Combiflam in Telugu

Combiflam – కాంబిఫ్లం ఉపయోగాలు

సాధారణంగా వాపులు మరియు నొప్పితో కూడుకున్న ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు, చికిత్స చేసేందుకు వైద్యులు కాంబిఫ్లం (Combiflam) టాబ్లెట్లను సిఫార్సు చేస్తారు. Combiflam ఒక నాన్ స్టెరాయిడల్ యంటి ఇన్ఫ్లమేటరీ డ్రగ్ (NSAID) లా పనిచేస్తుంది. ఇది శరీరం లోని నొప్పి నియంత్రించే హార్మోన్ల పై పని చేస్తుంది. తద్వారా తలనొప్పి, పంటి నొప్పి, ఆర్థరైటిస్, వెన్ను నొప్పి, మరియు ఇతర రకాల చిన్న గాయాలు మరియు ఋతు సంభంధ నొప్పులు వంటి రుగ్మతల చికిత్సకు Combiflam మందులను డాక్టర్లు సిఫార్సు చేస్తారు. కాంపిఫ్లం టాబ్లెట్లలో (Combiflam Tablet) ఇబుప్రోఫెన్ (Ibuprofen) మరియు పారాసెటమాల్ (Paracetamol) అనే రెండు ముఖ్య క్రియాశీల పదార్థాలు (active ingredients) ఉంటాయి. నొప్పి కలిగే సమయంలో మెదడులో ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ విడుదలను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది. ఈ మెడిసిన్ ఆరు నెలలు దాటినా పిల్లలు మరియు పెద్దవారికి ఉపయోగపడుతుంది.

Combiflam టాబ్లెట్ ఉపయోగాలు:

ఈ కింది వ్యాధులు, పరిస్థితులు మరియు వాటి లక్షణాల చికిత్స, నియంత్రణ మరియు నివారణకు Combiflam టాబ్లెట్ ఉపయోగించబడుతుంది:

 • తలనొప్పి
 • జ్వరం
 • కీళ్ళ నొప్పి
 • నరాల సంభంధ నొప్పి
 • చెవి నొప్పి
 • జలుబు
 • ఒళ్ళు నొప్పులు
 • పంటి నొప్పి
 • బ్యాక్ పెయిన్ (వెన్ను నొప్పి)
 • కండరాల నొప్పి
 • స్త్రీలలో ఋతు సంభంధ నొప్పి

Combiflam ఎలా పనిచేస్తుంది:

కాంబిఫ్లం కింది విధులు నిర్వహించడం ద్వారా రోగి పరిస్థితి మెరుగుపరుస్తుంది:

 • నొప్పి సమయంలో శరీరంలో విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ (prostaglandin hormone) విడుదలను నిరోధించడం ద్వారా.
 • నొప్పిని తట్టుకునే సామర్ధ్యాన్ని పెంచి, నొప్పి ఉన్న శరీర భాగానికి రక్త సరఫరా పెంచడం ద్వారా.

Combiflam లో ఏమేమి ఉంటాయి:

ఇందులో ఉండే ముఖ్య మూల పదార్థాలు.

 • Ibuprofen – 400 MG
 • Paracetamol – 325 MG

గమనించాల్సిన విషయం ఏంటంటే వీటి మోతాదు ఒక్కో మెడిసిన్ లో ఒక్కో రకంగా ఉండవచ్చు.

Parents Health Insurance Plans

Combiflam దుష్ప్రభావాలు:

Combiflam టాబ్లెట్ల లోని అన్ని ముఖ్య పదార్థాల వల్ల సంభవించే కొన్ని దుష్ప్రభావాలు క్రింద పేర్కొన బడ్డాయి. వీటిలో అన్ని అందరికి కలగాలనేమీ లేదు. అలాగే అన్ని సందర్భాలలో కలగకపోవచ్చు కూడా. కొన్ని అరుదుగా కలిగేవి అయినప్పటికీ తీవ్ర ఇబ్బంది కలించేవి కూడా కావచ్చు. వీటిలో ఏవైనా లక్షణాలు ఉంటె మరియు తొందరగా తగ్గకపోతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.

 • కడుపు నొప్పి
 • మలబద్దకం
 • ముఖంలో వాపు లక్షణాలు
 • తలనొప్పి
 • అలెర్జీ వంటి లక్షణాలు
 • చర్మం దద్దుర్లు

పైన పేర్కొన్న లక్షణాలే కాకుండా వేరే ఎటువంటి ఇబ్బందికర సూచనలు ఉన్న వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. మీ స్థానిక ఆహారం మరియు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారానికి మీరు దుష్ప్రభావాల గురించి నివేదించవచ్చు.

Combiflam టాబ్లెట్స్ – జాగ్రత్తలు & ఎలా ఉపయోగించాలి:

Combiflam టాబ్లెట్స్ ఉపయోగించే ముందు, ప్రస్తుతం మీరు ఏమైనా మెడిసిన్ వాడుతుంటే, వాటి వివరాలు డాక్టర్ కు తెలియజేయాలి. ఉదాహరణకు ఏదైనా విటమిన్ సప్ప్లిమెంట్ మందులు, హెర్బల్ మందులు వాడుతుంటే. అలాగే మీకు ఏమైనా ఎలర్జీలు ఉంటె, మునుపు ఏమైనా అనారోగ్యం ఉండి ఉంటె, గర్భిణి స్త్రీ అయి ఉంటె, లేదా రాబోయే కొద్ది రోజులలో ఏదైనా శస్త్ర చికిత్స చేయించుకునే అవకాశం ఉన్నవారు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఈ Combiflam టాబ్లెట్ల దుష్ప్రభావాలు ఇంకా తీవ్రం అయ్యేలా చేస్తాయి. వీటిని డాక్టర్ సిఫార్సు చేసిన మోతాదులో లేదా మందుల బాక్స్ పై పేర్కొనబడిన ప్రకారమే వాడాలి. మోతాడు అనేది రోగి యొక్క రోగ లక్షాణాలు, తీవ్రతను బట్టి ఉంటుంది. మీ పరిస్థితి కొనసాగితే లేదా మరింత తీవ్రమయితే వైద్యుడికి తెలియజేయాలి.

 • Paracetamol వల్ల మీకు అలర్జీ ఉంటె Combiflam టాబ్లెట్స్ వాడకూడదు
 • రోజు మద్యపానం అలవాటు ఉన్నవారు వాడకూడదు
 • వీటి వాడకం వల్ల చూపు మసకబారినా, చెవులలో శబ్దాలు వంటి లక్షణాలు ఉన్న వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి
 • మీకు systemic lupus erythematosus ఉంటె డాక్టర్ను సంప్రదించాలి
 • మీకు గాయాలు లేదా రక్తస్రావం ఉంటే ముందుగానే మీ వైద్యుడికి తెలియజేయండి

Combiflam టాబ్లెట్స్ ను ఎటువంటి సందర్భాలలో వాడరాదు:

ఇటువంటి మందులు పడనివారు అంటే అలర్జీ ఉన్న వారు వాడకూడదు. ఇంకా క్రింద పేర్కొన్న లక్షానాలు ఉన్నపుడు:

 • Hypersensitivity – హైపర్ సేన్సిటివిటి
 • Gastrointestinal bleeding – పొట్టలో ఎటువంటి రక్త స్రావమైనా ఉంటె
 • Active peptic ulcer – అల్సర్ ఉన్నవారు
 • Aspirin – ఆస్ప్రిన్ మెడిసిన్ అలర్జీ ఉన్నవారు
 • Breastfeeding – పాలిచ్చే తల్లులు డాక్టర్ ను సంప్రదించి వాడాలి
 • Hepatic impairment – లివర్ సమస్య ఉన్నవారు డాక్టర్ ను సంప్రదించి వాడాలి

Warnings:

 • మద్యం సేవించినపుడు Combiflam టాబ్లెట్స్ వాడరాదు, పొట్టలో ఏమైనా రక్తస్రావం ఉంటె అది తీవ్రం అయ్యే ప్రమాదం ఉంటుంది
 • గర్భస్థ స్త్రీలు వీటిని వాడే మునుపు డాక్టర్ ను సంప్రదించాలి
 • పాలిచ్చే తల్లులు వాడవచ్చు, కానీ డాక్టర్ ను సంప్రదించి వాడడం ఉత్తమం
 • కాలేయ (లివర్), మరియు కిడ్నీ సంభంధ వ్యాధులు ఉన్నవారు జాగ్రత్త వహించాలి, డాక్టర్ ను సంప్రదించి వాడాలి

మీకు దగ్గరలో అనుభవజ్ఞుడైన డాక్టర్ అందుబాటులో లేనట్లయితే, మీరు ఇక్కడ మమ్మల్ని సంప్రదించవచ్చు.

Are you Looking For a Health Insurance? – Read this for More Information

Health Insurance for Family

Combiflam in Telugu, Combiflam uses in Telugu

Reviews

Combiflam - కాంబిఫ్లం ఉపయోగాలు
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.
Name
Email
Review Title
Rating
Review Content

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *