Knee Replacement Cost in Telugu

మోకాళ్ల మార్పిడి ఖర్చు – భారతదేశం లో ఎంత అవుతుంది, వాటి వివరాలు

గత దశాబ్ద కాలంగా మోకాలి భాగంలో తుది దశలో ఉన్న కీళ్ళనొప్పులకు మోకాలి మార్పిడి సర్జరీ అనేది  ప్రముఖమైనదిగా మరియు  సురక్షితమైనదిగా  ఎంచుకోబడుతోంది.

ఇతర చికిత్సా పద్ధతుల ద్వారా ఉపశమనం పొందని మరియు మోకాలినొప్పి అధికం అయిన పక్షంలో మోకాలి మార్పిడి శాస్త్ర చికిత్సా పద్దతి మీకు ఒక నొప్పి లేని మరియు చురుకైన జీవితాన్ని అందించడానికి సహాయపడుతుంది. అయితే, కొన్నిసార్లు మోకాళ్ల మార్పిడి ప్రక్రియకి అయ్యే ఖర్చు అధికం అనే భయంతో రోగులు ఈ శస్త్రచికిత్సని చేయించుకోవడానికి ఆలోచించడం జరుగుతుంది.

మోకాళ్ల మార్పిడి ఖర్చు  అనేది డాక్టర్ ఫీజు, ఆసుపత్రి ఖర్చులు మరియు ఇంప్లాంట్ ఎంపిక వంటి అంశాలపై ఆదారపడి ఉంటుంది.

డాక్టర్ ఒక మోకాలి (ఏకపక్ష) మార్పిడి లేదా రెండు మోకాళ్ల మార్పిడి (ద్వైపాక్షిక మోకాల మార్పిడి)ని  సూచించవచ్చు. ద్వైపాక్షిక మోకాలి మార్పిడి సర్జరీ ఒకే సిట్టింగ్ లో చేయవచ్చు (ఏకకాలంలో) లేదా పేషెంట్ యొక్క ఆరోగ్యం మరియు జాయింట్ల పరిస్థితి ఆధారంగా దశలవారిగా చేయవచ్చు.

దశలవారీ విధానంలో రెండు మోకాళ్ల మార్పిడిని కొన్ని నెలల వ్యవధిలో రెండు ప్రత్యేక శస్త్రచికిత్సలుగా నిర్వహిస్తారు.

ఇటువంటి విధానాలకు, పేషెంట్ రెండు సార్లు ఆసుపత్రిలో ఉండవలసి వస్తుంది మరియు ప్రతీ శస్త్రచికిత్స తర్వాత, యథా స్థితికి చేరుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మోకాలి మార్పిడి ప్రక్రియకి అవసరమయ్యే మొత్తం ఖర్చు  సహజంగా పెరిగే అవకాశం ఉంది.

పేషెంట్, ఆపరేషన్ కి  ముందు మరియు ఆపరేషన్ తర్వాత అయ్యే ఖర్చు, మందులు మరియు ఫిజియోథెరపి లకు, కలిపి మొత్తం అయ్యే ఖర్చుల యొక్క పూర్తి సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.

మోకాల మార్పిడికి అయ్యే ఖర్చు పేషెంట్ ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందువలన, మొత్తం మోకాల మార్పిడికి అయ్యే వివిధ ఖర్చులు యొక్క అంచనా ముందుగానే కలిగి ఉండడం మంచిది.

ఈ వ్యాసం లో, మొత్తం మోకాల మార్పిడికి (ఏకపక్ష మరియు ద్వైపాక్షిక మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు) దాదాపుగా అయ్యే ఖర్చు వివరాలను చూడవచ్చు.

ఈ సమాచారం ఒక మార్గదర్శి వలె ఉపయోగపడగలదని గమనించండి. అసలు ఖర్చులో రోగి పరిస్థితి బట్టి తేడా ఉండవచ్చు.

మోకాళ్ల మార్పిడి కి అయ్యే ఖర్చు వివరాలు

1.     మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కి ముందు అయ్యే ఖర్చు

మోకాల మార్పిడి శస్త్రచికిత్స అనేది ఇతర ప్రధాన శస్త్రచికిత్స ల వంటిదే. శస్త్రచికిత్స లో సఫలీకృతం అవడానికి అన్ని అవసరమైన జాగ్రత్తలూ తీసుకోవడం చాలా అవసరం. మోకాలి మార్పిడి కోసం క్రింద ఇచ్చిన ప్రీ-ఆపరేటివ్ ఇన్వెస్టిగేషన్స్ (శస్త్రచికిత్స కు ముందు చేసే కొన్ని పరీక్షలు) సాధారణంగా చేయించుకోవాలి.

 • శారీరక పరిక్ష (ఫిసికల్ ఎక్సామినేషన్)
 • రక్త పరీక్ష (టోటల్ బ్లడ్ కౌంట్)
 • కోఅగ్యులేషణ్ టెస్ట్ (రక్తం గడ్డ కట్టడాన్ని అంచనా వేసేందుకు చేసే పరీక్ష)
 • బ్లడ్ షుగర్ టెస్ట్ (రక్తంలోని చెక్కెర పరీక్ష)
 • మూత్ర పరీక్ష
 • ఎక్స్-రే (X-Ray)
 • ఎం ఆర్ ఐ (MRI)
 • లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT)
 • గుండె లయ పరీక్ష (ECG లేదా EKG) హార్ట్ రిథం టెస్ట్
 • మూత్రపిండాలు మరియు ఎలక్ట్రోలైట్ యొక్క బేస్లైన్ జీవక్రియ విశ్లేషణ (బేస్లైన్ మెటబలిక్ అనాలిసిస్ ఆఫ్ కిడ్నీ అండ్ ఎలేక్ట్రోలైట్ స్టేటస్)
 • BMD టెస్ట్ – బోన్ మినరల్ డెన్సిటీ (కొన్ని కేసెస్ లో)

కొన్ని కేసెస్ లో కొన్ని పరీక్షలు చేయడం తప్పనిసరి కాదు. కొంతమంది పేషంట్లకి వాళ్ళ మెడికల్ హిస్టరీని బట్టి కొన్ని టెస్ట్ లు చేయించవలసి ఉంటుంది. సుమారుగా ఆపరేషన్ ముందు చేయించుకునే టెస్ట్ లకు 6,000  నుండి 15,000 రూపాయలు వరకు ఖర్చు అవుతుంది.

డెంటల్ ఇవాల్యేషన్

దంతాలలో(పంటి) ఇంఫెక్షన్ కారణంగా, బ్యాక్టీరియా దంతాలు మరియు చిగుళ్ళు నుండి మీ రక్తప్రవాహంలో వ్యాపించి శస్త్రచికిత్స తరువాత వచ్చే ఇన్ఫెక్షన్ లను నివారించాలంటే శస్త్రచికిత్సకు (సర్జరీ) ముందే దంతాలకు చికిత్స చేయించుకోవడం అవసరం. ఈ చికిత్స పెద్ద ఆసుపత్రిలో కాకుండా దంత వైద్యుల క్లినిక్ లో చేయించుకోవడం వలన ఖర్చు తగ్గే అవకాశం ఉంది.

ఆపరేషన్ కి ముందు వాడే మందులకు అయ్యే ఖర్చు

సర్జరీ కి ముందు మీ ప్రిస్క్రిప్షన్ మందులు సర్దుబాటు చేసుకోవలసిన అవసరం ఉండవచ్చు. మీ సర్జన్, సర్జరీ కి ముందు యాన్టికోఅగ్యులేన్ట్స్ మరియు యాంటీబయాటిక్స్ లాంటి కొన్ని మందులను సూచిస్తారు. దీనివలన సర్జరీ సజావుగా చేయవచ్చు.

2.    మోకాళ్ల మార్పిడి సర్జరీ కి అయ్యే ఖర్చు

 • సర్జన్ యొక్క ఫీజు
 • అనస్థీషియాలాజిస్ట్ యొక్క ఫీజు
 • అసిస్టెంట్ యొక్క ఫీజు
 • ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు
 • ఇంప్లాంట్ ధర
 • సర్జరీకి వినియోగించిన వాటికి అయ్యే ఖర్చు
 • అనస్థీషియా కోసం వాడే మందులు
 • రక్త మార్పిడి (అవసరం ఉన్నట్లయితే)

3.    మోకాళ్ల మార్పిడి సర్జరీ తరువాత అయ్యే ఖర్చు

శస్త్రచికిత్స తర్వాత, 4 నుండి 5 రోజులు అదనంగా ఆసుపత్రిలో యథాస్థితికి (పునరావాస) వచ్చేవరకు ఉండాల్సి ఒస్తుంది. ఈ సమయం లో శిక్షణ పొందిన ఫిజియోథెరపిస్టు సమక్షంలో మొకాలలో కదలికలు చేయించడం మరియు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి  మందులు ఇవ్వడం జరుగుతుంది.

ఈ దశలో అయ్యే ఖర్చులు:

 • నొప్పి ఉపశమనం కోసం వాడే మందులకు అయ్యే ఖర్చు.
 • ఫిజియోథెరపి, ఇతర వైద్య సౌకర్యం ఖర్చులు.
 • వినియోగితాలు (డ్రెస్సింగ్) మరియు క్లచ్ ల ఖర్చు.
 • సర్జరీ తర్వాత పేషంట్ మరియు తోడుగా ఉన్నవాళ్ళ కోసం ఆసుపత్రిలో ఉండడానికి అయ్యే ఛార్జీలు.

మోకాళ్ల మార్పిడి అయ్యే ఖర్చుల్లో భేదాలు

చాలామంది పేషంట్లు మోకాలి మార్పిడి శస్త్రచికిత్స కోసం అయ్యే ఖర్చులు వివిధ ఆసుపత్రుల్లో ఖర్చుకి సంబందించిన భేధాలు ఉండడం గమనిస్తారు. సగటున రోగి అదే విధానాన్ని విస్తృతంగా వివిధ ధరలలో చూసి అయోమయానికి గురి అవ్వడం జరుగుతుంది; కానీ సాధారణంగా, ఈ వ్యత్యాసాలకు నిజమైన కారణాలు ఉన్నాయి.

1.     డాక్టర్ నైపుణ్యం

 • డాక్టర్ తన నైపుణ్యం మరియు నేర్పు ప్రకారం ఫీజు తీసుకుంటారు. అనుభవం మరియు ప్రఖ్యాత గాంచిన డాక్టర్ అత్యంత లాభపడతారు. వైద్య పరిశోధనల ప్రకారం సగటున ఒక సంవత్సరంలో కనీసం 50 TKR ( టోటల్ నీ రిప్లేస్మెంట్ ) మొత్తం మోకాళ్ల మార్పిడి నిర్వహించే నేర్పు ఉన్న శస్త్రవైద్యుడు, ఒక మోకాల మార్పిడి చేసినప్పుడు అతని కాంప్లికేషన్ రేటు కేవలం మూడోవంతు అని నిరూపించబడింది.
 • అనేక రోగులకు పట్టణంలో ఎక్కువ డబ్బు తీసుకునే అత్యంత ప్రముఖ నిపుణుడి దగ్గర చేయించుకోవడం కష్టం. ఒక రోగి అటువంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యగలరు? తక్కువ ఫీజులు తీసుకునే శస్త్రవైద్యుడిని ఎంపిక చేసుకోవచ్చు. సమానమైన అర్హత మరియు అనుభవం ఉన్న స్పెషలిస్ట్ అయ్యుండి  తక్కువ ఫీజు తీసుకునే వైద్యుడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
 • ఎక్కువ పేషంట్లు వచ్చే వైద్యుడిని సందర్శించడం వలన అతను లేదా ఆమె మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక బిజీగా ఉండవచ్చు. అప్పుడు పేషంట్, వైద్యుని అసిస్టెంట్ ను సంప్రదించాల్సి వస్తుంది. అటువంటి సందర్భాలలో రోగులు శస్త్రచికిత్స చేసే డాక్టర్ని నమ్మడానికి ఆలోచిస్తారు. ఇంకా, ఈ వైద్యులు అతని పేషంట్లకు తగినంత సమయం కేటాయించలేరు. కొన్ని సందర్భాల్లో వారి జూనియర్ వైద్యులు ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. జూనియర్ డాక్టర్లు ఎల్లప్పుడూ నిపుణుల పర్యవేక్షణలో శస్త్ర చికిత్సలు చేసినప్పడికీ అనేక మంది రోగులు అనుభవం ఉన్న శస్త్రవైద్యుడి చేత చేయించుకోవడానికి ఇష్టపడతారు.
 • తగిన అనుభవం మరియు నైపుణ్యం ఉన్న శస్త్రవైద్యుడిని పేషంట్ ఎంచుకోవచ్చు. కాకపోతే ప్రసిద్ధి గాంచిన శస్త్రవైద్యుడితో పోలిస్తే తక్కువ పేషంట్లు వచ్చే ఒక నిపుణుడిని ఎంచుకోవచ్చు. అక్కడ ఎక్కువ దృష్టిని పొందడమే కాకుండా తక్కువ ఫీజు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ సర్జన్ అన్ని సంబంధిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సమయం కేటాయించడంతో, రోగులు శస్త్రచికిత్స చేయించుకోవడానికి తక్కువ ఆందోళన పడడమే కాకుండా మరింత నమ్మకంగా ఉంటారు.

2.    ఇంప్లాంట్ ఎంపిక

 • టెక్నాలజీ: సర్జరీ కి అయ్యే ఖర్చు ఇంప్లాంట్ ఎంపిక అనేదానీపై కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, హై-ఫ్లెక్స్ మోకాలి ఇంప్లాంట్ (జిమ్మర్) ఎంచుకున్నట్లయితే, పి.ఎఫ్.సి (Depuy Synthes-J & J)తో పోలిస్తే  హై-ఫ్లెక్స్ మోకాలి ఇంప్లాంట్ ఖర్చు కనీసం 30,000 రూపాయలు పెరుగుతుంది. ఒక పి.ఎఫ్.సి ఇంప్లాంట్ మోకాలిని 110 డిగ్రీల వరకు వంచుటకు అనుమతిస్తుంది, ఇది యువకులు రొటీన్ గా చేసుకునే పనులకు సరిపోతుంది.
 • ప్రస్తుతం, మరింత ఆధునికమైనవి అందుబాటులో ఉన్నాయి; ఉదాహరణకు కస్టమ్ 3-D ఫిట్టేడ్ ఇంప్లాంట్లు. చివరకు, సర్జరీ తర్వాత పేషంట్ యొక్క జీవనశైలి అనేది ఇంప్లాంట్ ని ఎంచుకోవడం లో కీలక పాత్ర పోషిస్తుంది.
 • భారతదేశం లో ఉపయోగించే కొన్ని మోకాలి ఇంప్లాంట్లు:
 • మెటీరియల్: మోకాలి ఇంప్లాంట్లు తయారీకి వాడే మేటీరియల్ ఆధారంగా మారుతుంటాయి. స్మిత్ & నేఫ్యు కంపెనీ యొక్క ఆగ్సీనియం (oxinium) ఇంప్లాంట్లు మంచి దీర్ఘాయువు కలిగి ఉండడమే కాకుండా ఇతర ప్రత్యామ్నాయాల కన్నా అధిక ధర ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా ఉపయోగించే ఇతర ఇంప్లాంట్లు కోబాల్ట్ క్రోమియం ఇంప్లాంట్లు. దశాబ్దాల నుండి శస్త్రవైద్యులు విజయవంతంగా కోబాల్ట్ క్రోమియం ఇంప్లాంట్లు విజయవంతంగా ఉపయోగించారు. వాటికి అయ్యే ఖర్చు ఆగ్సీనియం (oxinium) ఇంప్లాంట్ల కంటే తక్కువ.
 • తయారీదారు: మీరు సంప్రదించే డాక్టర్ ఒక నిర్దిష్ట తయారీదారి నుండి ఇంప్లాంట్లు ఖరీదు చేసి ఉపయోగించడం జరుగుతుంది. దీనివలన ఏ ఇంప్లాంట్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేదాన్ని విచారించడానికి సహాయపడుతుంది. చాలా మంది పేషంట్లు స్ట్రైకర్, జిమ్మెర్, స్మిత్ & నేఫ్యు, Depuy (జాన్సన్ అండ్ జాన్సన్), మరియు Biomet వంటి అంతర్జాతీయ సంస్థలు నుండి ఇంప్లాంట్లను  ఎంచుకుంటారు. పేషంట్లకు దిగుమతి ప్రత్యామ్నాయాలతో పాటు తక్కువ ఖరీదైన భారత తయారీదారులు చేసే ఇంప్లాంట్ల గురించి తెలియజేయాలి. భారతదేశం లో తయారుచేయబడే ఇంప్లాంట్ల ధర 60,000 రూపాయలు అయితే దిగుమతి చేసుకున్న ఇంప్లాంట్ల ధర 80,000 నుండి 2,00,000 రూపాయలు ఉంటుంది. భారతదేశం లో తయారుచేయబడిన ఇంప్లాంట్లు  ఐదు నుండి తొమ్మిది సంవత్సరాల మన్నిక మాత్రమే ఉండడంతో వాటిని వైద్యులు ఉపయోగించడానికి నిరాకరిస్తున్నారు. భారతదేశం లో తయారు చేయబడే ఇంప్లాంట్లు వాడడం వలన ఎన్ని రోజులు పనిచేయగలవు అనే భరోసా డాక్టర్లు ఇవ్వలేక పోతున్నారు.
  • మోకాలి ఇంప్లాంట్లను తయారుచేసే భారతీయ సంస్థలు:
   • ఎవల్యుటిస్ ఇండియ ప్రైవేట్ లిమిటెడ్
   • ఐనార్ మెడికల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్
   • మాక్స్ మెడికల్ లిమిటెడ్

3.    ఇన్-పేషంట్ సేవలు

సర్జన్ యొక్క రుసుము మరియు ఇంప్లాంట్ ఖర్చు కాకుండా, గణనీయమైన సంఖ్యలో అదనపు ఖర్చులు ఉండవచ్చు. ఆసుపత్రిలో బెడ్ ఖర్చు మరియు నర్స్ లేదా సహాయకులకు (షేర్డ్ లేదా పూర్తి సమయం) అయ్యే ఖర్చు కూడా ఉంటుంది. బడ్జెట్ పై ఆధారపడి, కావలసిన సేవలు అందించే ఒక ఆసుపత్రిని  ఎంచుకోవడం మంచిది.

4.    ఆకస్మిక ఖర్చులు

కొన్ని ఆకస్మిక ఖర్చులు ఉండవచ్చు. శస్త్రచికిత్స అనంతరం వచ్చే సమస్యలకు (కామ్ప్లికేషన్) ఆసుపత్రిలో అనుకున్న దానికన్నా ఎక్కువరోజులు ఉండవలసి రావడం లేదా ఐ.సి.యు లో అడ్మిట్ అవ్వడం వలన ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతర సర్జరీ ల లాగే, మోకాల మార్పిడి సర్జరీ తర్వాత సమస్యలు(కామ్ప్లికేషన్) వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు పోస్ట్ సర్జికల్ ఇంఫెక్షన్, పల్మనరీ ఎంబాలిజం, డీప్ వెయిన్ త్రోంబోసిస్ (DVT) మరియు ఆలస్యంగా గాయం మానడం (డిలేడ్ వూండ్ హీలింగ్) వంటి సమస్యలు సర్జరీ తర్వాత వచ్చినట్లయితే వాటికి తక్షణ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దానికి అదనపు ఖర్చు అవుతుంది. కొన్ని సందర్భాల్లో రక్త మార్పిడి అవసరం కావచ్చు, దానికీ  అదనంగా ఖర్చు అవుతుంది. శస్త్రచికిత్స సమయంలో  పేషంట్ కి జెనెరల్ అనస్థీషియా ఉపయోగించారా లేదా రీజనల్ అనస్థీషియా (స్పైనల్,  ఎపిడ్యూరల్) ఉపయోగించారా  అనేదానిపైన ఖర్చు ఎంత అవుతుంది అనేది ఆధారపడి ఉంటుంది.

5.    హాస్పిటల్ టైప్

ఆసుపత్రి ఎంపిక అనేది మొత్తం అయ్యే ఖర్చు నిర్ణయించటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కార్పొరేట్ ఆసుపత్రులలో ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే సర్జన్ మరో ఆసుపత్రిలో తక్కువ ధరకి ఆపరేషన్ నిర్వహించవచ్చు. ఆపరేషన్ థియేటర్ యొక్క నాణ్యత, మంచి వ్యాధి నియంత్రణ పద్ధతులు ఉపయోగించడం వలన మోకాల మార్పిడి సర్జరీ తర్వాత ఏర్పడే అత్యంత భయంకరమైన సమస్యలను తగ్గించే అవకాశం ఉంది.

ఉదాహరణకు ముంబై వంటి నగరాల్లో అధిక పన్నుల కారణంగా, సర్జికల్ చికిత్సల ఖర్చుఎక్కువ ఉంటుంది. అయితే, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో వైద్యులు తక్కువ ఖర్చులో ఇవే చికిత్సలు అందిస్తారు.

మోకాల మార్పిడి ఖర్చులు ప్రభుత్వం మరియు స్వచ్ఛంద ఆసుపత్రులలో చాలా తక్కువ. తక్కువ ఆదాయం గల కుటుంబాలు ఇటువంటి శస్త్రచికిత్సలకు ఈ సంస్థలను సంప్రధించడం మంచిది.

పోస్ట్ – సర్జరీ ఫిజియోథెరపీ

రికవరీ కాలం అనేది ఒక్కో పేషంట్లలో ఒక్కోలా  ఉంటుంది. పోస్ట్ సర్జరీ ఫిజియోథెరపీ అనేది ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది  ఆరు నుండి పన్నెండు వారాల వరకు ఉంటుంది. సగటున ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ సెషన్స్ ఇచ్చే వాళ్ళు దాదాపు 8,000 నుండి 15,000 వరకు ఫీజుగా తీసుకుంటారు. పేషంట్ సర్జరీ తర్వాత అన్నీ పనులు చేసుకోవడానికి కాళ్ళలో కదలికలు సాధారణంగా రావడం చాలా ముఖ్యం కావున ఫిజియోథెరపీ తీసుకోవడం చాలా అవసరం.

సర్జన్ దగ్గరికి ఫాలో – అప్ విజిట్

సర్జరీ తర్వాత ఫాలో అప్ తప్పనిసరి. కోలుకుంటున్న దశలో వారానికి ఒకసారి తరువాత నెలకి ఒకసారి తరువాత ౩ నెలలకి ఒకసారి తరువాత సంవత్సరానికి ఒకసారి సర్జన్ కి చుపించుకోవాల్సి ఉంటుంది. సర్జన్స్ ఫాలో అప్స్ సమయంలో ఎక్స్రేలు లేదా CT స్కాన్లు వంటి పరీక్షలు చేయించుకోమని సూచించవచ్చు; వాటికి అయ్యే అదనపు ఖర్చుని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కొంతమంది సర్జన్లు ఫాలో అప్ సెషన్స్ కోసం ఫీజు తీసుకుంటారు.

ఆదాయ నష్టం

సర్జరీ చేయించుకోవడానికి మరియు తరువాత కోలుకోవడానికి కొన్ని రోజులు  మీరు పని చేసే దగ్గర సెలవు పెట్టవలసి వస్తుంది, దానికి మీరు నెలసరి ఆదాయం కోల్పోతారు, దానివలన ఆర్థిక భారం పెరుగుతుంది. దీనికి పరిష్కారం డిసెబిలిటి భీమా వంటి సౌకర్యాలు అందించాగలరేమో మీరు మీ యజమానిని అడగండి. డిసెబిలిటి భీమా అనగా గాయం లేదా వైకల్యం వల్ల బాధపడుతున్న ఉద్యోగులకు పాక్షిక చెల్లింపు విధానం. మీరు ఇంటి నుండి పని చేయగలిగే వృత్తికి చెందినవారైతే, మీరు ఇంట్లో ఒక వర్క్ స్టేషన్ ని  ఇన్స్టాల్ చేయించుకోవచ్చు.

భారతదేశంలో మోకాళ్ల మార్పిడి కి అయ్యే ఖర్చు

మోకాలు భర్తీ ప్రీ-OP మరియు పోస్ట్- OP ఖర్చుల గురుంచి తెలుసుకున్న తరువాత. మీరు బహుశా ఒక ప్రశ్న అడగవచ్చు – శస్త్రచికిత్స (సర్జరీ) కి ఖర్చు ఎంత అవుతుంది?

క్రింద పేర్కొన్న మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సకు సుమారుగా అయ్యే ఖర్చులను గమనించండి.

సర్జరీ (శస్త్రచికిత్స)ఖర్చు పరిమితి (హాస్పిటల్ చార్జీలతో కలిపి)
సింగిల్ మోకాలి మార్పిడి2.0 – 3.2 లక్షలు
ద్వైపాక్షిక మోకాలి మార్పిడి – సింగిల్ సిట్టింగ్3.5 – 6.0 లక్షలు
ద్వైపాక్షిక మోకాలి మార్పిడి – స్టేజడ్4.0 – 6.4 లక్షలు
 •  మూలం: ఇండస్ట్రీ డేటా, పేషంట్ సర్వేస్.
 • ప్రైవేట్ ఆసుపత్రులలో (ప్రభుత్వం మరియు స్వచ్ఛంద ఆసుపత్రుల మినహ) అయ్యే ఖర్చు అంచనా.
 • ఇందులో సర్జరీ తరువాత వచ్చే అవలక్షణాల (కాంప్లికేషన్స్) చికిత్సకి వెచ్చించే ఖర్చులు చేర్చలేదు.
 • వాస్తవ ఖర్చు డాక్టర్, ఆసుపత్రి, మరియు ఏ నగరాన్ని ఎంచుకున్నారు అనేదానిపైన ఆధారపడి ఉంటుంది.
 • ఆపరేషన్ తర్వాత వాడే మందులకు మరియు ఫిజియోథెరపీకి అయ్యే ఖర్చు ఇందులోనే ఉంటుంది.

మోకాళ్ల మార్పిడి కి అయ్యే ఖర్చుని ఎలా తగ్గించవచ్చు?

ఉదాహరణకు, ఒక పేషంట్ సర్జరీ కి అయ్యే ఖర్చు భరించలేకపోవచ్చు కానీ నాణ్యతమైన సర్జరీ మరియు మంచి ఫలితం ఉండాలని కోరుకోవచ్చు. అది ఎలా కుదురుతుంది అని ఆలోచించవచ్చు. ఈ క్రింద పేర్కొన్న విషయాలు పరిశీలించండి.

1.      ఎక్కువ ఫీజు తీసుకోని ఒక మంచి డాక్టరు గురించి కనుక్కోండి?

మీ నగరం లో ఒక స్పెషలిస్ట్ తో పోలిస్తే అదే అర్హత మరియు అనుభవం ఉండి తక్కువ డబ్బు తీసుకునే వైద్యులను  గుర్తించడానికి చాలా మార్గాలు ఉన్నాయి.

2.      సరైన ఇంప్లాంట్ ని ఎంచుకోండి

సర్జరీ తరువాత మీ జీవనశైలి అవసరాలను విశ్లేషించండి.  సాధారణ భౌతిక కార్యకలాపాలు (నడవడం)  చేసుకోవడానికి వస్తే చాలు అనేదానికి అధిక డిగ్రీ వశ్యతను అందించే ఎక్కువ ఖర్చు చేసే ఇంప్లాంట్ అవసరమా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీరు నిజంగా సాధారణ ఇంప్లాంట్ కాకుండా 25 సంవత్సరాల మన్నిక ఇచ్చే ఎక్కువ ఖర్చుగల ఇంప్లాంట్ ని పెట్టిన్చుకోవాలా అని  మీ వైద్యుడిని ప్రశ్నించండి?

3.      ఏ ఖర్చులు తగ్గించుకోవచ్చో అంచనా వేసి వాటిని తగ్గించండి

మీకు ఒక ప్రైవేట్ గది మరియు పూర్తి సమయం కేటాయించే నర్స్ కావాలనుకుంటున్నారా? మీరు ఐదు నక్షత్రాల హోటళ్లలో లాగ లగ్జరీ సేవలు అందించే ఆసుపత్రిలో కాకుండా ఒక మంచి నిపుణుడు (డాక్టర్) దగ్గర మీ చికిత్స చేయించుకోవడం మంచిదని భావిస్తారా?

4.      శస్త్రచికిత్స (సర్జరీ) కోసం సిద్ధం అవ్వండి

మీరు శారీరకంగా మరియు మానసికంగా, సర్జరీ చేయించుకోవడానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. దీనికి ఉపయోగపడే  కొన్ని చిట్కాలు: ప్రీ-ఆపరేటివ్ ఫిజియోథెరపీ చేయించుకోవడంలో నిమగ్నం అవ్వండి;  సమతుల్య ఆహారం తీసుకొండి;  మీరు డయాబెటిక్ (షుగర్ వ్యాధి) అయినట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవ్వడానికి డాక్టర్ ఇచ్చిన మందులు వాడండి; మరియు ధూమపానం అలవాటు ఉంటె మానివేయండి.

5.      ప్రభుత్వం పథకాలు ద్వారా కవరేజ్

మోకాళ్ల మార్పిడి కి అయ్యే ఖర్చు ప్రభుత్వ పథకాలు ద్వారా చెల్లించవచ్చు. ఈ పధకాలు ఒక రాష్ట్రానికి మరియు ఇతర రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాలలో మోకాళ్ల మార్పిడి కి అయ్యే ఖర్చు పూర్తిగా  లేదా సగం ప్రభుత్వం భరిస్తుంది, కొన్ని రాష్ట్రాలలో ఈ పధకాలు లేవు. అడ్వాన్స్డ్ స్టేజ్ ఆర్థరైటిస్ ఉన్న పేషంట్ నడవలేకపోవడం అనేది ఆ పేషంట్ వికలాంగుడు అయ్యేందుకు దారి తీస్తుంది. కావున ప్రభుత్వ పధకాలు ఈ సర్జరీ కి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించేలా చేయడం వలన తక్కువ ఆదాయం గల కుటుంబాలు ఈ సర్జరీ చేయించుకోవడానికి ముందుకి వస్తారు. భారతదేశంలో తక్కువ ఆదాయం గల కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకాలను  అందిస్తుంది. అయితే, వాటిలో చాలావరకు  సంవత్సరానికి 30,000 నుండి 40,000 రూపాయిలు ఖర్చు అయ్యే  వైద్య సేవలను మాత్రమే అందిస్తున్నాయి.

6.      ఆరోగ్య బీమా

మీకు ఇప్పటికే మెడికల్ ఇన్సురన్స్ కలిగి ఉన్నట్లయితే మీకు శుభవార్త. భారతదేశం లో మెడికల్ ఇన్సురన్స్ కంపెనీలు ఇప్పుడు మోకాల మార్పిడీకి కవరేజ్ (భీమా పాలసీ వల్ల లభించే భద్రతా పరిమితి) ని అందిస్తుంది. ముఖ్యంగా కీళ్ళనొప్పులు మరియు ఆస్టియోపొరోసిస్ వ్యాధి వంటి ప్రమాదకరమైన పరిస్థితుల కేసుల్లో సర్జరీ కి 2 నుండి 3 సంవత్సరాల ముందు పాలసీ ప్రారంభమైనట్లయితేనే క్లెయిమ్ చేయడానికి అనుమతిస్తారు.

పేషంట్ ముందుగానే వారి సర్జన్ తో మాట్లాడి అన్నీ అవసరమైన పత్రాలు తీసుకోవడం మంచిది. వైద్య బీమా(మెడికల్ ఇన్సురెన్స్)  కంపెనీ యొక్క అధికార ధ్రువీకరణ పత్రం మీ శస్త్రచికిత్స షెడ్యూల్ అవ్వక ముందు తీసుకోవడం చాలా అవసరం.

సర్జరీకి ఎంత పరిహారం చెల్లిస్తారు అనేది తెలుసుకోవడం మంచిది. మొత్తం ఇవ్వకపోయినా, చికిత్సకు అయ్యే ఖర్చు కొంతమేరకు భరిస్తుంది.

ముగింపు

మోకాళ్ల మార్పిడి ఖర్చు ఎక్కువ అనే ఆలోచన మిమ్మల్ని నొప్పిలేని మరియు చురుకైన జీవితం అనుభవించడాన్ని ఆపుతుంది అని అనుకున్నట్లయితే  కొంత ప్రయత్నం చేసి నాణ్యత మరియు సంరక్షణకు రాజీ లేని ఒక సరైన చికిత్సను ఎంచుకోండి.

మరింత సమాచారం కోసం, [email protected] కి మెయిల్ చేయండి లేదా +91-9640378378 కి  WhatsApp లో మెస్సేజ్ పంపించండి.

knee replacement cost details in Telugu,  knee replacement surgery cost in Telugu, knee replacement in Telugu, knee replacement surgery cost in India – Telugu

Have a question?

Feel free to ask us for any help or information here!

Reviews

మోకాళ్ల మార్పిడి ఖర్చు - భారతదేశం లో ఎంత అవుతుంది, వాటి వివరాలు
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *