాటున ఎక్కువ డోస్ తీసుకున్నట్లయితే, ఇబ్బందిగా ఉన్నట్లయితే, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి

Dolo 650 Tablet – జాగ్రత్తలు మరియు ఎలా ఉపయోగించాలి?

Dolo 650 Tablet వాడే ముందు మీ ఆరోగ్యం పట్ల, ఏమైనా రుగ్మతలు ఉంటె, లేదా మీరు ఏ రకమైన ఇతర మందులు వాడుతున్నా, మీకు ఎటువంటి ఎలర్జీలు ఉన్నా, స్త్రీలయితే గర్భవతులైతే, మునుపే అన్ని వివరాలు డాక్టర్ కు తెలియజేయాలి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు, ఈ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టాబ్లెట్స్ ను డాక్టర్ సూచన మేరకు లేదా టాబ్లెట్స్ బాక్స్/ పట్టీ పై పేర్కొన్న సూచనల ప్రకారమే వాడాలి. మెడిసిన్ డోస్ అనేది రోగి పరిస్థితి మరియు రుగ్మత బట్టి మారుతుంది.

డోలో టాబ్లెట్ ఓవర్ డోసేజ్ అయితే:

Dolo 650 టాబ్లెట్ ను సూచించిన మోతాదు కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల హానికరమైన దుష్ప్రభావాలు కలుగవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనిపించినా వెంటనే డాక్టర్ను లేదా ఫార్మసిస్ట్ ను సంప్రదించాలి. మార్కెట్ లో Dolo 650 టాబ్లెట్స్ పలు రకాల మోతాదుల్లో లభ్యం అవుతాయి. పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించడానికి, టాబ్లెట్స్ వాడే మునుపు లేబుల్ ను జాగ్రత్తగా గమనించాలి.

సమయానికి వేఉకోవలసిన డోస్ మిస్ అయినపుడు

ఎపుడైనా పొరపాటున వేసుకోవలసిన డోస్ మర్చిపోతే, వీలైనంత వెంటనే వేసుకోవాలి. ఒకవేళ తదుపరి డోస్ కు సమయం దగ్గర పద్దపుడు ఆ పూట వేసుకోవలసిన డోస్ వేసుకోవాలే తప్ప అదనంగా రెండు డోస్ లు కలిపి వేసుకోకూడదు. ఎగస్ట్రా డోస్ వేసుకోకూడదు.

డోలో వాడకం పట్ల కొన్ని హెచ్చరికలు:

 • మద్యం తో పాటుగా వీటిని వాడకూడదు. కడుపులో ఏ రకమైన రక్త స్రావం ఉన్న అది ఎక్కువ అవుతుంది
 • గర్భిణి స్త్రీలు డోలో 650 వాడడం అంత శ్రేయస్కరం కాదు. తప్పక డాక్టర్ సలహా తీసుకొని వాడాలి
 • పాలు ఇచ్చే తల్లులు వాడవచ్చు, కానీ వీరు కూడా డాక్టర్ సలహా మేరకు వాడితే మంచిది
 • లివర్ సంభంధ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్య సలహా మేరకు మాత్రమె వాడాలి
 • కిడ్ని సంభంధ సమస్యలు ఉన్న వారు కూడా డాక్టర్ సూచన ప్రకారమే వాడాలి. వీరిలో టాబ్లెట్స్ డోస్ ను వీరికి అనుగుణంగా సూచించడం జరుగుతుంది

Dolo 650 కు ప్రత్యామ్నాయ టాబ్లెట్స్:

క్రింద పేర్కొన్న కొన్ని టాబ్లెట్లలో Dolo 650 MG Tablet తో సరిసమానమైన, కాంబినేషన్, డోస్, మరియు సామర్ధ్యం ఉంటుంది కనుక వీటిని డోలో టాబ్లెట్లకు  ప్రత్యామ్నాయంగా వాడవచ్చు

 • Paarmol 650 MG Tablet
 • Glenpar 650 MG Tablet
 • P U C 650 MG Tablet
 • T98 650 MG Tablet
 • Welset 650 MG Tablet

మీకు దగ్గరలో అనుభవజ్ఞుడైన డాక్టర్ అందుబాటులో లేనట్లయితే, మీరు ఇక్కడ మమ్మల్ని సంప్రదించవచ్చు.

  Dolo 650 MG Tablet in Telugu, Dolo 650 MG Tablet uses in Telugu

  Reviews

  Dolo 650 – డోలో 650 గురించి కొన్ని ముఖ్య సూచనలు
  5.0 rating based on 12,345 ratings
  Overall rating: 5 out of 5 based on 1 reviews.
  Name
  Email
  Review Title
  Rating
  Review Content

   

   

   

   

   

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *