Knee Implants Cost Lowered - Telugu

మోకాలి ఇంప్లాంట్ల ధరలు తగ్గాయి

దీర్ఘకాలిక మోకాలి అర్థరైటిస్ తో బాధపడుతున్న వారికి గత దశాబ్ద కాలంగా మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స ఒక వరంలా మారిందని చెప్పవచ్చు. ఈ శస్త్రచికిత్స చాలా ప్రాచుర్యం చెందిందిగాను మరియు సురక్షితమైన ప్రత్యామ్నాయ చికిత్సగా పరిగనించబడుతోంది. ఇతర ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులు అన్ని విఫలం అయినపుడు మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స పద్ధతి వీరికి నొప్పిరహిత జీవితం కొనసాగించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఈ శస్త్రచికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల చాలా మంది చేయించుకోలేక పోతున్నారు.

భారతదేశంలో, ఇప్పటికీ మోకాలి మార్పిడి ఒక ఖరీదైన శస్త్ర చికిత్స కావడం వల్ల చాలామంది మధ్య తరగతి వారు దీని ఖర్చును భరించలేక వాయిదా వేసుకుంటుంటారు. ఆసుపత్రి ఖర్చు, ఇంప్లాంట్ల ఖర్చు, మరియు ఇతర ఖర్చులను కలుపుకొని సుమారు 1.5 లక్షల నుండి 3 లక్షల దాకా పట్టవచ్చు.

ఇటువంటి వారికి ఒక శుభవార్త ఏంటంటే, మన భారత ప్రభుత్వం గత బుధవారం (2017 ఆగస్టు 16వ తేదీన) నాడు మోకాలి మార్పిడి లో వాడే ఇంప్లాంట్ల ధరలు ప్రస్తుత మార్కెట్ ధరలకంటే గణనీయంగా తగ్గించింది. ప్రభుత్వం యొక్క ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా మోకాలి అర్థరైటిస్ తో బాధపడుతున్నవారికి ఏటా సగటున రూ 1,500 కోట్ల ఖర్చు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.

ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు, మోకాలి మార్పిడి చికిత్సకు అయ్యే ఖర్చులు ఇకపై తగ్గుతాయని ప్రకటించారు.

ఇందులో భాగంగా, National Pharmaceutical Pricing Authority (NPPA), మోకాలి మార్పిడిలో ఎక్కువగా వాడే Chromium Cobalt మోకాలి ఇంప్లాంట్ల ధరను రూ 54,000 లకు తగ్గించింది. మునుపు ఇది రూ 1.58 లక్షల నుండి 2.5 లక్షల వరకు ఉండేది.

భారత దేశంలో, గతంలో ధరలు అధికంగా ఉన్నప్పటికీ, 1, 20,000 ల మోకాలి మార్పిడి చికిత్సలు, మరియు 70,000 ల హిప్ రీప్లేస్మెంట్ (తొంటి శస్త్రచికిత్సలు) జరిగేవి. National Pharmaceutical Pricing Authority (NPPA) యొక్క ప్రాథమిక అంచనా ప్రకారం ఒక పూర్తీ మోకాలి మార్పిడి చికిత్స యొక్క ధర సుమారు రూ 59,091 నుండి రూ 4, 13,059 ల వరకు ఉండేది (హాస్పిటల్, ఆపరేషన్ ధియేటర్, వైద్యుడి ఖర్చు, ఇంకా ఇతర ఖర్చులు కలుపుకొని). ప్రభుత్వం యొక్క తాజా ధర నియంత్రణ వల్ల ఆపరేషన్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది.

మోకాలి మార్పిడి లో అధికంగా వాడే కోబాల్ట్ క్రోమియం (cobalt chromium) ఇంప్లాంట్ల ధర 54,720 కు తగ్గింది. మునుపు వీటి ధర రూ 1, 58,324 ఉండేది. అదే విధంగా టైటానియం (titanium) మరియు ఆక్సిడైజ్డ్ జిర్కోనియం (oxidized zirconium) వంటి కొన్ని స్పెషల్ మెటల్ల ఇంప్లాంట్ల ధరలు సుమారు 70 శాతం, రూ 76,600 ల నుండి రూ 2.50 లక్షల వరకు ఉండవచ్చు. మొదట చేసిన సర్జరీలో వాడిన ఇంప్లాంట్లు అరిగిపోయినప్పుడు చేసే మోకాలి రివిజన్ సర్జరీ విషయంలో ఇంప్లాంట్ల ధరలు సుమారు 59 శాతం వరకు తగ్గాయి. భారత ప్రభుత్వం యొక్క ఈ నిర్ణయం వల్ల చాలా మంది రోగులకు తక్కువ ఖర్చుతోనే మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం కల్పించింది.

మా మెడికల్ రిసెర్చ్ టీం, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గురించి హైదరాబాద్ లోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ Dr. Satish Reddy గారితో చర్చించడం జరిగింది. Dr. Satish Reddy గారు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది రోగులకు మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేస్తుంటారు. వీరు హైదరాబాద్ లో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స లో అధునాతన పద్ధతులు మరియు ఇంప్లాంట్ లను పరిచయం చేసారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లేటెస్ట్ మరియు హై క్వాలిటీ ఇంప్లాంట్లు ప్రతి ఒక్కరికీ అందుబాటు లోకి వచ్చాయని అభిప్రాయ పడ్డారు. ఏదేమైనప్పటికీ కోబాల్ట్-క్రోమియం ఇంప్లాంట్ల ధర మునుపటితో పోలిస్తే కొద్దిశాతం తగ్గింది, అంతే కాక మునుపు కూడా హాస్పిటల్స్ ఇంప్లాంట్ల ధరను MRP కంటే తక్కువగానే ఛార్జ్ చేసేవారు. ఇక్కడ రోగి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం కేవలం ఇంప్లాంట్ల ధరనే తగ్గించింది, కానీ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ను చాలా హాస్పిటల్స్ అన్ని కలిపి ఒక ప్యాకేజి రూపం లో అందివ్వడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ లో ఈ శస్త్రచికిత్స కు ఇచ్చే ప్యాకేజి (సర్జరీ కి అయ్యే ఖర్చు, హాస్పిటల్ ఛార్జ్ లు, మరియు ఇతర ఖర్చులు) ధరలలో పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చు. కానీ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన మోకాలి మార్పిడి అవసరమైన చాలా మంది రోగులు నాణ్యమైన మరియు అధునాతన మోకాలి ఇంప్లాంట్స్ ను ఎంచుకో గలుగుతారు.

Knee implants cost slashed in India, Knee implant costs in Telugu, knee surgery in India, knee implants cost reduced by the Indian government, knee replacement implants, knee replacement cost in India. Implants cost in India, Implants cost in Telugu, knee replacement in Telugu, knee surgery in telugu.

For more information, do get in touch with us through email at [email protected] or message us on WhatsApp at +91-9640378378, or submit your question below.

Have a question?

Contact Us Here!

Reviews

మోకాలి ఇంప్లాంట్ల ధరలు తగ్గాయి
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *