Club Foot

చిన్న పిల్లల్లో కలిగే ఆర్థోపెడిక్ సమస్యలు

తల్లిదండ్రులు నిరంతరం పిల్లల్లోని అనేక లోపాల గురించి ఆందోళన చెందుతుంటారు. వాటిలో కొన్నింటిని తాత్కాలికంగా నిర్లక్ష్యం చేస్తారు. చాలా మంది తల్లిదండ్రుల్లో చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యల పై అవగాహన లేకపోవడం వల్ల వాటిని ఆలస్యంగా గుర్తిస్తారు. చికిత్సలో జాప్యం వల్ల పిల్లలు విలువైన బాల్యాన్ని ఆనందంగా గడపలేకపోతారు. అటువంటి సమస్యలకు సరైన చికిత్స అవసరం అవుతుంది. చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యల గుటించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

పిల్లల్లో సాధారణంగా సంభవించే కొన్ని కీళ్ళ సమస్యలు:

  1. క్లబ్ ఫూట్ (Club Foot):
  • ఇది పుట్టుకతో వచ్చే ఒక వైకల్యం
  • ఇందులో పాదం క్రిందకు వంగి మరియు లోపలి వైపుకు మెలి తిరిగి ఉంటుంది
  • చాలా అరుదుగా కొన్ని సందర్భాలలో పాదం పైకి తిరిగి ఉంటుంది
  • దీనిని వైద్య పరిభాషలో కంజెనైటల్ టాలిపన్ ఈక్వినో వారస్ (సి.టి.ఇ.వి) (congenital talipes equinovarus) CTEV అని అంటారు.
  1. ఫ్లాట్ ఫీట్ (Flat Feet): ఈ వ్యాధి లక్షణాలు చాలామంది పిల్లల్లో కనిపించవు, కానీ కొందరు పిల్లలు క్రింది లక్షణాలను కలిగి ఉంటారు.
  • మీ శిశువు పాదాలు నేలకు మట్టంగా లేదా ఫ్లాట్ గా ఉండటాన్ని ఫ్లాట్ ఫీట్ అంటారు
  • ఈ సమస్య పిల్లల్లో అరికాలి ఆర్చ్ ఏర్పడకపోవడం వల్ల పాదం ఫ్లాట్ గా అనిపిస్తుంది

ఫ్లాట్ ఫీట్ లక్షణాలు:

  • నొప్పి ఉండడం
  • కాలు మరియు పాదాలలో తిమ్మిర్లు ఉండడం
  • కాలి మడమ బయటికి వంగి ఉంటుంది
  • నడకలో మార్పు ఉంటుంది
  • చదును ప్రదేశాలపై నడవడం ఇబ్బందిగా ఉంటుంది, జారే అవకాశం ఎక్కువగా ఉంటుంది
  1. టో వాకింగ్ (Toe Walking):
  • ఈ సమస్య ఉన్నపుడు పిల్లలు మునివేళ్ళపై నడుస్తుంటారు
  • 2 సంవత్సరాల వయసు తరువాత కూడా ఇలాగే నడుస్తూ ఉంటే ఆలస్యం చేయక వెంటనే వైద్యుడిని కలవాలి
  • ఈ సమస్య ముఖ్యంగా కాలి కండరాలు బిగుతుగా మారడం వల్ల కలుగుతుంది
  • ఇది మెదడు పక్షవాతం (cerebral palsy), ఆటిజం (autism) కండరాల బలహీనత (muscular dystrophy) వంటి ఇతర వ్యాధులతో సంబంధం కలిగి ఉంటుంది
  1. ఇన్-టోయింగ్ (Pigeon toes):
  • ఇది శిశువుల్లో కనిపించే అత్యంత సాధారణ సమస్య
  • సాధారణంగా శిశువు పెరుగే కొలదీ ఇది తగ్గిపోతుంది, కానీ కొందరి విషయంలో తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది
  • ఈ స్థితిలో, శిశువు నడుస్తున్నప్పుడు పాదం ముందు భాగం లోపలివైపుకి తిరిగి ఉంటుంది
  • కొంతమంది పిల్లల్లో ఈ సమస్య క్లబ్ ఫూట్ తో కలిపి ఉండవచ్చు
  1. బోలెగ్స్ (Bow legs/Genu varum):
  • మోకాళ్ళు వంగి ఉండడాన్ని లేదా దొడ్డి కాళ్ళని బోలెగ్స్ అంటారు
  • టాడ్లర్స్ (తప్పటడుగులు వేసే వయసు పిల్లలు) లో ఈ సమస్య సాధారణంగా కనిపిస్తుంది
  • శిశువు పెరిగే కొద్దీ నడకలో వెత్యాసం ఉంటుంది
  • 5-6 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి సమస్య తగ్గిపోతుంది
  1. నాక్ నీస్ (Knock knees/Genu valgum):
  • శిశువు నిల్చోని ఉన్నపుడు మోకాళ్ళు ఒకదానితో ఒకటి తాకుతూ ఉండడాన్ని Knock knees లేదా Genu valgum అంటారు
  • ఈ సమస్య 2 లేదా 3 ఏళ్ల వయస్సులో స్పష్టంగా తెలుస్తుంది, కానీ 4 సంవత్సరాల వయస్సులో తీవ్రంగా ఉంటుంది
  • ఈ సమస్యకు కారణం osteomalacia లేదా రికెట్స్ (rickets) వంటి కొన్ని అంతర్లీన ఎముక సంభంధ సమస్యలు కూడా కావచ్చు

Pediatric Orthopedic Diseases in Telugu, Club Foot in Telugu, Flat Feet problem in children in Telugu, Genu varum in Telugu, Genu valgum in Telugu, Knock knees in Telugu, Common childhood orthopedic problems in Telugu.

For more information, do get in touch with us through email at [email protected] or message us on WhatsApp at +91-9640378378, or submit your question below.

Have a question?

Contact Us Here!

Leave a Review

How did you find the information presented in this article? Would you like us to add any other information? Help us improve by providing your rating and review comments. Thank you in advance!

Name
Email (Will be kept private)
Rating
Comments
చిన్న పిల్లల్లో కలిగే ఆర్థోపెడిక్ సమస్యలు Overall rating: ☆☆☆☆☆ 0 based on 0 reviews
5 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *