Calpol tablet usage side effects

Calpol Tablet – ఉపయోగాలు – సైడ్ఎఫెక్ట్స్

Calpol టాబ్లెట్లు జ్వరాన్ని తగ్గించే యాంటిఫైరిటిక్ (antipyretics) మరియు ఒళ్ళు నొప్పులు తగ్గించే పెయిన్ కిల్లర్ (analgesics) రకానికి చెందినా మెడిసిన్. ఇది తలనొప్పి, పంటి నొప్పి, ఆర్థరైటిస్, వెన్ను నొప్పి, మరియు చిన్నపాటి గాయాలు, ఇంకా స్త్రీలలో అయితే రుతుపరమైన నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. Calpol tablet లలో ఉండే ముఖ్య ఔషధం Paracetamol. మెదడులో విడుదలయ్యే నొప్పి, మరియు జ్వరానికి కారణమైన కొన్ని రసాయనాలు విడుదల కాకుండా Calpol Tablet ఆపుతుంది. తద్వారా నొప్పిని మరియు జ్వరాన్ని తగ్గిస్తుంది. ఈ మెడిసిన్ పెద్దలు మరియు 6 నెలలు పైబడ్డ పిల్లలు వాడవచ్చు.

కాల్పాల్ టాబ్లెట్ ఉపయోగాలు – Calpol tablet uses in Telugu:

Calpol టాబ్లెట్ సాధారణంగా ఈ కింది వ్యాధులు, పరిస్థితులు మరియు లక్షణాల చికిత్స, నియంత్రణ, నివారణలో సిఫార్సు చేయబడుతుంది:

జ్వరానికి – Calpol tablet for Fever

అన్ని వయస్సుల వారిలో జ్వరాన్ని నివారించడానికి ఈ Calpol టాబ్లెట్ ను ఎక్కువగా సిఫార్సు చేస్తుంటారు. పిల్లల్లో అయితే జ్వరం 38.5 సెల్సియస్ లేదా 101.3 ఫారెన్ హీట్ ఉన్నపుడు సిఫార్సు చేస్తారు.

తలనొప్పికి – Calpol tablet for Headache

కొన్ని సందర్భాలలో మైగ్రేయిన్ తలనొప్పి నివారణకు కూడా సిఫార్సు చేస్తారు.

కండరాల నొప్పికి – Calpol tablet for Muscle Pain

కాల్పాల్ టాబ్లెట్ ను తేలికపాటి కండరాల నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.

నొప్పి నివారణకు – Calpol tablet for Pain

తేలికపాటి నొప్పి నుండి ఉపశమనం పొందటానికి కూడా కాల్పాల్ ను సిఫార్సు చేస్తారు.

ఆస్టియోఆర్థరైటిస్ – Calpol tablet for Osteoarthritis

ఆస్టియోఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ల నొప్పిని తగ్గించడానికి కూడా కాల్పాల్ టాబ్లెట్ ను సిఫార్సు చేస్తారు.

వెన్నునొప్పికి – Calpol tablet for Low Back Pain

వెన్నునొప్పి కి ప్రధమ చికిత్సగా ఈ కాల్పాల్ టాబ్లెట్లను సిఫార్సు చేస్తారు.

పంటి నొప్పి – Calpol tablet for Toothache

Calpol ను పంటి నొప్పిలో కూడా ఉపయోగిస్తారు.

Calpol tablet for Menstrual Period Pain

స్త్రీలలో రుతుపరమైన నొప్పులను నివారించడానికి కూడా ఉపయోగిస్తారు.

Calpol tablet for Cold / Flu Pain

జలుబు వల్ల కలిగే ఒంటినొప్పులు నివారణకు ఈ మెడిసిన్ ను సిఫార్సు చేస్తారు.

Calpol tablet ను సిఫార్సు చేయని సందర్భాలు:

అలర్జీ – Allergy

కాల్పాల్ టాబ్లెట్ లేదా ఇతర NSAID మేదిసిన్స్ వల్ల అలర్జీ ఉంటే వాడకూడదు

ఆస్థమా – Asthma

ఆస్థమా లేదా ఏ ఇతర శ్వాస సంభంధ రుగ్మతలు ఉన్నా దీనిని సిఫార్సు చేయరు..

రక్త స్రావం – Bleeding

శరీరంలో, ప్రేగులలో, జీర్ణాశయం లో ఏదైనా రక్తస్రావం (Bleeding) ఉంటె దీనిని సిఫార్సు చేయరు. ఈ మెడిసిన్ వాడకం వల్ల అలాంటి సందర్భాలలో రక్తస్రావం అధికమయ్యే అవకాశం ఉంటుంది.

కాల్పాల్ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ – Calpol Tablet Side-effects in Telugu

కాల్పాల్ టాబ్లెట్ సరైన వైద్యసలహ మేరకు వాడదగ్గ అత్యంత సురక్షితమైన మెడిసిన్. కానీ ఏదైనా ఇబ్బందికరమైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినపుడు వెంటనే డాక్టర్ ను కలవాలి. ఉదాహరణకు:

  • కడుపు నొప్పి
  • పొత్తి కడుపు నొప్పి
  • అలర్జీ
  • అనారోగ్య భావన
  • వికారం
  • వాంతులు
  • లివర్ డ్యామేజ్
  • అనోరెక్సియా – Anorexia
  • పాలిపోవడం – Paleness
  • చిరాకు
  • అతిగా చెమటలు పట్టటం
  • కిడ్నీ డ్యామేజ్
Shop top health products at Shop.HealthClues

Calpol Tablet – Precautions & How to Use

కాల్పాల్ టాబ్లెట్ వాడే ముందు మీరు ఏదైనా ఇతర మెడిసిన్, విటమిన్ లేదా హెర్బల్ సప్లిమెంట్లు ఏమైనా వాడుతున్నట్లయితే మీ డాక్టర్ కు తెలియజేయాలి.  మీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేయాలి. ఉదాహరణకు గర్భవతులు, లేక కొద్దిరోజుల్లో ఏదైనా సర్జరీ ఉన్నవారు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు ఈ మెడిసిన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్ సిఫార్సు మేరకు ఈ మెడిసిన్ మోతాదు, వాడకం ఉంటుంది. డోస్ అనేది సమస్య బట్టి వేరువేరుగా ఉండవచ్చు. మెడిసిన్ వినియోగంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు:

  • టాబ్లెట్స్ పట్ల అలర్జీ ఉన్నవారు వాడకూడదు
  • రోజు మద్యపానం అలవాటు ఉన్నవారు ఈ మెడిసిన్ వాడకపోవడం ఉత్తమం
  • మద్యం తో పాటు ఈ మెడిసిన్ వాడకూడదు. శరీరం లోపల రక్తస్రావం జరిగే అవకాసం ఉంటుంది
  • కంటి చూపులో మార్పు, చెవిలో శబ్ధాలు వంటి మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి
  • Systemic lupus erythematosus వంటి అలర్జీ రియాక్షన్ గమనిస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి
  • ఏ ఇతర అలర్జీలు ఉన్నా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి

కొన్ని సాధారణ హెచ్చరికలు:

ఓవర్ డోసెజ్ – Over dosage

మోతాదుకు మించి వాడడం కొన్ని తీవ్ర దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కలిగినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవాలి.

సమయానికి వేఉకోవలసిన డోస్ మిస్ అయినపుడు – Missing dosage

ఎపుడైనా పొరపాటున వేసుకోవలసిన డోస్ మర్చిపోతే, వీలైనంత వెంటనే వేసుకోవాలి. ఒకవేళ తదుపరి డోస్ కు సమయం దగ్గర పద్దపుడు ఆ పూట వేసుకోవలసిన డోస్ వేసుకోవాలే తప్ప అదనంగా రెండు డోస్ లు కలిపి వేసుకోకూడదు. అదనపు డోస్ వేసుకోకూడదు.

గర్భిణి స్త్రీలలో – Pregnancy

తప్పనిసరి అయితే తప్ప గర్భిణి స్త్రీలకు ఈ Calpol tablet సిఫార్సు చేయబడదు. వీరు ఈ మందు వాడడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. గర్భంలోని శిశువుకు అయితే హాని కలుగవచ్చు అనే ఋజువులేమీ లేవు కానీ, వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

పాలిచ్చే తల్లుల్లో – Breast-feeding

Calpol tablet ను వీరు వాడవచ్చు, కానీ వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

కాల్పాల్ టాబ్లెట్ కు ప్రత్యామ్నాయ టాబ్లెట్స్ – Substitutes for Calpol tablet:

క్రింద పేర్కొన్న కొన్ని టాబ్లెట్లలో Calpol టాబ్లెట్లతో సరిసమానమైన, కాంబినేషన్, డోస్, మరియు సామర్ధ్యం ఉంటుంది కనుక వీటిని డోలో టాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు:

  • Cipmol 500 MG Tablet
  • Dimace P 500 MG Tablet
  • Lupipara 500 MG Tablet
  • Malidens 500 MG Tablet
  • Paracad 500 MG Tablet

మీకు దగ్గరలో అనుభవజ్ఞుడైన డాక్టర్ అందుబాటులో లేనట్లయితే, మీరు ఇక్కడ మమ్మల్ని సంప్రదించవచ్చు.

Leave a Review

How did you find the information presented in this article? Would you like us to add any other information? Help us improve by providing your rating and review comments. Thank you in advance!

Name
Email (Will be kept private)
Rating
Comments
Calpol Tablet - ఉపయోగాలు - సైడ్ఎఫెక్ట్స్ Overall rating: ☆☆☆☆☆ 0 based on 0 reviews
5 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *