Neck Pain Exercises in Telugu

సర్వికల్ స్పాన్డిలోసిస్ కి చేయవలసిన వ్యాయామాలు

మెడ నొప్పిని మెడికల్ విభాగంలో సర్వికల్ స్పాన్డిలోసిస్ అంటారు. మెడ భాగంలో (సెర్వికల్ వర్టిబ్రే ) కార్టిలేజ్  మరియు ఎముక అరిగిపోవడం వల్ల ఏర్పడుతుంది. దీనివల్ల మెడ నొప్పి మరియు రొజూవారి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇది యాభై నుండి అరవై ఏళ్ల వయస్సు వాలలో ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం, ముందుకి వంగి మెడవంచుకుని సెల్ ఫోన్లో ఎక్కువసేపు చూడడం, వెన్నుముక పైన ఎక్కువగా ఒత్తిడి పడడం, వ్యాయామం చేయకపోవడం వలన ఈ మధ్య కాలంలో యువకులు కూడా  మెడ నొప్పితో ఎక్కువగా బాధపడుతున్నారు.

సర్వికల్ స్పాన్డిలోసిస్ వలన కలిగే ప్రమాదం

సహజంగా వయస్సుతో పాటు ఈ వ్యాది ఏర్పడుతుంది. Journal of Clinical Orthopedics and Trauma లో ప్రచురించిన దాని ప్రకారం లింగం (స్త్రీ / పురుషులు) మరియు వృత్తి అనేవి ప్రధానమైన అంశాలు. ఏ కారణంగా ఇది ఏర్పడుతోందో తెలియడం వలన వైద్యులు ఈ సర్వికల్ స్పాన్డిలోసిస్ ని నివారించుటకు గల మార్గాలు  పేషెంట్ కి తెలియచేస్తారు.

  • జిమ్నాస్టిక్స్, నృత్యప్రదర్శకులు మరియు ఎక్కువ బరువు మోసేవాల్లలో ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • డౌన్ సిండ్రోమ్, ఫ్యూస్డ్ స్పైన్, సెరిబ్రల్ పాల్సి ఉన్న పేషంట్ లకు సర్వికల్ స్పాన్డిలోసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • కుటుంబంలో తల్లికి కానీ తండ్రికి కాని ఉన్నట్లయితే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది.
  • డ్రైవింగ్ చేసేటప్పుడు కాని టీవి చుసేటప్పుడు కాని ఎక్కువసేపు మెడ వంచుకుని కూర్చోవడం లేదా అసౌకార్యంగా కుర్చువోడం వల్ల వచ్చే అవక్కాశం ఉంటుంది.
  • ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చుని నిరంతరంగా పనిచేసే వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది.
  • ప్రయాణిస్తునప్పుడు కూర్చున్న స్థానం లోనే పడుకోవడం వలన కూడా సర్వికల్ స్పాన్డిలోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది.

సర్వికల్ స్పాన్డిలోసిస్ లక్షణాలు

  • మెడ నొప్పి మరియు భుజం నొప్పి నిరంతరంగా వస్తుంది. నొప్పి అనేది తేలికగా లేదా తీవ్రంగా ఉండవచ్చు. క్రమంగా లేదా ఆకస్మికంగా రావచ్చు.
  • ఎక్కువ సందర్భాల్లో మెడ భాగంలో గట్టిబడడం జరుగుతుంది. అది చికిత్స చేయించుకోకపోతే తీవ్రపడుతుంది.

ఇతర లక్షణాలు

  • తల నొప్పి
  • చెవులో గుయ్‌మనడం
  • మైకం
  • చేతులు మరియు వేళ్లు నొప్పి
  • కూర్చున్నపుడు, నిలుచున్నపుడు, మెడ వెనక్కి వంచినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నొప్పి తీవ్రత పెరగడం
  • చేతులు ఎతినప్పుడు నొప్పి రావడం

హెచ్చరిక లక్షణాలు

ఈ క్రింది లక్షణాలు కలిగనప్పుడు డాక్టర్ ని సంప్రదించండి

  • బాలన్స్ (సంతులనం) కోల్పవడం
  • మూత్రాశయం మరియు ప్రేగు నియంత్రణ కోల్పోవటం
  • చేతులు, భుజాలు లేదా కాళ్ళు తిమ్మిరెక్కడం

మెడ నొప్పి ఉపశమానానికి ఎం చేయవచ్చు?

వైద్య నిర్వహణ ( మెడికల్ మెనేజ్మెంట్)

  • నాన్ స్టేరాయ్డాల్ యాంటి-ఇన్ఫ్లమేటరి డ్రగ్స్ కి చెందిన ఇబుప్రోఫెన్ (Motrin, Advil) మరియు నప్రోక్సేన్ (Aleve) మందులు వాడడం వలన నొప్పి మరియు మంట తగ్గుతుంది.

ఫిజికల్ థెరపీ మేనేజమెంట్

  • మెడ వ్యాయామాలు (నెక్ ఎక్సర్సైసేస్) చేయడం వలన మెడ నొప్పి తగ్గుతుంది మరియు మెడభాగం లో గల కండరాలు గట్టిపడతాయి.
  • మెడ భాగంలో కదలికలు మెరుగుపడతాయి.

ఎక్కువరోజులనుండి మెడ నొప్పి కలిగి ఉండడం మరియు కదలికలు లేకపోవడం అనేవి కండరాలను బలహీనపరుస్తాయి. కాబట్టి మీ మెడ కదిలిస్తూ ఉండండి.

మెడ వ్యాయామాలు (నెక్ ఎక్సర్సైసెస్)

  • ఒకవేళ మీరు సర్వికల్ స్పాన్డిలోసిస్ లేదా మెడ నొప్పి వలన బాధపడుతున్నట్లయితే డాక్టర్ ని సంప్రదించి దానికి గల కారణం తెలుసుకొండి. మీ ఫ్యామిలీ డాక్టర్ ని లేదా కీళ్లవైద్యుడిని లేదా వెన్నెముక వైద్యుడిని సంప్రదించండి. డాక్టర్ మీకు నొప్పి తగ్గడానికి యోగా లేదా ఫిసికల్ థెరపీ లాంటి సలహాలు ఇస్తారు.
  • ఈ క్రింద ఇచ్చిన కొన్ని మెడ వ్యాయామాల వల్ల మీకు కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ వ్యాయామాలు చేసే సమయంలో నొప్పి వచ్చినట్లయితే ఆపేయండి.
  • ఆకస్మికంగా మేడని కదిలించకుండా సజావుగా మరియు నెమ్మదిగా చేయండి.

1. మెడ వంచుట మరియు పొడిగించుట (Neck flexion and extension)

neck flexion and extension exercise in telugu

  • ఇది కుర్చునప్పుడు మరియు నిలుచునప్పుడు కూడా చేయవచ్చు.
  • ముందుగ నెమ్మదిగా మీ తలని ముందుకి వంచండి. మీ దవడ ఛాతికి అనుకునే వరకు వంచండి. ఈ స్థితిలో అయిదు నుండి పది సెకండ్లు అలాగే ఉండండి. తరువాత మెడను మెల్లిగా సాధారణ స్థానానికి తీసుకురండి.
  • ఇప్పుడు తలని వెనక్కి మీరు ఎంత వంచగలిగితే అంత వంచి ఆ స్థానంలో ఐదు నుండి పది సెకండ్లు అలాగే ఉంచి సాధారణమైన స్థానానికి తీసుకురండి.
  • ఇలా ఐదు సార్లు ఈ వ్యాయామాన్ని రిపీట్ చేయండి.
  • ఇలా చేయడం వలన మీ మెడ యొక్క ముందు మరియు వెనక భాగంలో వశ్యత మరియు కదలికలు మెరుగుపడతాయి. 

2. తల వంచుట (Head tilt)

Side tilt exercise in telugu

  • ఇది కుర్చునప్పుడు మరియు నిలుచునప్పుడు కూడా చేయవచ్చు.
  • కుడి భుజాన్ని క్రిందకి  ఉంచుతూ నెమ్మదిగా మీ తలని ఎడమ భుజం వైపు వంచండి. ఐదు నుండి పది సెకండ్లు ఆ స్థానంలో ఉంచి తిరిగి మీ తలని సాధారణ స్థితికి తీసుకురండి.
  • అలాగే ఎడమ భుజాన్ని  క్రిందకు ఉంచుతూ నెమ్మదిగా మీ తలని కుడి భుజం వైపు వంచండి. ఐదు నుండి పది సెకండ్లు ఆ స్థానంలో ఉంచి తిరిగి సెంటర్ లోకి మీ తలని తీసుకురండి
  • ఈ వ్యాయామాన్ని ఐదు సార్లు రిపీట్ చేయండి. ఈ కదలికలు మెడకి ఇరువైపులా పని చేస్తాయి.

3. మెడ భ్రమణం (Neck rotation)

Neck rotation exercise in telugu

  • ఇది నిలుచునప్పుడు మరియు కుర్చీలో కుర్చునప్పుడు కూడా చేయవచ్చు.
  • నెమ్మదిగా మీ తలని కుడి వైపు తిప్పండి దవడ భుజానికి స్ట్రెయిట్ గా వచ్చేలా చూసుకోండి. ఐదు నుండి పది సెకండ్లు ఆ స్థానంలో ఉంచి తిరిగి యధాస్థితి లోకి మీ తలని తీసుకురండి.
  • అలాగే నెమ్మదిగా మీ తలని ఎడమ వైపు తిప్పండి దవడ భుజానికి స్ట్రెయిట్ గా వచ్చేలా చూసుకోండి. ఐదు నుండి పది సెకండ్లు ఆ స్థానంలో ఉంచి తిరిగి మీ తలని సాధారణ స్థితికి తీసుకురండి.
  • ఇరువైపులా దీనిని ఐదు సార్లు రిపీట్ చేయండి.
  • ఇలా చేయడం వల్ల మెడకి ఇరువైపులా మంచిది.

4.  మెడ ఉపసంహరణము (Neck retraction)

Neck retraction exercise in telugu

  •  కుర్చీలో కూర్చుని మీ తలని మరియు భుజాల్ని స్ట్రెయిట్ పెట్టండి. ఇప్పుడు మీ దవడని డబల్ చిన్ వచ్చేలా లోపలికి లాగి అలాగే ఐదు నుండి పది సెకండ్లు ఈ స్థానంలో ఉంచండి. ఈ స్థానంలో మీకు మీ మెడ సాగుతున్న భావన కలుగుతుంది.
  • ఇప్పుడు మరల సాథారణ స్థానానికి తీసుకురండి . ఇలా ఐదు సార్లు రిపీట్ చేయండి.
  • ఈ వ్యాయామం చేయడం వలన మీ మెడ వెనక భాగంలో సాగుతున్న భావన కలుగుతుంది.

5. షోల్డర్ రోల్స్ (Shoulder rolls)

shoulder rolls exercise in telugu

  • నెక్ ఎక్సర్సైస్ (మెడ వ్యాయామాలు) కాకుండా భుజాల దగ్గర కూడా వ్యాయామం చేయడం వలన కండరాలు బలపడడానికి సహాయ పడతాయి.
  • దీనిని కుర్చునప్పుడు మరియు నిలుచున్న స్థానంలో కూడా చేయవచ్చు.
  • మీ భుజాన్ని పైనకి వెనక్కి మరియు క్రిందకి నేమ్మదిగ తిప్పండి దీన్ని ఐదు సార్లు రిపీట్ చేయండి.
  • ఇప్పుడు మీ భుజాన్ని పైనకి ముందుకి మరియు క్రిందకి నేమ్మదిగ తిప్పండి దీన్ని ఐదు సార్లు రిపీట్ చేయండ.
  • ఇది సులభ వ్యాయామం. ఇది మీ భుజం మరియు మెడ కీళ్ళు ద్రవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Top neck exercises in Telugu, Cervical Spondylosis exercises in Telugu,  Neck pain exercises in telugu

Have a question?

Feel free to ask us for any help or information here!

Reviews

సర్వికల్ స్పాన్డిలోసిస్ కి చేయవలసిన వ్యాయామాలు
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.
Name
Email
Rating
Review

 

 

 

 

 

2 thoughts on “సర్వికల్ స్పాన్డిలోసిస్ కి చేయవలసిన వ్యాయామాలు

  1. I have back pain unable to bend & unable to stand up straight when got up from the floor my back will get freeze after my sleep i can feel a sevear pain in my spine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *