హైడ్రోథెరపీ (జల వ్యాయామం) వల్ల లాభాలు!

శరీరాకృతిని తీర్చిదిద్దటంలో ఈత ను మించిన వ్యాయామం మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే కొద్దిదూరం ఈదాలన్నా శరీరంలోని అన్ని ముఖ్యమైన కండరాల కదలికలు చాలా అవసరం. దీంతో శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది. ఇక వేగంగా ఈదడం  కూడా ఒక రకమైన ఏరోబిక్‌ వ్యాయామం. నేడు చాలా మంది ఎముకల మరియు కండరాల నొప్పుల రుగ్మతలు అనగా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఫైబ్రోమైయాల్జియా, వెన్నునొప్పి తో బాధపడుతుంటారు. అంతేకాకుండా స్థూలకాయం వల్ల చాలా మంది నేల పై వ్యాయామం చేయడం వల్ల కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు.

అయితే ఒక ఫిజియోథెరపిస్ట్ గా నన్ను చాలా మంది రోగులు సురక్షితంగా మరియు ఆచరణయోగ్యంగా శరీర బరువును మరియు కీళ్ళ నొప్పులను ఎలా తగ్గించుకోవాలని అడిగినప్పుడు నేను ముందుగా హైడ్రోథెరపిని (జల వ్యాయామం) సూచిస్తాను. అయితే ఈ వ్యాసంలో  హైడ్రోథెరపి (జల వ్యాయామం) ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

హైడ్రోథెరపీ (జల వ్యాయామం)

నీరు కండరాల శక్తిని పెంచడానికి సహాయపడుతుంది మరియు సహజ నిరోధక శక్తిని (రెసిస్టన్స్) అందిస్తుంది. నీటిలో వ్యాయామం చేసే సమయంలో కాళ్ళు చేతులు కదపడానికి, బయటి వాతావరణంలో కన్నా అదనపు శక్తి జోడించి చేయాల్సి ఉంటుంది. కానీ అదే సమయంలో నీటిలో కీళ్ళపై పీడనం తక్కువగా ఉంటుంది. కనుక కీళ్ళు ఒత్తిడికి లోనుకావు మరియు కావలసిన వ్యాయామం కూడా అందుతుంది. ఏ రకమైన గాయం లేదా ఒత్తిడి కలుగకుండా మీ జాయింట్లు సులభంగా కదులడానికి జల వ్యాయామం ఉపయోగపడుతుంది.

హైడ్రోథెరపి శరీరం మొత్తానికి పూర్తి వ్యాయామాన్ని అందిస్తుంది. ఛాతీ, తొ౦టి, వీపు వంటి ప్రధాన కండరాలు బాగా బలపడతాయి. మరియు స్థూలకాయ౦ (obesity) ఉన్నవారికి హైడ్రోథెరపి (ఈత) కొవ్వును కరిగింటచడంలోనూ బాగా తోడ్పడుతుంది. కొవ్వును కరిగించే వ్యాయామాల్లో శక్తిని క్రమంగా ఖర్చు చేయడం చాలా కీలకమైన విషయమని గుర్తించుకోవాలి. ఈదుతున్నప్పుడు మనం శరీర బరువుని మోయాల్సిన పనిలేదు. దీంతో కీళ్ల మీద ఒత్తిడీ పడదు. మోకాళ్లు, తుంటి, వెన్నెముకల మీద బరువు వేయకుండానే వ్యాయామం అయిపోతుంది. నడుము లోతు నీటిలో ఈదితే కీళ్ల మీద పడే ఒత్తిడి 50%, ఛాతీలోతు నీటిలో ఈదితే 75% వరకు తగ్గుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. గాయాల కారణంగా నడవటం, పరుగెత్తటం వంటివి చేయలేనివారికీ ఈత మంచి వ్యాయామం.

హైడ్రో థెరపీ కండరాల, ఎముకల రుగ్మతలు ఉన్న రోగులకు ఒక ప్రముఖ చికిత్స మరియు ఎముకల బాధ, వెన్ను నొప్పి, మరియు ఫైబ్రోమైయాల్జియా రోగుల్లో ప్రయోజనకరమైన చికిత్సగా చెప్పుకోవచ్చు.[1]

హైడ్రోథెరపీ (జల వ్యాయామం) వల్ల ప్రయోజనాలు

 • కీళ్ళ నొప్పి తగ్గడం.
 • కీళ్ళ పై ఒత్తిడిని / గట్టిపడడాన్ని నిరోదించడానికి
 • కదలిక శ్రేణి పెంచడానికి
 • కీళ్ళ మరియు కండరాల శక్తీని పెంచడానికి
 • కండరాల నొప్పులు తగ్గించడానికి
 • సమతుల్యత మరియు సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది
 • హృదయ సామర్థ్యం మెరుగుపరచండి

ఎలాంటి రుగ్మతలలో హైడ్రోథెరపీ (జల వ్యాయామం) అవసరమవుతుంది

 • ఆర్థరైటిస్
 • ఆస్టియోపొరోసిస్
 • ఆర్థోపెడిక్ సర్జరీ తర్వాత
 • స్థూలకాయ౦ (obesity)
 • వెన్ను నొప్పి మరియు భుజం నొప్పి
 • అవయవం తొలగించిన వారిలో (Amputations)
 • లింపిడెమా (Lymphedema)
 • దీర్ఘకాల ఇనాక్టివిటీ (Prolonged inactivity/immobility)
 • అలసట/బలహీనత (Fatigue/weakness)
 • హిప్, మోకాలు, లేదా చీలమండ నొప్పి (Hip, knee, or ankle pain)
 • మెదడు లేదా వెన్నుపాము గాయాలు (Brain or spinal cord injuries)
 • నరాల సంబందిత (న్యూరోలాజికల్) రుగ్మతలలో అనగా స్ట్రోక్, సెరెబ్రల్ పాల్సి, పార్కిన్సన్ వ్యాధి, మరియు మల్టిపుల్ స్క్లేరోసిస్ లో కూడా ఉపయోగపడుతుంది.

మీ కీళ్ళకు ఎలాంటి హాని కలగకుండా మీ శరీర బరువును తగ్గించుకోవడం ఎలా అన్నది, వేధించే ప్రశ్నగా మారినపుడు అత్యంత రిలాక్సింగ్ మరియు నమ్మకమైన మార్గంలో హైడ్రోథెరపీ మీకు ఉపయోగపడుతుంది.

Reference

 1. Aquaticexercise & balneotherapy in musculoskeletal conditions; Verhagen, Arianne P.; Cardoso, Jefferson R.; Bierma-Zeinstra, Sita M.A.Best Practice & Research Clinical Rheumatology , Volume 26 (3) – Jun 1, 2012

Reviews

హైడ్రోథెరపీ (జల వ్యాయామం) వల్ల లాభాలు!
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *