club foot

క్లబ్ ఫూట్ (Club Foot)

తల్లిదండ్రులు నిరంతరం పిల్లల్లోని అనేక లోపాల గురించి ఆందోళన చెందుతుంటారు. వాటిలో కొన్నింటిని తాత్కాలికంగా నిర్లక్ష్యం చేస్తారు. చాలా మంది తల్లిదండ్రుల్లో చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యల పై అవగాహన లేకపోవడం వల్ల వాటిని ఆలస్యంగా గుర్తిస్తారు. చికిత్సలో జాప్యం వల్ల పిల్లలు విలువైన బాల్యాన్ని ఆనందంగా గడపలేకపోతారు. సాధారణoగా చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యలలో క్లబ్ ఫూట్ (Club Foot) ఒకటి దీనిని వైద్య పరిభాషలో కంజెనైటల్ టాలిపన్ ఈక్వినో వారస్ (సి.టి.ఇ.వి) అని కూడా అంటారు.

క్లబ్ ఫూట్ (Club Foot): ఇది పుట్టుకతో వచ్చే ఆర్థోపెడిక్  సమస్యల్లో ఒక సాధారణ వైకల్యం. ఇందులో శిశువు పాదం క్రిందకు వంగి మరియు లోపలి వైపుకు మెలి తిరిగి ఉండటం లేదా వంకర్లు పోవడాన్ని క్లబ్ ఫూట్ అంటారు. పుట్టుకతో వచ్చే ఈ సమస్యని తొందరగా గుర్తిస్తే సర్జరీతో గాని, సర్జరీ లేకుండా గాని తగ్గించుకోవచ్చు.

ఈ సమస్య ప్రతి 1,000 జననాలలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఇది అమ్మాయిల కన్నా అబ్బాయిలలో ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ లోపం వల్ల తమ పిల్లలు ఇతర పిల్లల్లా నడవలేరని తల్లిదండ్రులు బాధపడుతుంటారు కానీ ఇది పెద్ద సమస్య కాదు. కొన్ని కేసుల్లో సర్జరీ తో మరియు సర్జరీ లేకుండానే క్లబ్ ఫూట్ ని సరిచేయవచ్చు.

ఈ లోపంతో పుట్టిన పిల్లల్లో అఖిలిస్ టెండాన్ (కాలి కండరాలను మరియు మడమని కలిపే కణజాలం) చాలా గట్టిగా ఉంటుంది, మరియు కాలి పిక్క యొక్క కండరాల పరిమాణం సాధారణ స్థాయికన్నా చిన్నవిగా ఉంటాయి. క్లబ్ ఫూట్ ఎముకలు, రక్త నాళాలు, కండరాలు మరియు శిశువు యొక్క పాదంలో స్నాయువులను (టెండాన్స్) ప్రభావితం చేస్తుంది.

క్లబ్ ఫూట్ ఒకటి లేదా కొన్ని సార్లు రెండు కాళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది. రెండు కాళ్ళకు ఉన్నప్పుడు శిశువు పాదాలు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉంటాయి.

క్లబ్ ఫూట్ లక్షణాలు:

  • వ్యాధి ప్రారంభదశలో అంతగా నొప్పి ఉండదు
  • శిశువు పెరిగే కొద్ది చికిత్స చేయకుండా వదిలేస్తే, నొప్పి మరియు నడవడం కష్టరమవుతుంది
  • ప్రభావిత పాదం సామాన్యంగా కాకుండా చిన్నగా ఉంటుంది
  • కాలి పిక్క యొక్క కండరాల పెరుగుదల తగ్గిపోతుంది

క్లబ్ ఫూట్ రావడానికి కారణాలు:

క్లబ్ ఫూట్ ఒక రకమైన పుట్టుకతో వచ్చే రుగ్మత. ఇది రావడానికి ప్రధాన కారణం తెలియదు, అయితే ఇది జన్యుపరమైన కారణాల వల్ల కూడా రావచ్చు. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాలు మెలిపడడం లేదా ఏదైనా ఒత్తిడికి గురి కావడం వల్ల  కూడా క్లబ్ ఫూట్ కలుగుతుందని డాక్టర్లు భావించేవారు.

కొంతమంది వైద్యుల నమ్మకం ప్రకారం గర్భధారణ సమయంలో తల్లి ధూమపానం, మద్యపానo చేసినా లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా పుట్టబోయే బిడ్డకు క్లబ్ ఫూట్ వచ్చే అవకాశం ఉంటుంది.

క్లబ్ ఫూట్ నిర్ధారణ పరీక్షలు:

మీ శిశువుకి క్లబ్ ఫూట్ ఉందొ లేదో తెలుసుకోవడనికి మీ డాక్టర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వార లేదా కాలి x-ray ద్వార నిర్ధారణ చేస్తాడు. కొన్ని సార్లు మీ శిశువు జననానికి ముందే క్లబ్ ఫూట్ ఉందొ-లేదో అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ పరీక్ష ధ్వని తరంగాలను ఉపయోగించి గర్భం లోపల ఉన్న మీ బిడ్డ చిత్రాన్ని కంప్యూటర్ స్క్రీన్ పైన చూయిస్తుంది. గర్భoలో ఉన్న మీ శిశువు జన్మించేంత వరకు క్లబ్ ఫూట్ కి ఎలాంటి చికిత్స చేయలేము కాని పుట్టిన వెంటనే సరైన చికిత్సలతో నయం చేయడానికి ముందుగానే  ప్రణాళిక తయారు చేసుకోవచ్చు.

క్లబ్ ఫూట్ ని సరిచేయడానికి చికిత్సలు:

పుట్టుక తర్వాత వీలైనంత తొందరగా చికిత్స ప్రారంభిస్తే పూర్తిగా నయం చేయడానికి వీలు పడుతుంది. ఎందుకంటే చిన్న పిల్లల్లో ఎముకలు, టెండాన్లు మరియు కీళ్ళు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి కనుక వీటిని సరిచేయడానికి వీలుగా ఉంటుంది. క్లబ్ ఫూట్ యొక్క చికిత్సలు:

కన్జర్వేటివ్ లేదా నాన్ సర్జికల్ చికిత్సా పద్దతులు:

  • డాక్టర్ మీ శిశువు కాలి వంకరను తగ్గించి దాన్ని స్త్రేచ్చింగ్ ద్వారా సరైన పొజిషన్ లో తీసుకురావడానికి ప్రయత్నిస్తారు.
  • స్ట్రాప్స్ ద్వారా కాలిని సరైన పొజిషన్ లో ఉంచడానికి ఉపయోగిస్తారు మరియు బిడ్డకు 2 నెలల వయసు నుండి ప్లాస్టర్ కాస్ట్ (plaster cast) వాడటం జరుగుతుంది.
  • 6 వారాలు ప్లాస్టర్స్ వాడిన తర్వాత, కాలి వంకరను సరిచేయడానికి వాడే బూట్లు, నిద్రపోయేటప్పుడు కాలిని వంకర పోకుండా వాడే స్ప్లిన్ట్స్ ని (spints) వాడటం వల్ల క్లబ్ ఫూట్ లక్షణాలు రిపీట్ కాకుండా చేయవచ్చు.

శస్త్రచికిత్స కింది సందర్భాలలో జరుగుతుంది:

  • కన్జర్వేటివ్ లేదా నాన్ సర్జికల్ చికిత్సా పద్దతుల ద్వారా కూడా సమస్య తగ్గకుంటే లేదా పునఃస్థితికి వచ్చినపుడు.
  • తీవ్రమైన వైకల్యం ఉన్నప్పుడు.
  • నిర్లక్ష్యం చేసిన కేసులలో మరియు దీర్ఘకాలిక వైకల్యం ఉన్నప్పుడు శస్త్రచికిత్స సిఫార్సు చేయబడుతుంది.

Club foot in Telugu, Club Foot in children in Telugu, Orthopedic problems in children in Telugu, Foot pain in Telugu, CTEV in Telugu, Congenital Talipes Equinovarus in Telugu.

Have a question?

Feel free to ask us for any help or information here!

Leave a Review

How did you find the information presented in this article? Would you like us to add any other information? Help us improve by providing your rating and review comments. Thank you in advance!

Name
Email (Will be kept private)
Rating
Comments
క్లబ్ ఫూట్ (Club Foot) Overall rating: ☆☆☆☆☆ 0 based on 0 reviews
5 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *