Wrong Reasons to Avoid Knee Replacement

Knee Surgery – మోకాలి మార్పిడిని వాయిదా వేయడానికి గల 7 కారణాలు

మోకాలి కీళ్ళు, ఆర్థరైటిస్ వ్యాధి లేదా ఏదైనా గాయం కారణంగా తీవ్రంగా దెబ్బతింటునప్పుడు, మోకాలి మార్పిడి (Knee Surgery) మాత్రమే చివరి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మోకాలి మార్పిడి అవసరం అని సలహా ఇవ్వబడ్డ చాలా మంది రోగులు సెకండ్ ఒపీనియన్ కోసం HealthClues ను సంప్రదించడం తరచూ జరుగుతుంటుంది.

చాలా కేసులలో, మోకాలి మార్పిడి కి సంభందించిన రోగులలో అర్థరైటిస్ (కీళ్ళనొప్పులు) అడ్వాన్స్ దశలో ఉంటుంది. వీరికి చిన్నపాటి పనులలో కూడా మోకాలి భాగం అధిక నొప్పికి గురవడం ఉంటుంది. వీరి ఎక్స్-రే మరియు ఇతర మెడికల్ రికార్డులు పరిశీలించినపుడు వీరి మోకాలి కీలుకు విస్తృతమైన నష్టం వాటిల్లినట్లు రుజువైంది. వారు ఇప్పటికే కొంతమంది స్థానిక వైద్యులను సంప్రదించి ఉండవచ్చు. వీరికి వైద్యులు మోకాలు మార్పిడి చేయడం అవసరం అని సూచించి ఉండవచ్చు.

ఏది ఏమైనా ఆపరేషన్ చేయించుకోవడం గురించి ఒక నిర్ణయానికి రావడం అంత సులువు కాదు. సరైన నిర్ణయం తీసుకునే దిశగా రెండవ లేదా మూడవ అభిప్రాయం తీసుకోవడం సరైన పద్ధతి. ఇందులో మొదటి అభిప్రాయ ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలి. మోకాలు మార్పిడి శస్త్రచికిత్సల సక్సస్ రేటు గురించి విశ్వసనీయ సమాచారం లేకపోవడం, శస్త్రచికిత్స ఆలస్యం చేయడం మూలంగా కలిగే దుష్ప్రభావాల గురించి తెలియకపోవడం, శస్త్రచికిత్స తరువాత కలిగే సమస్యల గురించి ఆలోచనల వల్ల ఒక సరైన నిర్ణయానికి రావడం అనేది రోగికి చాల కష్టంగా ఉంటుంది.

HealthClues మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడానికి ప్లాన్ చేసుకునే ముందు బహుళ అభిప్రాయాలను (ఇద్దరు లేదా ముగ్గురు డాక్టర్ లను సంప్రదించడం) తీసుకోవాడానికి చేయూతనివ్వడంలో తోడ్పడుతుంది. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల, మొత్తం ప్రక్రియ గురించి సమాచారం లభించడం మరియు అవగాహన కలగడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. కొంతమంది విషయంలో ఇతర సంప్రదాయ చికిత్స పద్ధతుల ద్వారా నయం అయ్యే అవకాశం ఉన్నపుడు సర్జరీ (శస్త్రచికిత్స) అవసరం లేకపోవచ్చు. కానీ ఇతర చికిత్సా పద్ధతులు ఎంచుకోవడం అనేది, సర్జరీ అత్యవసరమైన వారి విషయంలో అవాంఛిత అసౌకర్యాలను కొనితెచ్చుకున్నట్లుగా అవుతుంది.

తప్పు నిర్ణయాల వల్ల ఆపరేషన్ ను వాయిదా వేయడం, లేదా మానుకునేందుకు దారితీసే కొన్ని కారణాలు:

1.     ఆపరేషన్ భయం:

ఆపరేషన్ అంటే భయం. ఎటువంటి వైద్యపరమైన నిరూపణ లేని విషయాల గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. అయితే, సన్నిహితులతో చర్చించడం లేదా ఆపరేషన్ పట్ల వివరాలు తెలుకోవడం ద్వారా ఇటువంటి భయాలు సులభంగా దూరం అవుతాయి. ఏ ఆపరేషన్ అయిన ఏంతో కొంత రిస్క్ తో కూడుకున్నదై ఉంటుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి సాంకేతికంగా అనేక పురోగతులు చెందాయని చెప్పవచ్చు.

సాంకేతిక అబివృద్ది మూలంగా మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స పద్ధతి కూడా చాలా గణనీయంగా అభివృద్ధి చెందింది. ఉదాహరణకు, శస్త్రచికిత్స అనంతరం 90 రోజుల తరువాత మరణాల సగటు రేటు చాలా అరుదుగా సుమారు 0.01%, అంటే 10,000 మంది రోగులలో ఒకరి విషయంలో అల జరిగే అవకాశం ఉంటుంది.

ఆపరేషన్ చేసిన శరీర భాగం లో ఇన్ఫెక్షన్ కలిగే సందర్భాలు చాలా అరుదుగా ఒక్క శాతం కన్నా తక్కువగా ఉండవచ్చు, అదికూడా మెరుగైన చికిత్స అందివ్వడం ద్వారా నివారించవచ్చు.

వీటిగురించి వైద్యుడితో ముందుగానే వివరంగా చర్చించడం ఉత్తమం. కానీ చాలావరకు రోగులు వైద్యునితో అంత చనువుగా అన్నివిషయాలు చర్చించడానికి సంకోచించడం జరుగుతుంటుంది.  కనుక సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆపరేషన్ అంటే అనవసరమైన భయాలు పడుతుంటారు.

2.     ప్రత్యామ్నాయ చికిత్సలపై ఆధారపడడం

శస్త్రచికిత్స నుండి వీలైనంతవరకు తప్పించుకునే ప్రయత్నంలో చాల మంది పేషెంట్ లు, ఇతర చికిత్సా పద్దతులను ఎంచుకుంటుంటారు. వీటిలో కొన్ని సాంకేతికపరంగా నిరూపణ కాని పద్ధతులు కూడా ఉండవచ్చు. చికిత్సేతర పద్దతుల జాబితా చాలా పెద్దదనే చెప్పవచ్చు. చాలా రకాల హెర్బల్ థెరపీలు, ఆయుర్వేద, హోమియో, స్టెమ్ సెల్ థెరపీ, మరియు ఫిజియోథెరపీ పద్ధతులు కలవు. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నవారి విషయంలో, కొన్ని సందర్భాలలో వీటివల్ల ప్రయోజనం ఉండవచ్చు.

కాని వ్యాధి తీవ్ర రూపం దాల్చినపుడు ఈ పద్ధతులు అంత ఉపయోగకరంగా ఉండవు. కానీ రోగులు ఆపరేషన్ అంటే భయం వల్ల, ఎలాగైనా ఆపరేషన్ లేకుండా నొప్పి నయం కావడానికి వారి పరిస్థితి కి ఉపయోగకరం కాని పద్దతులపై వృధా ఖర్చు చేస్తూ అనవసర ప్రయాసకు గురి అవుతుంటారు.

3.     ఖర్చు గురించి ఆలోచన

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స లో గల వివిధ ఆప్షన్ల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల, ఖర్చు ఎక్కువ అవుతుందని, ఆపరేషన్ వద్దు అనుకోవడానికి గల ప్రధమ కారణంగా చెప్పవచ్చు.

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స కు అయ్యే ఖర్చులు చాలా విషయాల పై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు

  • డాక్టర్, మరియు హాస్పిటల్ బట్టి
  • మీరు సెలెక్ట్ చేసుకొనే ఇంప్లాంట్ బట్టి
  • ఇన్ పేషెంట్ సర్వీసులు – సర్జరీ తరువాత మీరు ఎంచుకున్న హాస్పిటల్ రూం ని బట్టి
  • ఫిజియోథెరపీ కి అయ్యే ఖర్చు బట్టి

మోకాలి ఆపరేషన్ ఖర్చు లో ముఖ్య పాత్ర పోషించేది మీరు ఎంచుకునే ఇంప్లాంట్. డాక్టర్ తో వివరంగా మీకు ఒక ఖరీదైన ఇంప్లాంట్ యొక్క అవసరం ఎంతవరకు ఉంది అన్నది చర్చించి సరైన ఇంప్లాంట్ ను ఎంచుకోవాలి.

4.     కోలుకోవడానికి పట్టె సమయం గురించి ఆందోళన:

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అయిన తరువాత కోలుకోవడానికి సమయం పడుతుంది. ఇక్కడ సమస్య ఏంటంటే పేషెంట్ కు కోలుకోవడానికి పట్టే సమయం మరియు ప్రక్రియ పట్ల సరైన అవగాహన లేకపోవడం. ఇందుకు కారణం డాక్టర్ మరియు పేషెంట్ ల మధ్య కమ్యునికేషన్ గ్యాప్ అని చెప్పవచ్చు.

పేషెంట్ పూర్తిగా కోలుకునేందుకు సుమారు 3-4 నెలల నుండి ఒక సంవత్సరం కూడా పట్టవచ్చు. పేషెంట్ సర్జరీ తరువాత రీహాబిలిటేషన్ అవసరం ఉంటుంది. ఈ కోలుకొనే సమయం లో పేషెంట్ ఫిజియోథెరపిస్ట్ తో ట్రీట్మెంట్ కొనసాగించవలసి ఉంటుంది. ఎందుకంటె ఫిజియోథెరపి చికిత్స కొన్ని వ్యాయామాల ద్వారా మోకాళ్ళ కదలికను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం లో కీలక పాత్ర పోషిస్తుంది.

చాలా మంది రోగులకి సర్జరీ తరువాత ఫిజియోథెరపీ చికిత్స ప్ర్రదాన్యత తెలియకపోవడం మరియు తాము 3 నుండి 4 వారాలలోనే నొప్పి లేకుండా నడవవచ్చు అనుకుంటారు. కాని వాస్తవం అలా ఉండకపోవడం తో నిరుత్సాహ పడడమే కాక మొత్తం ఆపరేషన్ పద్ధతిని తప్పుగా అర్ధం చేసుకోవడం జరుగుతుంది.

ఇలా జరగకుండా ఉండడానికి, పేషెంట్ ఆపరేషన్ కు ముందే డాక్టర్ తో ఆపరేషన్ తరువాత కోలుకోవడానికి పట్టే సమయం గురించి క్షున్నంగా చర్చించాలి.

5.     ఆలస్యం చేయడం వల్ల ఏమీ హాని జరగదు అన్న భావన:

కీల్లనొప్పితో బాధపడుతున్నవారు ఆపరేషన్ వద్దనుకోవడానికి గల ప్రధాన కారణం, ఆపరేషన్ ఆలస్యం చేయడం వల్ల కలిగే నష్టం పట్ల సరైన అవగాహన లేకపోవడం. అలా ఆలస్యం చేయడం కారణంగా ఏమీ హాని జరగదనే భావనలో ఉంటారు. ఆపరేషన్ కు భయపడి అలా నొప్పిని భరిస్తూ ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కొంటూ ఉంటారు. ఏదో ఒక పద్ధతి వల్ల నయం కాకుండా ఉంటుందా అని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆలస్యం చేసే కొద్దీ వారి మోకాలి ఆరోగ్య స్థితి క్షీణించడం వల్ల ఆపరేషన్ సఫలీకృతం అయ్యే అవకాశం కూడా తగ్గినట్లు వైద్య పరిశోధనల్లో నిరూపితమైంది. 1990 మంది రోగులపై నిర్వహించిన ఒక పరిశోధనలో, ప్రీ-ఆపరేటివ్ నిర్ధారణలో ఉన్నత స్థాయికి చేరుకున్న రోగులకు మెరుగైన ఫలితాలు లభించాయని కనుగొనబడింది.

మోకాలి కీలు దెబ్బతినే కొలది, దాని చుట్టూ మృదు కణజాలానికి మరింత నష్టం కలిగిస్తుంది. రోగి యొక్క కదలిక తగ్గినప్పుడు (శారీరకంగా చురుకుగా లేనపుడు), మోకాలి కీలుకు శక్తిని అందించే కండరాలు బలహీనమవుతాయి. శరీరంలోని ఏదైనా కండరాలను తరచుగా ఉపయోగించనప్పుడు, అవి వాటి బలాన్ని కోల్పోవడం జరుగుతుంది.

మోకాలి ఆపరేషన్ చేయించుకునే నిర్ణయం సరైన సమయంలో తీసుకోవలసి ఉంటుంది. రోగి యొక్క కదలిక పూర్తిగా క్షీణించేంతవరకు ఉపేక్షించడం అంత శ్రేయస్కరం కాదు అని చెప్పవచ్చు. అలాంటి కదలలేని స్థితి ఒచ్చిందంటే మోకాలి చుట్టు ఉన్న మృదు కణజాలం కూడా క్షీణించడం మొదలవుతుంది. మృదు కణజాలం కూడా క్షీణించడం వల్ల ఆపరేషన్ తరువాత కోలుకోవడానికి బాగా సమయం పడుతుంది.

6.     ఇంప్లాంట్ మన్నిక ఉండదేమో అన్న ఆలోచన:

కొన్ని కేసులు మినహా, మోకాలి ఇంప్లాంట్లు సాధారణమైన వాడకంతో ఇంచుమించు 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం మన్నుతాయి. వయసు పైబడ్డ ఒక సగటు మనిషి జీవనశైలి బట్టి చూస్తె కృత్రిమ మోకాలి పై ఎక్కువ ఒత్తిడి పడడం అనేది జరగదు. చాలామంది రోగులు ఈ కృత్రిమ మోకాలును తరచూ కొన్ని సంవత్సరాల తరువాత మార్చుకుంటూ ఉండాలేమో అని అపోహతో భయపడుతూ ఉంటారు. చాలా అరుదుగా కొన్ని సందర్భాలలో రివిజన్ సర్జరీ అవసరం పడవచ్చు.

7.     మంచి ఉదాహరణలు లేకపోవడం:

మరొక ప్రధాన కారణం ఆపరేషన్ సక్సెస్ అయిన మంచి ఉదాహరణ రోగులకు అందుబాటులో లేకపోవడం. ఉదాహరణ కు మోకాలి ఆపరేషన్ సఫలం అయి ఆరోగ్యంగా ఉన్న వారు చాలా వరకు తమకు కృత్రిమ మోకాలు ఉన్నట్లు బహిరంగంగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ అదే ఎవరికైనా ఆపరేషన్ విఫలం అవడం వల్ల నష్టం జరిగితే, ఆ వార్త చాల తొందరగా వెలుగులోకి ఒస్తుంది, విమర్శలు ఒస్తాయి, దుష్ప్రచారం కూడా తొందరగా జరుగుతుంది.

ప్రతి రోగికి ఆపరేషన్ అంటే భయం ఉండడం సహజం. కనుక ఇందులో వైద్యుని పాత్ర చాలా ముఖ్యమైనది. వైద్యుడు ఆపరేషన్ కు ముందే పేషెంట్ కు అన్ని విషయాలు క్షుణ్ణంగా వివరించవలసి ఉంటుంది. పేషెంట్ కూడా వైద్యపరంగా ఎటువంటి నిరూపణా లేని అనధికార సమాచారం మీద ఆధారపడకూడదు. వైద్యునితో వారి భయాలను స్పష్టంగా చర్చించాలి. వీలయితే ఆపరేషన్ కి ముందు ఇంకో డాక్టర్ తో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.

knee replacement in telugu, knee replacement doubts in telugu, knee replacement side effects in telugu, reasons to avoid knee surgery, reasons to avoid knee surgery in telugu.

Have a question?

Feel free to ask us for any help or information here!

Leave a Review

How did you find the information presented in this article? Would you like us to add any other information? Help us improve by providing your rating and review comments. Thank you in advance!

Name
Email (Will be kept private)
Rating
Comments
Knee Surgery - మోకాలి మార్పిడిని వాయిదా వేయడానికి గల 7 కారణాలు Overall rating: ☆☆☆☆☆ 0 based on 0 reviews
5 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *