వివిధ రుగ్మతలలో ఫిజియోథెరపి ప్రాముఖ్యత

పరిచయం:

నేడు వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఎన్నో రకాల రుగ్మతలు మనిషి జీవిత కాలాన్ని, నాణ్యతను నిర్ధేశించడమే కాకుండా మరణానికి కూడా కారణం అవుతున్నాయి. కొన్ని రకాల రుగ్మతలు అనగా (కీళ్ళ, నరాల, ఊపిరితిత్తుల, గుండె సంభందిత, క్యాన్సర్ ఇంకా స్థూలకాయం, మొదలైనవి). అయితే మన శరీరం పై ప్రభావం చూపే ఈ రుగ్మతలకు అందుబాటులోకి వచ్చిన వైద్యవిధానం, ఆధునిక చికిత్స చేయించడంతో పాటు నొప్పిని తగ్గించడం, కండరాల కదలిక కోసం వ్యాయామం అనేది చాలా అవసరం. ఈ రుగ్మతల వల్ల నిరాశగా ఉన్న రోగులు తిరిగి లేచి ఎవరి మీద ఆధారపడకుండా వారి పనులు వాళ్లు స్వయంగా చేసుకొనే విధంగా ఎలాంటి వ్యాయామం చేయాలన్న అవగాహన చాలా మందిలో ఉండదు. వీలైనంతవరకు అవిటితనాన్ని తగ్గించడానికి మళ్లి వారి జీవన విధానంలో నూతన ఉత్సాహం తీసుకురావడానికి ఫిజియోథెరపి చికిత్స చేయించడం అత్యవసరం. ఫిజియోథెరపి చికిత్స చేయించుకోవడం వల్ల 70 నుంచి 80 శాతం వరకు రోగులు ఎవరి సహాయం లేకుండానే, ఇతరులపై ఆధారపడకుండానే సొంతంగా నడవగలుతారు. పైన పేర్కొన్న రుగ్మతలలో సర్జరీకి ముందు మరియు సర్జరీకి తరువాత వారిని పూర్వస్థితికి తీసుకురావడానికి ఎంతో దోహదపడే ఫిజియోథెరపి గురించి వివరంగా తెలుసుకుందాం!

ఫిజియోథెరపి ఆవశ్యకత మరియు ముఖ్య ఉద్దేశ్యం:

ఫిజియోథెరపి అనగా, ఒక శారీరక చికిత్స అంతేగాని మందులతో కూడిన చికిత్స కాదు. ఫియోథెరపి లో నొప్పి నివారణకు విద్యుత్‌ పరికరాలతో పాటు కండరాలు, కీళ్లు, నరాల సామర్థ్యం ఎక్సర్సైజుల ద్వార పెంపొందిచడానికి తోడ్పడుతుంది. శస్త్రచికిత్స అనంతరం రోగి జీవన విధానం మెరుగు పరచడంలో ఫిజియోథెరపి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎలాగంటే రోగికి తన పనులు స్వంతంగా చేసుకునే విధంగా ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

అయితే ఈ వ్యాసం లో ఫిజియోథెరపి వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం:

కీళ్ళ శస్త్రచికిత్స అనంతర౦ ఫిజియోథెరపి ప్రాముఖ్యత:

మొత్తం తొంటి లేదా మోకాలు మార్పిడి (Total hip or knee replacement) శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపి, రోగి కోలుకోవడానికి ఎలా సహాయ పడుతుందంటే:

 • వివిధ వ్యాయామాలు మరియు ఇతర పద్ధతుల (విద్యుత్ పరికరాల) ద్వారా నొప్పి తగ్గిస్తుంది.
 • ఎక్సర్సైజేస్ ద్వార కీళ్ళ మరియు కండరాల సామర్ధ్యం పెంచడానికి.
 • శరీర సమతుల్యత మరియు సమన్వయం మెరుగుపరచడానికి శిక్షణ ఇవ్వడం.
 • నడక విశ్లేషణ మరియు నడిచేసమయంలోసంభవించేఇబ్బందులుఅధిగమించిసరియైన పోస్చర్‌లోనడవడానికి దోహదపడుతుంది.
 • శస్త్రచికిత్స తర్వాత నొప్పి నివారణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు. ఫిజియోథెరపి ద్వారా శస్త్రచికిత్స తర్వాత తొంటి లేదా మోకాలుతో ఎలా కూర్చువాలో, ఎలా నిలబడాలో మరియు అంతేకాకుండా భవిష్యత్తులో ఏవైనా ప్రమాదాలు రాకుండా ఉండేందుకు సూచనలు ఇస్తారు.

నరాల వ్యాధులలో ఫిజియోథెరపి ప్రాముఖ్యత:

రోగి కదలలేని స్థితికి తెచ్చే వివిధ రుగ్మతలు అనగా పక్షవాతం, మెదడు గాయాలు, సెరిబ్రల్ పాల్సి, మల్టిపుల్ స్క్లేరోసిస్, గ్విలైన్-బార్ సిండ్రోమ్, పార్కిన్సన్ వ్యాధి, మరియు వెన్నుపాము గాయాల వల్ల స్వాధీనం తప్పిన కండరాలను, నరాలను తిరిగి పూర్వస్థితికి తీసుకువచ్చేలా ఫిజియోథెరపి ఉపయోగపడుతుంది.

ఫిజియోథెరపి, పక్షవాతరోగి లో చేతులు, కాళ్ళ కదలికలను మరియు శరీర సంతులనాన్ని మెరుగుపరుస్తుంది.

 • గెయిట్‌ (gait training) ట్రెయినింగ్‌ ద్వార రోగి నడకలో వచ్చిన మార్పులు, నడిచే సమయంలో సంభవించే ఇబ్బందులు అధిగమించి సరియైన భంగిమలో నడవడానికి దోహద పడుతుంది.
 • ఎక్సర్‌సైజ్‌ల ద్వార నడిచే క్రమంలో మోకాళ్లు, తుంటి (జాయింట్స్‌), కీళ్లలో పటుత్వం పెంపొందించడం.
 • ఫిజియోథెరపి న్యూరో రిహాబిలిటేషన్‌ చికిత్సలో ప్యాసివ్‌ జాయింట్‌ రేంజ్‌ ఆఫ్‌ మోషన్‌ ఎక్సర్‌సైజ్‌ మరియు ఆక్టివ్ జాయింట్‌ రేంజ్‌ ఆఫ్‌ మోషన్‌ ఎక్సర్‌సైజ్‌ లు చేతుల, కాళ్ళ కీళ్లను మరియు కండరాలు బిగుతుగా మారకుండా వాటి కదలిక సామాన్యంగా ఉండేలా చేస్తారు.

గుండె సంబంధ శస్త్ర చికిత్సల తర్వాత ఫిజియోథెరపి ప్రాముఖ్యత:

ఫిజియోథెరపి గుండెకు సంబందిచిన చాలా రకాల రుగ్మతలలో శస్త్రచికిత్స అనంతరం ఉపశమన పద్ధతులు, శ్వాస వ్యాయామాలు, మరియు క్రమక్రమంగా కాళ్ళ మరియు ఛాతి యొక్క కండరాలు బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. గుండె సంభంద వ్యాదులలో ఊపిరితిత్తుల సమస్యలు కూడా తలెత్తుతాయి. కనుక మీ ఫిజియోథెరపిస్ట్ క్రమబద్ధమైన ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయిస్తారు. దీని వల్ల మీ గుండె రేటు మరియు రక్తపోటు తగ్గుతుంది. ఫిజియోథెరపి గుండెకు సంభంది౦చిన శస్త్రచికిత్సల తర్వాత రక్తాన్ని సిరాలలో గడ్డ కట్టడాన్ని అరికట్టి రక్తప్రసరణ పెంచుతుంది.

క్యాన్సర్ లో ఫిజియోథెరపి ప్రాముఖ్యత:

క్యాన్సర్ చికిత్స మూడు పద్ధతుల్లో జరుగుతుంది. సర్జరీ, కీమోథెరపి, రేడియేషన్ థెరపి. చాలా సందర్భాల్లో రెండు లేదా మూడు పద్ధతుల్లో చికిత్స అవసరమవుతుంది. ఈ చికిత్సల తర్వాత చాలా మంది రోగులు బలహీనతతో అనగా రోజువారి పనులు చేసుకోవడం, నడవడం, ఇతర నొప్పులతో  బాధపడుతుంటారు. ఫీజియోథెరపి ద్వార అనేక వ్యాయామాలు మీ కీళ్ళ మరియు కండరాల సామర్ధ్యాన్ని పెంచడమే కాకుండా మీ రోజువారి పనులను చేసుకోవడం సులభతరం చేస్తుంది. ఫిజియోథెరపి, భవిష్యత్తు లో ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.

శ్వాశకోశ వ్యాదులలో ఫిజియోథెరపి ప్రాముఖ్యత:

శ్వాశకోశ వ్యాదులలో ఫిజియోథెరపి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చాలా మందికి శస్త్రచికిత్స తర్వాత శ్వాస వ్యాయామాలు, శ్వాసక్రియ మెరుగుపరచడానికి తోడ్పడుతాయి. శ్వాశకోశ వ్యాదులలో ఫిజియోతెరఫీ ముఖ్య లక్ష్యాలు ఏంటంటే:

 • వ్యాయామంలో శరీర సామర్ధ్యం మెరుగుపరచడం.
 • రోజువారి పనులు మరియు శారీర సామర్థ్యం మెరుగుపరచడానికి.
 • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని తగ్గించడానికి.
 • ఛాతి/గుండె కుహరపు నొప్పి తగ్గించేందుకు
 • శ్వాశక్రియలో దోహద పడే కండరాల సామర్ధ్యాన్ని పెంచడానికి.

బారియాట్రిక్ శస్త్రచికిత్స అనంతర౦ ఫిజియోథెరపి ప్రాముఖ్యత

బారియాట్రిక్ శస్త్రచికిత్స తరువాత ఫిజియోథెరపి ఇతర ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి తోడ్పడుతుందని అనేక ఆధారాలు సూచించాయి. విజయవంతమైన బారియాట్రిక్ శస్త్రచికిత్స తర్వాత, రోగి క్రమం తప్పకుండా వారి జీవితంలో పాటించవలసినవి:

 1. ఫిజియోథెరపి క్రింది ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి:
 2. ఆరోగ్యకరమైన బరువు కొనసాగించటానికి ఒక సముచితమైన బారియాట్రిక్ ఆహార ప్రణాళిక అనుసరిస్తారు.
 • ఆయుర్దాయం పెంచడానికి
 • పొత్తికడుపులో క్రొవ్వు తగ్గించడానికి
 • కండరాలు, ఎముకలు, మరియు ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచడానికి 
 • మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి మరియు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి
 • ఇన్సులిన్ నియంత్రణ మెరుగుపరచడానికి
 • గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి
 • రక్తపోటును తగ్గించడానికి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *