Cinnamon-in-Telugu-దాల్చిన

Cinnamon in Telugu – దాల్చిన

దాల్చినచెక్క (Cinnamon) అంటే ఏమిటి?

దాల్చిన ఒక సుగంధ ద్రవ్యం. ఇది విశాలమైన చెట్ల కొమ్మల బెరడు నుండి లభ్యం అవుతుంది. దాల్చిన చెట్లు “సిన్నమోమం” జీనస్ కు చెందినవి. దాల్చిన చెక్క ఆగ్నేయ ఆసియా, దక్షిణ అమెరికా, మరియు కరేబియన్ ప్రాంతాలలో లభిస్తుంది.

భారతదేశం లో కేరళ లో ఒకటి, రెండు ప్రాంతాలలో దాల్చిన చెట్ల పెంపకం జరుగుతుంది. మనం సాదారంగా దాల్చిన పొడిని వంటకాలలో రుచిని మెరుగు పరచడానికి మసాలాలో వాడతారు. కానీ దాల్చిన యొక్క వైద్య పర ఉపయోగాలు మనలో చాలా మందికి తెలియదు.

దాల్చినచెక్క యొక్క వివిధ రకాలు:

దాల్చినచెక్క అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం, ఇది నాలుగు రకాలలో లభ్యం అవుతుంది.

  • సిలోన్ సిన్నమోన్ (ట్రూ సిన్నమోన్) – Ceylon cinnamon (True cinnamon): దీని మూలం శ్రీలంక నుండి ఒచ్చింది. ఈ రకమైన దాల్చిన ఔషధ విలువ అధికం గా ఉండడం వలన దీని ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతర రకాలకంటే మూడు రెట్లు అధికంగా ఉంటుంది.
  • కాసియా సిన్నమోన్ (చైనీస్ సిన్నమోన్) – Cassia cinnamon (Chinese cinnamon): ఈ రకమైన దాల్చిన మనకు దక్షిణ చైనా నుండి లబిస్తుంది. ఇది సిలోన్ దాల్చిన కంటే తక్కువ ధరకే లబిస్తుంది.
  • వియత్నామీస్ సిన్నమోన్ – Vietnamese cinnamon
  • బర్మానీ లేదా ఇండోనేషియన్ సిన్నమోన్ – Burmanii or Indonesian Cinnamon

దాల్చినచెక్క ఉపయోగాలు ఏమిటి?

దాల్చిన ను వంటలలో, టీ తయారీలో, బేకరీ ఉత్పత్తులలో, శీతల పానీయాలలో ఉపయోగించడం కలదు. ఇంకా మిఠాయిలలో, వోట్మీల్, టోస్ట్, టీ లేదా కాఫీ, హాట్ చాక్లెట్, మరియు చివింగ్ గమ్ లలో కూడా ఉపయోగిస్తారు.

దాల్చిన (సిన్నమోన్) అనేక భారతీయ వంటలలో కూడా ఒక సాధారణ పదార్ధంగా వాడుకలో ఉంది. ఇంకా సుగంధ పరిశ్రమలో కూడా ఉపయోగించబడుతుంది. ఔషధం యొక్క సువాసన మరియు రుచి మెరుగుపర్చడానికి అనేక ఔషధ తయారీలలో దాల్చిన ను ఒక ముఖ్య పదార్థంగా ఉపయోగిస్తారు.

దాల్చినచెక్క ఆరోగ్య ప్రయోజనాలు:

  1. యాంటీఆక్సిడెంట్ల అధిక మూలం: దాల్చిన లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. భూమిపై యాంటీఆక్సిడెంట్ ఉన్న మూలికలలో దాల్చిన ఏడవ స్థానం లో ఉంది. దాల్చిన యొక్క ఆక్సిడెంట్ స్కోర్ 131.000. దాల్చిని యాంటీ ఆక్సిడెంట్స్ ప్రయోజనాలు పరంగా చాలా శక్తివంతమైనది. చర్మ కణాల నష్టాన్ని తగ్గించి, వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది.
  2. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం: దాల్చినచెక్క యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉండటం వల్ల, క్యాన్సర్, గుండె వ్యాధులు వంటి సమస్యల రిస్క్ ను తగ్గించే గుణం ఇందులో ఉంది.
  3. గుండె జబ్బు రిస్క్ ను తగ్గిస్తుంది: దాల్చినచెక్క యొక్క మరొక ఆరోగ్య ప్రయోజనం, హృద్రోగాలకు చాలా సాధారణ హాని కారకాలైన అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక ట్రైగ్లిజరైడ్ స్థాయిలు మరియు అధిక రక్తపోటు లను తగ్గిస్తుందని అని అధ్యయనాల వల్ల తెలుస్తోంది.
  4. రక్తంలో షుగర్ స్థాయిని తగ్గించి డయాబెటిస్ ను అదుపు చేస్తుంది: దాల్చిన యాంటి డయాబెటిక్ లక్షణాలు కలిగినది. రక్తంలో చెక్కెర మోతాదు ను తగ్గించడం లో తోడ్పడుతుంది.
  5. కాన్సర్ ను నిరోధించడానికి తోడ్పడుతుంది: దాల్చిన లోని యాంటీ ఆక్సిడెంట్ సామర్ధ్యం వల్ల ఇది కాన్సర్ కారక లక్షణాలను నిరోధిస్తుంది. దాల్చిన కాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుందని కొన్ని అధ్యయనాలలో నిరూపితమైంది.
  6. మెదడు సంభంధ రుగ్మతల నుంచి రక్షణ పొందడానికి సహాయపడుతుంది: దాల్చిన కొన్ని అధ్యయనాల ప్రకారం మెదడుకు సంభందిన్చన అల్జిమర్ మరియు పార్కిన్సన్ (Alzheimer’s and Parkinson’s) వంటి రుగ్మతల బారిన పడకుండా కాపాడుతుంది.
  7. అంటువ్యాధులను నివారిస్తుంది: మన శరీరాన్ని వ్యాధుల బారినుండి కాపాడేందుకు దాల్చిన చాలా ఉపయోగ పడుతుంది.
  8. దంత మరియు నోటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది: దాల్చిన నోటి దుర్వాసన, దంతాల క్యావిటిలు మరియు నోటి ఇన్ఫెక్షన్ ల బారినుండి కాపాడడానికి ఉపయోగపడుతుంది. దాల్చిన నూనె నోటిలోని బాక్టీరియాను నిరోధించి నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.
  9. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: దాల్చిన లో యాంటీబయోటిక్ మరియు యాంటీమైక్రోబియల్ ప్రభావాలు ఉండడం వల్ల చర్మాన్ని దద్దుర్లు, ఇరిటేషన్, అలర్జీలు మరియు అంటురోగాల నుండి కాపాడడానికి సహాయపడుతుంది. దాల్చిన యొక్క ఎసెన్సియల్ ఆయిల్ నొప్పి, వాపు, మరియు మంట నుండి ఉపశమనాన్ని కలిగించడంలో ఉపయోగపడుతుంది.
  10. దాల్చిన యొక్క రోగనిరోధక పెంచే సామర్ధ్యం: దాల్చినచెక్క రోగనిరోధక వ్యవస్థపై గణనీయంగా ప్రభావం చూపుతుంది, మానవ శరీరం యొక్క నిరోధక వ్యవస్థను బాగా పెంచుతుంది.

దాల్చినచెక్క ధర ఎంత?

భారతదేశం లో దాల్చినచెక్క ధర ఒక కేజీ దాదాపు రూ.250 దాకా ఉంటుంది.

దాల్చిన వివిధ భారతీయ భాషలలో పిలవబడే పేర్లు:

cinnamon benefits in telugu, cinnamon health benefits in Telugu.

Leave a Review

How did you find the information presented in this article? Would you like us to add any other information? Help us improve by providing your rating and review comments. Thank you in advance!

Name
Email (Will be kept private)
Rating
Comments
Cinnamon in Telugu - దాల్చిన Overall rating: ☆☆☆☆☆ 0 based on 0 reviews
5 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *