Knee Replacement Surgery benefits

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స-నొప్పి నివారణకు ఎలా తోడ్పడుతుంది?

మోకాలి మార్పిడి అనేది ఒక శస్త్ర చికిత్సా పద్ధతి. దెబ్బతిన్న మోకాలి భాగాన్ని తొలగించి, ఆ భాగంలో కృత్రిమ ఇంప్లాంట్ అమర్చడం జరుగుతుంది. సాధారణంగా మోకాలు లోని తోడ ఎముక క్రింది చివరి భాగం మరియు కాలి ఎముక పై చివరి భాగం మార్పిడి చేయడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి మోకాలి చిప్ప మార్పిడి ఉండవచ్చు. ఇందులో విభిన్న పద్ధతులు ఉంటాయి. కనుక రోగి మరియు వైద్యుడు చర్చించుకున్న తరువాత సరైన నిర్ధారణకి రావడం జరుగుతుంది. ఈ శస్త్ర చికిత్సా విధానం సంక్లిష్టమైనది, కావున దీనిని అనుభవజ్ఞుడు మరియు మిపుణత గల వైద్యుడు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

రోగి నొప్పి, వాపు వల్ల చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని తరుణంలో వైద్యులు సాదారంగా మోకాలి మార్పిడి చికిత్సను సూచించడం జరుగుతుంది. కొన్నిసార్లు నొప్పి చాలా అధికంగా ఉండవచ్చు. నిద్రలో మరియు విశ్రామ సమయంలో కూడా నొప్పి ఉండవచ్చు. అటువంటి దశలో నొప్పిని వేరే ఇతర నివారణ పద్ధతులు లేదా బరువు తగ్గడం ద్వారా అదుపు చేయడం క్లిష్టతరం అవుతుంది. అటువంటి దశలోనే మోకాలి మార్పిడి సూచించడం జరుగుతుంది.

మోకాలు మార్పిడి శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులు:

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స సాధారణంగా 50 సంవత్సరాలు పైబడ్డ వారికి సిఫార్సు చేయడం జరుగుతుంది. ఎక్కువగా, ఈ శస్త్రచికిత్స ఆస్టియో ఆర్థరైటిస్ తో భాదపడుతున్న వారికి ప్రధానంగా సూచించడం జరుగుతుంది. మరికొన్ని ఇతర మోకాలి సమస్యలతో భాదపడుతున్నవారికి కూడా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవలసిందిగా వైద్యుడు సలహా ఇవ్వడం జరుగుతుంది.

ఉదాహరణకు:

 • రుమటాయిడ్ ఆర్థరైటిస్
 • సోరియాటిక్ ఆర్థరైటిస్
 • రక్తనాళాల నెక్రోసిస్
 • ఎముక అసహజత (ఎముక పెరుగుదలకి సంబంధించిన వ్యాధులు)
 • హీమోఫిలియా (గాయము వద్ద రక్తము ఆగకుండా ఉండే వ్యాధి)
 • క్రిస్టల్ డిపాజిషన్
 • లిగమెంట్ దెబ్బతినడం లేదా ఏదైనా ఇంఫెక్షన్ కలగడం వలన ఆస్టియో ఆర్థరైటిస్ కలిగే సందర్భాలలో

శస్త్రచికిత్సకు ముందు:

మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు ముందు, చికిత్స వల్ల కలిగే లాభ నష్టాల గురించి వివరంగా వైద్యునితో చర్చించాలి. కొన్ని సందర్భాలలో ఒకటికి రెండు సార్లు అలోచించి సరైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.

అలాంటి కొన్ని సందర్భాలు:

ఇతర ఆరోగ్య సమస్యలు: మీకు గుండె జబ్బు, ఊపిరి తిత్తుల సమస్య, మధుమేహం, కాలెయ సమస్య, లేక రక్త సంభందమైన రుగ్మతలతో భాద పడుతున్నా, మీ వైద్యునికి తెలియజేయండి. ఎందుకంటె ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు ఎటువంటి శస్త్ర చికిత్సలో అయినా దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది. నయం చేయలేని కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు ముందుగానే వైద్యునికి తెలియచేయడం వలన, వైద్యుడు సందర్భానుసారంగా  శస్త్రచికిత్సను మరియు చికిత్సానంతర పునరావాస ప్రణాళికను రోగి పరిస్థితికి అనుగుణంగా ప్లాన్ చేయగలుగుతాడు.

ధూమపానం: ధూమపానం వలన అనేక శస్త్రచికిత్స పద్దతులలో, చాలా సందర్భాలలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుందని అనేక పరిశోధనలలో నిర్ధారణ అయ్యింది. కావున ధూమపానం అలవాటు ఉన్నవారు శస్త్రచికిత్సకు వీలైనంత ముందుగానే అలవాటు మానుకోవడం అత్యంత శ్రేయస్కరం.

ఇన్ఫెక్షన్: దంత సంభంధమైన లేదా వేరే ఏ ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నట్లయితే ముందుగ దానిని నయం చేయడానికి చికిత్స చేయించుకోవలసి ఉంటుంది. శరీరంలో వేరే ఏ భాగంలో అయినా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే అది మోకాలి మార్పిడి తరువాత, అక్కడ కూడా సోకే అవకాశం ఉంటుంది.

నిర్ధారణ: మోకాలి నొప్పికి అన్ని సంధర్భాలలో శస్త్రచికిత్స మాత్రమే పరిష్కారం కాకపోవచ్చు. కొన్ని సార్లు వెన్నునొప్పి, మరియు తొంటి (హిప్) భాగంలో ఆర్థరైటిస్ కూడా కారణం కావచ్చు. కనుక వైద్యునితో అన్నివిషయాలు క్షుణ్ణంగా చర్చించి, మోకాలి మార్పిడి ఎంతవరకు అవసరమో నిర్ధారణకు రావడం మంచిది. శస్త్ర చికిత్సను ఎంచుకునే ముందు మరొక వైద్య నిపుణుడిని (సర్జన్) సెకండ్ ఒపీనియన్ కోసం సంప్రదించడం ఉత్తమం అని చెప్పవచ్చు.

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ప్రయోజనాలు:

పరిశోధన ప్రకారం, మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునే ప్రతి ఐదుగురిలో నలుగురికి వంద శాతం సానుకూల ఫలితం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

మోకాలు మార్పిడి శస్త్రచికిత్స ప్రయోజనాలు:

 • నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
 • మోకాలి కీలు పని తీరు మెరుగు పడడం.
 • జీవన విధాన నాణ్యత పెరగడం.
 • మీరు సులువుగా నడవవచ్చు.
 • సాధారణ కార్యకలాపాలను సులభంగా నిర్వహించవచ్చు.

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స వల్ల ఇతర నష్టాలు కలిగే అవకాశాలు ఏంటి?

వేరే ఏ ఇతర శస్త్రచికిత్స లో లాగానే మోకాలి మార్పిడిలో కూడా కొన్ని నష్టాలు లేదా అపాయాలు ఉండే ఆవకాశం ఉంది. వాటిలో కొన్ని:

శస్త్రచికిత్స అనంతరం మోకాలి భాగంలో ఇన్ఫెక్షన్ మరియు రక్తం గడ్డ కట్టడం వంటివి కలగడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే రక్తపోటు (బి.పి.), మధుమేహం (షుగర్), గుండె సంభంద (కార్డియాక్), లేదా రోగనిరోధక శక్తి (ఇమ్యూన్ సిస్టం) తక్కువగా ఉంటుందో వారిలో ఈ సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కొంతమందికి ఆపరేషన్ తరువాత మోకాలి భాగంలో బలహీనత అనిపించడం మరియు మోకాలును సులువుగా కదిలించలేక పోవడం వంటి సమస్యలు కలగవచ్చు. వీరికి ఫిజియోథెరపీ తో కూడుకున్న వ్యాయామాలు వీలైనంత తొందరగా కోలుకోవడానికి  ఉపయోగపడుతాయి.

మోకాలి మార్పిడిలో ఉపయోగించిన క్రుత్రిమ ఇంప్లాంట్లు 20 సంవత్సరాలు లెదా అంతకన్నా ఎక్కువ సమయం తరువాత పట్టు కోల్పోవడం లెదా వాటిని అమర్చిన స్థానం నుండి ప్రక్కకు జరగడం వంటివే అరుదుగా కలిగే సమస్యలు. అటువంటి సందర్భాలలో రివిజన్ సర్జరీ అవసరమౌతుంది.

Knee Pain in Telugu, Knee Arthritis in Telugu, Knee Replacement in Telugu, Knee Replacement Surgery in Telugu, Knee Implants in Telugu, Conditions for knee replacement surgery in Telugu, Knee Replacement Surgery Benefits in Telugu, Best Doctor for Knee Replacement, Best Hospital For Knee Replacement.

Have a question?

Feel free to ask us for any help or information here!

Leave a Review

How did you find the information presented in this article? Would you like us to add any other information? Help us improve by providing your rating and review comments. Thank you in advance!

Name
Email (Will be kept private)
Rating
Comments
మోకాలి మార్పిడి శస్త్రచికిత్స-నొప్పి నివారణకు ఎలా తోడ్పడుతుంది? Overall rating: ☆☆☆☆☆ 0 based on 0 reviews
5 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *