Crocin టాబ్లెట్స్ ఉపయోగాలు సైడ్ ఎఫెక్ట్స్

Crocin Tablet – క్రోసిన్ టాబ్లెట్స్ గురించి కొన్ని వివరాలు

Crocin Tablet ను భారతదేశం లో చాలామంది సర్వసాధారణంగా తలనొప్పి, జలుబు, జ్వరం మరియు ఏ రకమైన ఒంటినొప్పులు, కీళ్ల నొప్పులకు వాడుతుంటారు. క్రోసిన్ టాబ్లెట్లు జ్వరాన్ని తగ్గించే యాంటిఫైరిటిక్ (antipyretics) మరియు ఒళ్ళు నొప్పులు తగ్గించే పెయిన్ కిల్లర్ (analgesics) రకానికి చెందినా మెడిసిన్. యాంటిఫైరిటిక్ గుణం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడులోని ఒక భాగంపై పనిచేస్తుంది, చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతే కాక వేడిని తగ్గించి చెమటలు పట్టేలా చేస్తుంది. తద్వారా జ్వరం తగ్గుతుంది. అనాల్జెసిక్ (analgesic) గుణం, శరీరానికి నొప్పిని భరించే సామర్ధ్యాన్ని పెంచుతుంది, తద్వారా నొప్పిని తగ్గిస్తుంది.

Crocin Tablet ను సూచించే సందర్భాలు:

Arthritis – అర్థరైటిస్

Crocin టాబ్లెట్స్ ను అర్థరైటిస్ బాధితులలో కీళ్ల నొప్పిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు.

Headache – తలనొప్పి

క్రోసిన్ టాబ్లెట్ను పార్శ్వపు నొప్పి మరియు తీవ్రమైన తలనొప్పి నుండి ఉపశమనానికి ఉపయోగిస్తారు

Fever – జ్వరం

క్రోసిన్ ను సాధారణ జ్వరం ను నియంత్రించడానికి సిఫార్సు చేయడం జరుగుతుంది. శరీరం యొక్క సహజ రోగనిరోధక శక్తి ప్రక్రియ వల్ల కలిగే జ్వరాన్ని వైద్య పరిభాషలో Pyrexia అని అంటారు. అటువంటి జ్వరంను మూల కారణాల పై ప్రభావం చూపకుండా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

Muscular Pain – కండరాల నొప్పి

క్రోసిన్ టాబ్లెట్ అన్ని రకాల కండరాల నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.

Post-Immunization Pyrexia (fever)

ఏదైనా వాక్సినేషన్ చేసినపుడు ఒచ్చే జ్వరాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

Menstrual Cramps – ఋతు సమయంలో వచ్చే నొప్పి నివారణకు

మహిళల్లో ఋతు చక్రంతో సంబంధం కలిగిన నొప్పి చికిత్సకు క్రోసిన్ టాబ్లెట్ ఉపయోగించబడుతుంది.

Toothache – పంటి నొప్పి

క్రోసిన్ టాబ్లెట్ సాధారణంగా దంత క్షయం వల్ల సంభవించే పళ్ళు మరియు దవడల చుట్టూ నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.

Crocin tablet క్రింది పరిస్థితులలో సిఫార్సు చేయబడదు:

Allergy – ఎలర్జీ

Crocin Tablet వల్ల ఎలర్జీ ఉన్నట్లయితే వాడకూడదు.

Analgesic Nephropathy (Kidney Disease)

పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీల సమస్యతో బాధ పడుతున్న వారు కూడా ఈ క్రోసిన్ టాబ్లెట్స్ వాడకూడదు.

Liver Disease – లివర్ సమస్య ఉన్నవారు

కాలేయ/లివర్ రుగ్మతతో బాధపడుతున్నవారికి క్రోసిన్ టాబ్లెట్ సిఫారసు చేయబడదు.

క్రోసిన్ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్:

Crocin Tablet వల్ల కొన్ని నిర్దిష్ట ఉపయోగాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో వీటిని వాడడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇంటాయి. అలంటి పరిస్థితి ఒచ్చినపుడు వెంతని డాక్టర్ సలహా తీసుకోవాలి. కొన్ని ముఖ్య దుష్ప్రభావాలు క్రింద పేర్కొనబడ్డాయి. ఇవికాక వేరే ఏ ఇతర ఇబ్బందికర సూచనలు ఉన్నా వెంటనే డాక్టర్ ను కలవాలి

Allergic skin reaction – స్కిన్ ఎలర్జీలు

Crocin Tablet పాడనపుడు చర్మం పై దద్దుర్లు, దురద, ఎరుపు మచ్చలు రావచ్చు. అలాంటపుడు వెంటనే డాక్టర్ ను కలవాలి.

Fever – జ్వరం

క్రోసిన్ టాబ్లెట్ చలి లేదా చలి లేకుండా మోస్తరు జ్వరాన్ని కలిగించవచ్చు.

Nausea or Vomiting – వికారం లేదా వాంతులు

క్రోసిన్ టాబ్లెట్స్ పడకపోతే ఉదరంలో నొప్పి , నొప్పులు, నోరు తడారిపోవడం, వాంతులు, విరేచనాలు వంటి దుష్ప్రభావాలు కలుగవచ్చు.

Renal Problems – మూత్రపిండ సమస్యలు

మూత్రం రంగు మారవచ్చు, మరియు మోతాదు తగ్గవచ్చు

Anemia – రక్తహీనత

కొందరు రోగులలో క్రోసిన్ టాబ్లెట్ వాడకం వల్ల, రక్తహీనత వల్ల కలిగేటువంటి లక్షణాలు ఉండవచ్చు.

Stevens – Johnson syndrome – స్టీవెన్ జాన్సన్ సిన్డ్రోం

క్రోసిన్ టాబ్లెట్ వల్ల ఈ అరుదైన కానీ చాలా హానికారక దుష్ప్రభావం కలిగే అవకాశం ఉంది. Stevens – Johnson syndrome అనేది ఒక రకమైన స్కిన్ ఎలర్జీ, దీనికి తక్షణ వైద్య పర్యవేక్షణ చాలా అవసరం.

Fatigue – అలసట

క్రోసిన్ టాబ్లెట్స్ పాడనప్పుడు అకారణమైన అలసట, బలహీనత మరియు కండరాలు అకస్మాత్తుగా పట్టేసినట్లు ఉండవచ్చు.

Crocin tablet పట్ల డాక్టర్స్ ఇచ్చే సలహా:

 • స్వల్పకాలం పాటు వాడితే క్రోసిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది, మరియు త్వరిత ప్రభావం చూపుతుంది.
 • ఎక్కువ మొతాదులో తీసుకోవడం వల్ల లివర్ తీవ్ర డ్యామేజ్ కు గురవుతుంది
 • లివర్ సంభంధ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్య సలహా మేరకు మాత్రమె వాడాలి
 • మద్యం తో పాటుగా వీటిని వాడకూడదు. క్రోసిన్ మరియు మద్యం కలయిక లివర్ ను మరింత నాశనం చేస్తుంది
 • పొరపాటున మోతాదు మించి వాడడం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు అనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవాలి

Crocin Tablet – జాగ్రత్తలు & ఎలా ఉపయోగించాలి:

Crocin టాబ్లెట్స్ వాడే ముందు మీ ఆరోగ్యం పట్ల, ఏమైనా రుగ్మతలు ఉంటె, లేదా మీరు ఏ రకమైన ఇతర మందులు వాడుతున్నా, మీకు ఎటువంటి ఎలర్జీలు ఉన్నా, స్త్రీలు గర్భవతులైతే, మునుపే అన్ని వివరాలు డాక్టర్ కు తెలియజేయాలి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు, ఈ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టాబ్లెట్స్ ను డాక్టర్ సూచన మేరకు లేదా టాబ్లెట్స్ బాక్స్/ పట్టీ పై పేర్కొన్న సూచనల ప్రకారమే వాడాలి. మెడిసిన్ డోస్ అనేది రోగి పరిస్థితి మరియు రుగ్మత బట్టి మారుతుంది

Crocin టాబ్లెట్ ఓవర్ డోసేజ్ అయితే:

Crocin టాబ్లెట్ ను సూచించిన మోతాదు కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల హానికరమైన దుష్ప్రభావాలు కలుగవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనిపించినా వెంటనే డాక్టర్ను లేదా ఫార్మసిస్ట్ ను సంప్రదించాలి. మార్కెట్ లో Crocin టాబ్లెట్స్ పలు రకాల మోతాదుల్లో లభ్యం అవుతాయి. పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించడానికి, టాబ్లెట్స్ వాడే మునుపు లేబుల్ ను జాగ్రత్తగా గమనించాలి.

Missing dosage – సమయానికి వేఉకోవలసిన డోస్ మిస్ అయినపుడు:

ఎపుడైనా పొరపాటున వేసుకోవలసిన డోస్ మర్చిపోతే, వీలైనంత వెంటనే వేసుకోవాలి. ఒకవేళ తదుపరి డోస్ కు సమయం దగ్గర పద్దపుడు ఆ పూట వేసుకోవలసిన డోస్ వేసుకోవాలే తప్ప అదనంగా రెండు డోస్ లు కలిపి వేసుకోకూడదు. ఎగస్ట్రా డోస్ వేసుకోకూడదు.

Crocin టాబ్లెట్ వాడకం పట్ల కొన్ని హెచ్చరికలు:

 • మద్యం తో పాటుగా వీటిని వాడకూడదు. కడుపులో ఏ రకమైన రక్త స్రావం ఉన్న అది ఎక్కువ అవుతుంది
 • గర్భిణి స్త్రీలు డోలో 650 వాడడం అంత శ్రేయస్కరం కాదు. తప్పక డాక్టర్ సలహా తీసుకొని వాడాలి
 • పాలు ఇచ్చే తల్లులు వాడవచ్చు, కానీ వీరు కూడా డాక్టర్ సలహా మేరకు వాడితే మంచిది
 • లివర్ సంభంధ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్య సలహా మేరకు మాత్రమె వాడాలి
 • కిడ్ని సంభంధ సమస్యలు ఉన్న వారు కూడా డాక్టర్ సూచన ప్రకారమే వాడాలి. వీరిలో టాబ్లెట్స్ డోస్ ను వీరికి అనుగుణంగా సూచించడం జరుగుతుంది

Crocin టాబ్లెట్ కు ప్రత్యామ్నాయ టాబ్లెట్స్:

క్రింద పేర్కొన్న కొన్ని టాబ్లెట్లలో Crocin టాబ్లెట్ తో సరిసమానమైన, కాంబినేషన్, డోస్, మరియు సామర్ధ్యం ఉంటుంది కనుక వీటిని డోలో టాబ్లెట్లకు  ప్రత్యామ్నాయంగా వాడవచ్చు:

 • Pacimol 500 MG Tablet
 • Panacip 500 MG Tablet
 • Ultragin 500 MG Tablet
 • Lupicin 500 MG Tablet
 • Tecpara 500 MG Tablet

మీకు దగ్గరలో అనుభవజ్ఞుడైన డాక్టర్ అందుబాటులో లేనట్లయితే, మీరు ఇక్కడ మమ్మల్ని సంప్రదించవచ్చు.

 

Leave a Review

How did you find the information presented in this article? Would you like us to add any other information? Help us improve by providing your rating and review comments. Thank you in advance!

Name
Email (Will be kept private)
Rating
Comments
Crocin Tablet – క్రోసిన్ టాబ్లెట్స్ గురించి కొన్ని వివరాలు Overall rating: ☆☆☆☆☆ 0 based on 0 reviews
5 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *