Diclofenac Tablet Uses in Telugu

Diclofenac Tablets – డిక్లోఫెనాక్ ఉపయోగాలు

డిక్లోఫెనాక్ (Diclofenac) అనేది NSAID (నాన్ స్టెరాయిడల్ యాంటి ఇన్ఫ్లమేటరీ డ్రగ్) రకానికి చెందిన మెడిసిన్. శరీరంలో నొప్పి మరియు వాపులకు కారణమయ్యే పదార్ధాలను తగ్గించడం ద్వారా ఈ ఔషధం పనిచేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ (Osteoarthritis), రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis), గౌట్, మైగ్రెయిన్, కండరాల నొప్పి, కీళ్ళ నొప్పి, బెణుకుల చికిత్సకు ఉపయోగపడతుంది. Cataflam బ్రాండ్ కు చెందిన Diclofenac మెడిసిన్ ను కడుపు నొప్పి, మరియు స్త్రీల ఋతు సమయ నప్పులు నివారణకు సిఫార్సు చేస్తారు. డిక్లోఫెనాక్ ను తేలికపాటి జ్వరాన్ని తగ్గించడానికి కూడా సిఫార్సు చేస్తారు.

Diclofenac ఎలా పని చేస్తుంది?

Diclofenac శరీరంలోని రసాయనాల ప్రభావాలను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది. మన శరీరంలో COX (cyclo-oxygenase) అనే ఎంజైమ్ పై పని చేస్తుంది. ఈ ఎంజైమ్ పనితీరు ఏంటంటే, Prostaglandins అనే రసాయనాల విడుదలకు తోడ్పడడం. శరీరానికి ఏదైనా గాయం అయినపుడు, గాయం అయిన శరీర భాగంలో ఈ Prostaglandins రసాయనాలు విడుదల అవడం వల్ల నొప్పి, వాపు కలుగుతుంది. Diclofenac మెడిసిన్ కాక్స్ (COX) ఎంజైమ్ పై ప్రభావం చూపడం ద్వారా, ఈ రసాయనాల విడుదల మోతాదును తగ్గిస్తుంది, తద్వారా నొప్పి, వాపు తగ్గుతుంది.

Diclofenac ను ఈ రుగ్మతలలో సిఫార్సు చేస్తారు:

Osteoarthritis – ఆస్టియో ఆర్థరైటిస్

డిక్లోఫెనాక్ మెడిసిన్ ను జాయింట్ స్టిఫ్నెస్ (కీళ్ళు పట్టేసినట్లు ఉండటం), మోకాళ్ల నొప్పి, తొంటి నొప్పి, మెడ నొప్పి, కీళ్ళ నొప్పి వంటి సమస్యల చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

Rheumatoid Arthritis – రుమటాయిడ్ ఆర్థరైటిస్

రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) వల్ల కలిగే కీళ్ల నొప్పి నియంత్రణకు సిఫార్సు చేస్తారు.

Ankylosing Spondylitis

వెన్నెముకకు సంభందించిన ఆంకిలోజింగ్ స్పాన్డైలిటిస్ (Ankylosing Spondylitis) సమస్య కారణంగా కలిగే వెన్నె, నడుము నొప్పిని నివారించడానికి సిఫార్సు చేస్తారు.

ఇవే కాక Diclofenac ను సిఫార్సు చేసే మరి కొన్ని ఆరోగ్య సమస్యలు:

 • కీళ్ల నొప్పులు, బెనుకులు
 • కిడ్నీ, పిత్తాశయం లో రాళ్ళ వల్ల వచ్చే నొప్పిని (తక్కువగా ఉన్నట్లయితే ) తగ్గించేందుకు
 • మైగ్రేయిన్ తల నొప్పికి
 • Dysmenorrhea(స్త్రీల ఋతుపరమైన నొప్పులు)
 • Bursitis (కాపు తిత్తుల వాపు) సమస్య ఉన్నపుడు
 • Tendinitis (కండరాలు మరియు ఎముకలను కలుపే కణజాలానికి కలిగే సమస్య.)
 • Polymyositis (కండరాల నొప్పి)
 • Dental pain (దంత సమస్యల వల్ల కలిగే నొప్పి)
 • TMJ (temporomandibular joint) pain (దవడ నొప్పి)

Diclofenac ను వాడకూడని సందర్భాలు:

Allergy – అలెర్జి

Diclofenac లేదా ఇతర NSAIDs మెడిసిన్ పట్ల మీకు అలెర్జీ ఉన్నట్లయితే వాడకూడదు

Asthma – ఆస్థమా

ఆస్థమా లేదా ఇతర శ్వాస సంభంధ రుగ్మతలతో భాదపడుతున్న వారికి ఇది సిఫార్సు చేయబడదు

Bleeding – రక్తస్రావం

శరీరంలో ఏదైనా రక్తస్రావ సమస్య ఉన్నట్లయితే వాడకూడదు

CABG (Coronary Artery Bypass Surgery) –

గుండె సంభంధ బైపాస్ సర్జరీ (Coronary Artery Bypass Surgery) అయిన వారిలో ఆపరేషన్ తరువాతి నొప్పిని తగ్గించడానికి ఇది సిఫార్సు చేయరు

Diclofenac వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:

Diclofenac మెడిసిన్ వాడినపుడు, ఇది చేసే మంచితో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేదా దుష్ప్రభావాలు కూడా కలుగవచ్చు. వీటి వాడకం వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినపుడు, తక్షణమే డాక్టర్ ను సంప్రదించాలి. అల్లాంటి కొన్ని లక్షణాలు ఇక్కడ పేర్కొనడం జరిగింది:

 • Skin Rash – చర్మం దద్దుర్లు
 • Abdominal Pain – పొత్తి కడుపులో నొప్పి
 • Constipation – మలబద్దకం
 • Diarrhea – విరేచనాలు
 • Vomiting – వాంతులు
 • Dizziness – మత్తుగా అనిపించడం
 • Itching, increased sweating – దురదలు, అధికంగా చెమట పట్టడం
 • Nausea and vomiting – వికారం మరియు వాంతులు
 • Increased blood pressure – రక్తపోటు పెరిగడం (బి.పి.)

Diclofenac టాబ్లెట్ వాడకం గురించి డాక్టర్లు ఇచ్చే సలహా:

 • Diclofenac ను కొద్దికాలం పాటు మాత్రమె వాడడం వాల్ల మంచి ప్రయోజనం ఉంటుంది
 • ఎక్కువ కాలం పటు దీనిని వాడడం వల్ల కిడ్ని సమస్యలు కలుగవచ్చు
 • కిడ్ని సంభంధ సమస్యలు ఉన్న వారు కూడా డాక్టర్ సూచన ప్రకారమే వాడాలి. వీరిలో టాబ్లెట్స్ డోస్ ను వీరికి అనుగుణంగా సూచించడం జరుగుతుంది
 • మద్యం తో పాటుగా వీటిని వాడకూడదు. అలా వాడడం వల్ల లివర్ దెబ్బ తింటుంది

Diclofenac టాబ్లెట్ వాడకం పట్ల కొన్ని హెచ్చరికలు:

ఓవర్ డోసేజ్ అయితే

Diclofenac మెడిసిన్ ను అధిక మోతాదులో పొరపాటున వేసుకున్నపుడు, వెంటనే డాక్టర్ను సంప్రదించాలి

సమయానికి వేఉకోవలసిన డోస్ మిస్ అయినపుడు

ఎపుడైనా పొరపాటున వేసుకోవలసిన డోస్ మర్చిపోతే, వీలైనంత వెంటనే వేసుకోవాలి. ఒకవేళ తదుపరి డోస్ కు సమయం దగ్గర పద్దపుడు ఆ పూట వేసుకోవలసిన డోస్ వేసుకోవాలే తప్ప అదనంగా రెండు డోస్ లు కలిపి వేసుకోకూడదు. ఎగస్ట్రా డోస్ వేసుకోకూడదు.

Pregnancy – గర్భిణి స్త్రీలలో

తప్పనిసరి అయితే తప్ప గర్భిణి స్త్రీలకు ఈ Diclofenac మెడిసిన్ సిఫార్సు చేయబడదు. వీరు ఈ మందు వాడడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. గర్భంలోని శిశువుకు అయితే హాని కలుగవచ్చు అనే ఋజువులేమీ లేవు కానీ, వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

Breastfeeding – పాలిచ్చే తల్లుల్లో

Diclofenac ను వీరు వాడవచ్చు, కానీ వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

Diclofenac tablet వాడేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:

కొన్నిసార్లు కొన్ని రకాల రుగ్మతలు ఉన్నవారికి కొన్ని రకాల మందులు పడకపోవచ్చు. కనుక Diclofenac మెడిసిన్ వాడేప్పుడు కూడా జాగ్రత్త వహించడం మంచిది. డాక్టర్ ను సంప్రదించి వాడడం ఉత్తమం.

ఉదాహరణకు:

 • అల్సర్ తో బాధ పడుతున్నవారు, Crohn’s disease లేదా ulcerative colitis వంటి ప్రేగులకు సంభందించిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు
 • ఆస్థమా, లేదా వేరే ఏ రకమైన అలెర్జీ రుగ్మతలు ఉన్నా
 • గర్భిణిలు, పాలు ఇచ్చే తల్లులు
 • బి.పి. – అధిక రక్తపోటు ఉన్నా
 • గుండె సంభంధ ఆరోగ్య సమస్యలు ఉంటె
 • కొంతమందిలో రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలంటి వారి జాగ్రత్త వహించాలి
 • వేరే ఏ ఇతర నొప్పి నివారణ మందుల వల్ల అయినా ఇంతకూ మునుపు పాడనీ వారు (Aspirin, Naproxen, Ibuprofen, Indometacin వంటి మందులు పడని వారు)
 • Systemic lupus erythematosus వంటి రుగ్మతలు ఉన్న వారు
 • కిడ్ని, లేదా లివర్ సమస్యలు ఉన్న వారు

Diclofenac టాబ్లెట్స్ కు ప్రత్యామ్నాయ టాబ్లెట్స్:

 • క్రింద పేర్కొన్న కొన్ని టాబ్లెట్లలో Diclonac టాబ్లెట్లతో సరిసమానమైన, కాంబినేషన్, డోస్, మరియు సామర్ధ్యం ఉంటుంది కనుక వీటిని డోలో టాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు
 • Diclonac 50 MG Tablet
 • Diclomax 50 MG Tablet
 • Dicloact 50 MG Tablet
 • Topac 50 MG Tablet
 • Fenak 50 MG Tablet

మీకు దగ్గరలో అనుభవజ్ఞుడైన డాక్టర్ అందుబాటులో లేనట్లయితే, మీరు ఇక్కడ మమ్మల్ని సంప్రదించవచ్చు.

Leave a Review

How did you find the information presented in this article? Would you like us to add any other information? Help us improve by providing your rating and review comments. Thank you in advance!

Name
Email (Will be kept private)
Rating
Comments
Diclofenac Tablets - డిక్లోఫెనాక్ ఉపయోగాలు Overall rating: ☆☆☆☆☆ 0 based on 0 reviews
5 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *