CHIA SEEDS in Telugu

CHIA SEEDS in Telugu

చియా గింజలు (chia seeds in Telugu) పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. ఇవి మెక్సికో దేశానికి చెందినవి. చియా గింజలు “సాల్వియా హిస్పానిక” (Salvia Hispanica) అనబడే మొక్కనుండి లభ్యం అవుతాయి. ఈ మొక్క మింట్ (పుదీనా) ఫ్యామిలీకి చెందినది. చియా గింజలకు ఈ పేరు మెక్సికో ప్రాంతానికి చెందిన మాయ భాష (maya) నుండి వచ్చింది. పూర్వం మెక్సికోకు చెందిన అజ్టెక్ (Aztecs) మరియు మాయ (Maya) తెగలకు చెందిన వారు, శక్తిని ఇచ్చే ప్రధాన ఆహారంగా వీటిని వాడేవారు. చియా గింజలు (chia seeds in Telugu) పరిమాణంలో చాలా చిన్నవిగా ఉన్నప్పటికీ, వీటిలో పోషక విలువలు అధికంగానే ఉన్నాయి. వీటిని వైద్య రంగంలో ఔషధ ప్రయోజనాలకు కూడా వాడడం కలదు.

చియా విత్తనాలలో (Chia Seeds) పోషకాలు పుష్కలంగా ఉంటాయి మరియు వీటిని ఉపయోగించడం చాలా సులభం, వీటిని పచ్చివే తినవచ్చు, పానీయాలలో, జావలో, బెకరి ఐటమ్స్ లో, మరియు చిరుతిళ్ళు, పెరుగు, సలాడ్స్ లో కూడా కలుపుకోవచ్చు. ఇవి నీటిని మరియు ఫ్యాట్ ను చాలా బాగా పీల్చుకోగలవు, కనుక శాకాహారులు ఎగ్ (కోడి గుడ్డు) కు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. ఈ చియా గింజలు (chia seeds in Telugu) మన భారతదేశంలో పండవు, మెక్సికో, ఇంకా ఇతర దేశాలనుండి దిగుమతి అవుతాయి. ఈ మొక్కలు మన భారతదేశంలో పెరగవు కనుక వీటికి భారతీయ భాషలలో ప్రత్యేకించి వేరే పేర్లు ఏమి లేవు. కనుక హిందీలో వీటిని చియా బీజ్ (chia beej) అని పిలుస్తారు.

భారతదేశం లో మనకు లభ్యం అయ్యే సబ్జా గింజలనే, చియా గింజలు అని చాలామంది భ్రమ పడుతుంటారు. సబ్జా గింజల్ని స్వీట్ బెసిల్ గింజలు అని కూడా పేరు ఉంది. కానీ సబ్జా గింజలు, చియా గింజలు రెండు పూర్తిగా వేరు వేరు. స్థానికంగా లభ్యం అయ్యే సబ్జా గింజల వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

చియా గింజలు (Chia Seeds) మరియు సబ్జా గింజల మధ్య వ్యత్యాసాలు:

  • చియా విత్తనాలు బూడిద-తెలుపు రంగులో ఉంటాయి, సబ్జా గింజలు పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి.
  • నీటిలో వేసినపుడు చియా గింజలు నీటిని పీల్చుకొని ఉబ్బడానికి సమయం పడుతుంది, కానీ సబ్జా విత్తనాలు క్షణాలలో నాని ఉబ్బిపోతాయి.
  • భారతదేశం లో చియా గింజలు సబ్జా గింజల కంటే ధర అధికంగా ఉంటాయి.

కానీ ఈ రెండు రకాల విత్తనాలవల్ల కూడా ఆరోగ్య పరమైన ఉపయోజనాలు ఉండడం వల్ల వీటి వాడకం శ్రేయస్కరమే.

Chia Seeds – చియా గింజల పోషక విలువలు:

చియా గింజలు (chia seeds in Telugu) ప్రాధాన్యత పొందడానికి గల ప్రధమ కారణాలు ఇందులో గల పోషక విలువలు:

  • పీచు పదార్ధం (ఫైబర్)
  • ఒమేగా-3 ఫాట్స్ (Omega-3 fats)
  • ప్రోటీన్లు (Protein)
  • విటమిన్లు మరియు ఖనిజాలు (Vitamins and minerals)

ఉదాహరణ కు, 28 గ్రాముల చియా గింజల్లో గల పోషక విలువలు:

  • 137 కేలొరీల శక్తీ ఉంటుంది
  • 3 గ్రామాల పిండి పదార్ధం (కార్బోహైడ్రేట్)
  • 4 గ్రాముల ప్రోటీన్లు
  • 6 గ్రాముల ఫాట్స్
  • 6 గ్రాముల ఫైబర్
  • 6 మిల్లీ గ్రాముల మాంగనీస్
  • 265 మిల్లీ గ్రాముల ఫాస్పరస్
  • 177 మిల్లీ గ్రాముల  కాల్షియమ్
  • 1 మిల్లీ గ్రాము జింక్
  • 1 మిల్లీ గ్రాము కాపర్
  • 8 మిల్లీ గ్రాముల పొటాషియం

చియా విత్తనాల్లో (Chia Seeds) గల అదనపు పోషక విలువలు:

  • శరీరానికి అవసరమైన ముఖ్య ఫ్యాటీ యాసిడ్స్ –  ఆల్ఫా-లినోలెనిక్ మరియు లినోలెనిక్ ఆమ్లం వీటిలో లబిస్తాయి.
  • విటమిన్ A, B, E మరియు D
  • వీటిలో సల్ఫర్, ఇనుము, అయోడిన్, మాంగనీస్, మెగ్నీషియం, నియాసిన్ మరియు థయామిన్ వంటి ఖనిజాలు మరియు యాంటిఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.

చియా విత్తనాల (Chia Seeds) ఆరోగ్య ప్రయోజనాలు:

  1. ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్: చియా విత్తనాలు పాలి అన్ సాచురేటేడ్ ఫ్యాట్స్, ప్రత్యేకించి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. చియా విత్తనాలు లిపిడ్ ప్రొఫైల్ 60% ఒమేగా-3 తో కూడి ఉంటుంది, ఈ ఫ్యాటీ యాసిడ్స్-ముఖ్యంగా, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం, లేదా ALA యొక్క మోతాదు వీటిలో ఎక్కువగా ఉంటుంది. చియా విత్తనాలలోని ఒమేగా-3 అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, శరీర పనితీరును మెరుగుపరుస్తుంది మరియు ఇన్ఫ్లమేషన్ (మంట) లను తగ్గిస్తుంది.
  2. ఫైబర్: చియా విత్తనాలలో ఫైబర్ (పీచు పదార్ధం) అధికంగా ఉంటుంది. కేవలం రెండు టేబుల్ స్పూన్ల చియా గింజల్లో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఒక వ్యక్తి తీసుకోవలసిన రోజువారి మోతాదులో మూడవ వంతు అన్నమాట. ఆహారం లో ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మరియు ప్రేగు యొక్క పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
  3. యాంటిఆక్సిడెంట్స్: చియా గింజలలో యాంటిఆక్సిడెంట్స్  ఎక్కువగా ఉంటాయి. యాంటిఆక్సిడెంట్స్  శరీరాన్ని ఇన్ఫెక్షన్లు,కాన్సర్ నుండి కాపాడడంలో ఇంకా శరీరాన్ని యవ్వనంగా ఉంచుకోవడానికి కూడా తోడ్పడుతాయి. యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రిజ్ లో ఉంచనప్పటికీ ఎక్కువకాలం నిలువ ఉంటాయి.
  4. మినరల్స్: రెండు టేబుల్ స్పూన్లు చియా గింజలలో 18% DRI (డైలీ రెకమెండేడ్ ఇన్టేక్) కాల్షియం, 35% భాస్వరం, 24% మెగ్నీషియం, మరియు 50% మాంగనీస్ లభ్యం అవుతాయి. ఈ పోషకాలు రక్తపోటు నివారించడంలో, ఆరోగ్యకరమైన శరీర బరువును ఉంచుకోవడానికి, మరియు DNA తయారీకి తోడ్పడుతాయి.
  5. పొట్టని నిండుగా ఉంచుతాయి: చియా విత్తనాలలో ఫైబర్ మరియు ప్రోటీన్స్ మెండుగా ఉండడం వల్ల వీటిని తిన్నపుడు పొట్ట నిండుగా ఉండడం వల్ల తరచూ తినాలన్నా ఆలోచన ఉండదు. తద్వారా బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతాయి
  6. గ్లుటేన్-ఫ్రీచియా గింజలలో గ్లూటెన్ ఉండదు. సిలయాక్ వ్యాధి మరియు ఇతర జీర్ణశయ సమస్యలు ఉన్న వారికి చియా గింజలు చాలా ఉపయోగంగా ఉంటాయి.
  7. రక్తంలో చక్కెర మోతాదు నియంత్రణ: ఇన్సులిన్ స్థాయిలు నియంత్రించడంలో చియా విత్తనాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి మరియు రక్తంలో ఇన్సులిన్ అసాధారణ స్థాయిలను తగ్గిస్తాయి.
  8. ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాలకు మంచిది: చియా గింజలలో చాలా రకాల పాల ఉత్పత్తులలో కన్నా కాల్సియం అధికంగా ఉంటుంది. 28 గ్రామాల చియా గింజలలో రోజువారి కావాల్సిన  మొతాదులో సుమారు 18% లభిస్తుంది. చియా గింజలను భోజనంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీర ఎముకలు మరియు దంతాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
  9. సహజ సౌందర్య ఆహారం: చియా విత్తనాలలోని పోషక విలువలు మరియు వీటిలోని ప్రోటీన్, జింక్, మినరల్స్ వల్ల జుట్టు, గోర్లు, మరియు చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.
  10. మానసిక స్థితి మెరుగుపరచడానికి: చియా విత్తనాలు అమినో యాసిడ్ ట్రిప్టోఫాన్ను కలిగి ఉంటాయి, ఇది ఆకలి, నిద్ర మరియు మానసిక స్థితి మెరుగుపరచడానికి మరియు నియంత్రించడానికి సహాయపడుతుంది.

chia seeds in Telugu, chia seeds uses in Telugu, chia seeds health benefits in Telugu, chia seeds benefits in Telugu

Reviews

CHIA SEEDS in Telugu
5.0 rating based on 12,345 ratings
Overall rating: 5 out of 5 based on 1 reviews.

★★★★★
5 5 1
Super content. Thank you

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *