Acetaminophen uses and side effects

Acetaminophen – ఎసిటమినోఫెన్ ఉపయోగాలు

Acetaminophen (ఎసిటమినోఫెన్) అనేది Paracetamol (పారాసెటమాల్) కు గల మరో పేర. Acetaminophen లేదా Paracetamol విస్తృతంగా ఉపయోగించే అనాల్జేసిక్ (నొప్పి నివారిణి) మరియు యాంటిఫైరిటిక్ (జ్వరాన్ని తగ్గించేది) మెడిసిన్. అంతేకాక దీనిని నడుమునొప్పి నుండి ఉపశమనం పొందడానికి, osteoarthritis (ఆస్టియో ఆర్థరైటిస్) నొప్పులు, తలనొప్పి, స్త్రీల రుతసమయ నొప్పులు, పంటినొప్పి మరియు జలుబు వల్ల కలిగే ఒంటినొప్పులు నివారణకు ఉపయోగపడుతుంది.

ఎసిటమినోఫెన్ ఎలా పని చేస్తుంది – How does Acetaminophen work?

Acetaminophen శరీరం నొప్పిని భరించే సామర్ధ్యాన్ని పెంచుతుంది, తద్వారా నొప్పి తెలియనివ్వదు. ఈ మెడిసిన్ వాపు పై ప్రభావం చూపాడు.

శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడులోని ఒక భాగంపై ఈ మెడిసిన్ పని చేస్తుంది. జ్వరంలో శరీరం వేడిగా అయినపుడు ఈ మెడిసిన్ వల్ల ప్రభావితమైన మెదడులోని ఈ భాగం శరీరపు వేడిని తగ్గిస్తుంది, తద్వారా జ్వరం తగ్గుతుంది.

ఎసిటమినోఫెన్ ఉపయోగాలు – Acetaminophen uses:

Acetaminophen ను వాడగలిగిన కొన్ని ఆరోగ్య సమస్యలు:

జ్వరం మరియు ఒంటినొప్పులు – Fever and Pain

ఎసిటమైనోఫెన్ జలుబు/ఫ్లూ, తలనొప్పి, వెన్నునొప్పి మరియు జ్వరం చికిత్సకు ఉపయోగిస్తారు.

ఆస్టియో ఆర్థరైటిస్ – Osteoarthritis

ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ళనొప్పులు, మోకాళ్ల నొప్పులు, తొంటి నొప్పి, వెన్ను నొప్పి వంటి వాటిని నియంత్రించడానికి Acetaminophen (ఎసిటమినోఫెన్) ను వాడతారు.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ – Rheumatoid Arthritis

రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పుల నియంత్రణకు వాడతారు

డిస్మెనోరియా – Dysmenorrhea

ఎసిటమినోఫెన్ ఋతుస్రావం సమయంలో నొప్పి మరియు తిమ్మిర్ల చికిత్సకు ఉపయోగిస్తారు.

ఎసిటమినోఫెన్ యొక్క యితర ఉపయోగాలు:

  • తలనొప్పి
  • దంత నొప్పి
  • కాపు తిత్తుల వాపు – Bursitis
  • మైగ్రెయిన్ – Migraine
  • స్నాయువుల నొప్పి (ఎముకలను మరియు కండరాలను కలిపే టెన్డన్ల వాపు) – Tendinitis
  • కండరాల నొప్పి మరియు కీళ్ళు యొక్క బెణుకుల కారణంగా కలిగే నొప్పులు
  • మూత్రపిండాల్లో రాళ్ళు మరియు పిత్తాశయ రాళ్ళు వంటి సందర్భాల్లో కలిగే తేలికపాటి నొప్పిని తగ్గించడానికి
  • పాలిమైసిటిస్ – Polymyositis – (కండరాల వాపు)
  • TMJ (టెంపోరోమ్యాండిబ్యులర్ జాయింట్) నొప్పి

ఎసిటమినోఫెన్ సిఫార్సు చేయబడే మోతాదు – Recommended dosage of acetaminophen:

  • టాబ్లెట్ల రోపంలో అయితే ప్రతి 4 నుండి 6 గంటల వ్యవధిలో, 325 నుండి 650 మిల్లీగ్రాములు సిఫార్సు చేస్తారు
  • ఒక రోజుకు గరిష్టంగా 4 గ్రాములకు మించకూడదు
  • చిన్న పిల్లలకైతే వారి వయసును బట్టి ప్రతి 4 గంటలకు ఒకసారి 40 నుండి 650 మిగ్రా సిఫార్సు చేస్తారు
  • ఈ మెడిసిన్ ను నొప్పులకైతే 10 రోజులకంటే ఎక్కువ, జ్వరానికి అయితే 4 రోజులకంటే ఎక్కువ సరైన డాక్టర్ సలహా లేనిదే వాడడం శ్రేయస్కరం కాదు

Acetaminophen సిఫార్సు చేయబడని సందర్భాలు:

అలెర్జీ – Allergy

ఇతర NSAID రకానికి చెందిన ఏ ఇతర మందులైన పడని వారు వీటిని వాడ కూడదు

ఆస్థమా – Asthma

ఆస్థమా లేదా ఊపిరి తిత్తులకు సంభందించిన ఏ ఇతర సమస్యలైన ఉన్నపుడు వీటిని సిఫార్సు చేయరు

రక్తస్రావం – Bleeding

శరీరంలో ఏదైన రక్తస్రావం జరుగుతుంటే కూడా ఈ మెడిసిన్ సిఫార్సు చేయరు. ఇలాంటపుడు ఇది వాడడం వల్ల శరీరంలో అంతర్గతంగా ఉదాహరణకు ప్రేగులలో రక్తస్రావం ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది

ఎసిటమినోఫెన్ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేదా దుష్ప్రభావాలు – Acetaminophen side effects:

  • ఈ మెడిసిన్ పడకపోతే కలిగే ముఖ్య దుష్ప్రభావాలు – పొత్తికడుపులో నొప్పి, చర్మంపై దద్దుర్లు, చెవిలో శబ్దాలు వినపడడం, తలనొప్పి, మైకము, మగతగా ఉండడం, అతిసారం లేదా నీళ్ల విరేచనాలు, వికారం (వాంతి వచ్చేటట్టు ఉండడం), గుండెల్లో మంట, మరియు మలబద్దకం.
  • ప్రేగులలో అల్సర్ కలగడం, కొన్ని సార్లు రక్తస్రావం కూడా ఉండడం వంటి కొన్ని తీవ్ర దుష్ప్రభావాలు
  • అలర్జీ కలగడం, ముఖ్యంగా ఆస్థమా ఉన్నవారిలో ఎక్కువ అవకాశం ఉంటుంది
  • కిడ్నిలకు రక్తప్రసరణ తగ్గడం, మరియు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం

ఎసిటమినోఫెన్ వాడకం పట్ల డాక్టర్లు ఇచ్చే సలహా – Doctor’s advice for Acetaminophen Tablet:

  • కొద్దికాలం పాటు మాత్రమే వాడినపుడు ఈ మెడిసిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది
  • ఎక్కువ మోతాదులో వాడడం, లేదా ఎక్కువ కాలంపాటు వాడడం వల్ల కిడ్నిలకు హానికరం అవుతుంది ఇంకా జీర్ణాశయంలో రక్తస్రావం కావచ్చు
  • కిడ్నీ సమస్య ఉన్నవారు ముందే డాక్టర్ కు తెలియజేయాలి, వీరి విషయంలో ఈ మెడిసిన్ మోతాదులో వారికి అనుగుణంగా మార్పులు అవసరం కావచ్చు (డాక్టర్ సూచిస్తారు)
  • మద్యపానం చేసినపుడు ఈ Acetaminophen మెడిసిన్ ను తీసుకోకూడదు, అలా వాడడం లివర్ కు హానికరం కావచ్చు
  • పొరపాటున ఎపుడైనా మోతాదుకు మించి ఈ Acetaminophen మెడిసిన్ ను వాడినట్లయితే, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి

కొన్ని సాధారణ హెచ్చరికలు – General warnings:

Over dosage – ఓవర్ డోసెజ్:

మోతాదుకు మించి వాడడం కొన్ని తీవ్ర దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కలిగినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవాలి

Missing dosage – సమయానికి వేఉకోవలసిన డోస్ మిస్ అయినపుడు:

ఎపుడైనా పొరపాటున వేసుకోవలసిన డోస్ మర్చిపోతే, వీలైనంత వెంటనే వేసుకోవాలి. ఒకవేళ తదుపరి డోస్ కు సమయం దగ్గర పద్దపుడు ఆ పూట వేసుకోవలసిన డోస్ వేసుకోవాలే తప్ప అదనంగా రెండు డోస్ లు కలిపి వేసుకోకూడదు. అదనపు డోస్ వేసుకోకూడదు.

Pregnancy – గర్భిణి స్త్రీలలో

తప్పనిసరి అయితే తప్ప గర్భిణి స్త్రీలకు ఈ Acetaminophen మెడిసిన్ సిఫార్సు చేయబడదు. వీరు ఈ మందు వాడడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. గర్భంలోని శిశువుకు అయితే హాని కలుగవచ్చు అనే ఋజువులేమీ లేవు కానీ, వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

Breastfeeding – పాలిచ్చే తల్లుల్లో

Acetaminophen ను వీరు వాడవచ్చు, కానీ వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

ఎసిటమినోఫెన్ వాడేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు – Precautions before taking Acetaminophen tablet:

కొన్నిసార్లు కొన్ని రకాల రుగ్మతలు ఉన్నవారికి కొన్ని రకాల మందులు పడకపోవచ్చు. కనుక Acetaminophen మెడిసిన్ వాడేప్పుడు కూడా జాగ్రత్త వహించడం మంచిది. డాక్టర్ ను సంప్రదించి వాడడం ఉత్తమం

  • అల్సర్ తో బాధ పడుతున్నవారు, Crohn’s disease లేదా ulcerative colitis వంటి ప్రేగులకు సంభందించిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు
  • ఆస్థమా, లేదా వేరే ఏ రకమైన అలెర్జీ రుగ్మతలు ఉన్నా
  • గర్భిణిలు, పాలు ఇచ్చే తల్లులు
  • బి.పి. – అధిక రక్తపోటు ఉన్నా
  • గుండె సంభంధ ఆరోగ్య సమస్యలు ఉంటె
  • కొంతమందిలో రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలంటి వారి జాగ్రత్త వహించాలి
  • వేరే ఏ ఇతర నొప్పి నివారణ మందుల వల్ల అయినా ఇంతకూ మునుపు పాడనీ వారు (Aspirin, Naproxen, మరియు Diclofenac, indometacin వంటి మందులు పడని వారు)
  • కిడ్ని, లేదా లివర్ సమస్యలు ఉన్న వారు

మీకు దగ్గరలో అనుభవజ్ఞుడైన డాక్టర్ అందుబాటులో లేనట్లయితే, మీరు ఇక్కడ మమ్మల్ని సంప్రదించవచ్చు.

Acetaminophen uses and side effects, Acetaminophen in Telugu

Reviews

Acetaminophen – ఎసిటమినోఫెన్ ఉపయోగాలు
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *