Aceclofenac in Telugu

Aceclofenac – అసెక్లోఫినాక్ ఉపయోగాలు

Aceclofenac అనేది ఒక నొప్పినివారణ ఔషధం. ఇది NSAID రకానికి చెందిన నొప్పి నివారణ ఔషధం. NSAID యొక్క పూర్తి పేరు Nonsteroidal anti-inflammatory drugs. ఉదాహరణకు Ibuprofen (ఇబూప్రోఫెన్) మరియు Aspirin (ఆస్ప్రిన్) వంటివి కూడా NSAID రకానికి చెందినవే.

Aceclofenac మెడిసిన్ గురించి ఇంగ్లీషులో చదవండి

హెచ్చరిక!

గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఈ NSAID ఔషధాలు చాలా రకాలు ఉన్నాయి. ఒక దానికి ఇంకొకటి ప్రత్యామ్న్యాయంగా వాడకూడదు. వైద్యుని సలహా లేకుండా వీటిని ఎక్కువ కాలం పాటు వాడకూడదు. దానివల్ల ఇతర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు గ్యాస్ట్రిక్ అల్సర్ (GASTRIC ULCERS). గ్యాస్ట్రిక్ అల్సర్ కలగడానికి కారణం, ఈ NSAID మందులు కడుపులో యాసిడ్ ను రూపొందిస్తాయి. వైద్యుడు ఈ NSAID మందులు సిఫార్సు చేసినపుడు వాటితో పాటుగా అసిడిటిని నియంత్రించడానికి కూడా వేరే ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది.

Aceclofenac ఒక నొప్పినివారణకు వాడే మరొక ఔషధం Diclofenac పేరుతొ పోలిస్తే వినడానికి ఒకేలా ఉంటాయి. వైద్య పరిశోధనలో, ఇతర NSAID ఔషధాల కన్నా ఆసేక్ఫోఫేనాక్ (Aceclofenac) కడుపులో తక్కువ ఆమ్లాన్ని (ACID) ఉత్పత్తి చేస్తుందని కనుగొనబడింది.ఈ విధంగా, ఇది ఇతర నొప్పినిరోధక ఔషధాల కంటే కొద్దిగా తక్కువ ఆసిడ్ ను ఉత్పత్తి చేసే మందుగా పరిగణించబడుతుంది.

ఇప్పుడు Aceclofenac నొప్పి ఎలా తగ్గిస్తుందో తెలుసుకుందాం:

తరచుగా, గాయం తరువాత, గాయపడిన ప్రాంతంలో నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఒక ప్రొస్టాగ్లాండిన్ హార్మోన్ ఏర్పడడం వల్ల సంభవిస్తుంది. ఈ హార్మోన్ నొప్పి తగ్గించే ప్రక్రియలో సహాయపడుతుంది, కానీ ఈ హార్మోన్ చాలా ఎక్కువ మోతాదులో విడుదల అవడం వల్ల, అది భరించలేని నొప్పిని కలిగిస్తుంది. దీనివల్ల నొప్పి తగ్గకపోవడంతో పాటు ఎక్కువ నొప్పి కలుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో, Aceclofenac సమర్థవంతంగా ఈ హార్మోన్ విడుదలను తగ్గించి నొప్పి నుండి పూర్తిగా ఉపసమనం కలిగిస్తుంది.

Parents Health Insurance Plans

హెచ్చరిక!

Aceclofenac ఔషధాన్ని వైద్యుడి సలహా లేకుండా తీసుకోకూడదు. గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులు, పిల్లలు మరియు Porphyria (పోర్ఫిరియా) రోగంతో భాద పడుతున్న వారికి ఈ ఔషధం తీసుకోవడం నిషేధించబడింది. మీరు ఇప్పటికే GASTRIC ULCERS తో బాధపడుతుంటే కూడా తీసుకోకూడదు.

ఈ ఔషధాన్ని దిగువ పేర్కొన్న సమస్యలలో వైద్యుడిచే తరచుగా సూచించబడుతుంది:

  1. కీళ్ల నొప్పులకు –   కీళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుకునేందుకు కొన్ని మార్గాలు
  2. జ్వరం మరియు తలనొప్పి
  3. నడుము నొప్పి
  4. పంటి నొప్పి
  5. ఋతు సమయంలో నొప్పి
  6. ఫైబ్రోమైయాల్జియా (Fibromyalgia) – కండరాల నొప్పి

మన దేశంలో సాధారణంగా వైద్యుడి సిఫార్సు లేకుండానే చాలా మంది నొప్పి నివారణకు ఈ ఔషధాన్ని వాడుతుంటారు. ఒక భాద్యత గల వెబ్ సైట్ గా ఈ ఔషధాన్ని ఎప్పుడు, ఎవరు, ఎంత మోతాదులో వాడాలి అన్న వివరాలు ప్రచురించాలేము. అలా చేయడం మల్లి వైద్య సలహా లేకుండా ఔషధాలను వాడే పద్ధతిని ప్రోత్సహించినట్లే అవుతుంది.

మీరు ఏవిధమైన నొప్పి లేదా జ్వరంతో బాధపడుతున్నపుడు, డాక్టర్ ను సంప్రదించే ముందు మీరు మీ యొక్క రుగ్మత గురించి ఒక కాగితంలో నోట్ చేసుకోండి. ఉదాహరణకు మునుపు ఉన్న రుగ్మతలు, ఏదైనా ఔషధాల నుండి అలర్జీ ఉంటె, ఒకవేళ మీరు గర్భిని స్త్రీ అయితే, అసిడిటీ లేదా ప్రేగుల రక్త స్రావ సమస్యలు ఉంటె డాక్టర్ కు ఈ విషయాలు ఖచ్చితంగా తెలియజేయాలి.

మీకు దగ్గరలో అనుభవజ్ఞుడైన డాక్టర్ అందుబాటులో లేనట్లయితే, మీరు ఇక్కడ మమ్మల్ని సంప్రదించవచ్చు.

Aceclofenac in Telugu, Aceclofenac తెలుగులో

References:

Are you Looking For a Health Insurance? – Read this for More Information

Health Insurance for Family

Karmoker, J.R.; Sarkar, S.; Joydhar, P.; Chowdhury, S.F. (2016). “Comparative in vitro equivalence evaluation of some Aceclofenac generic tablets marketed in Bangladesh”

Reviews

Aceclofenac - అసెక్లోఫినాక్ ఉపయోగాలు
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.
Name
Email
Review Title
Rating
Review Content

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *