కీళ్ళ నొప్పి ని నిర్లక్ష్యం చేయరాదు. ఎందుకని?

ఈ రోజులలో కీళ్ళ నొప్పులను నయం చేయడానికి చాలా అధునాతన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. కాని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, చాలామంది తమకు ఉన్న కీళ్ళనొప్పులను, అవి తీవ్ర రూపం దాల్చే దాకా నిర్లక్ష్యం చేస్తూ వస్తుంటారు.

అది తమ వయసు మీద పడడంతో శరీరంలో వచ్చే మార్పులలో భాగంగా భావిస్తుంటారు. అలా ఆలస్యం చేయడం వల్ల చాలా ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయి. సరైన సమయంలో రోగ నిర్థారణ చేయడం ద్వారా ఈ దుస్థితి బారిన పడకుండా ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో, శరీర కండరాలకు (టెన్డాన్ మరియు లిగమెంట్సు) కలిగే గాయాల వల్ల కూడా ఈ నొప్పి ఉండవచు, కానీ ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పుల ప్రధాన కారణం.

ఆర్థరైటిస్ అనేది 100 కంటే ఎక్కువ వేర్వేరు రకాల కలిగిన ఒక సాధారణ పదం! ఆర్థరైటిస్ అన్న పదం గ్రీకు భాషలోని, ఆర్థ(కీలు) మరియు ఐటిస్(వాపు) అన్నరెండు పదాల సమ్మేళనం ద్వారా వచ్చింది. అందుకే దీనిని కీలువాపు వ్యాధి అంటారు. ఆర్థరైటిస్ సాధారణ౦గా మూడు రకాలలో కనిపిస్తుంది. అవి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు గౌట్[1]. వీటిలో ఆస్టియోఆర్థరైటిస్ ప్రధానంగా మోకాలు మరియు తుంటి కీళ్ళపై ప్రభావం చూపే సాధారణ వ్యాధి. ఇది పెరిగే వయసుతో పాటుగా తీవ్ర రూపం దాల్చే ఒక ప్రమాదకరమైన వ్యాధి. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో సుమారు 25% మంది, అంటే ప్రతి నలుగురిలో ఒకరు ఆస్టియోఆర్థరైటిస్ వల్ల కలిగే ఏదో ఒక ఇబ్బందికి లోనవుతున్నట్లు అంచనా.[2,3]

భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే సగటు వయసు పరంగా ఇంకా తొలిదశలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ డేటా నివేదికల ప్రకారం 65 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసు గల వారిలో దాదాపు 49% మందిలో ఆర్థరైటిస్ ఉన్నట్లు, వైద్యుడిని సంప్రదిన్చినపుడు చేసే పరీక్షలలో నిర్దారితమైంది. కనుక భారతదేశపు సగటు వయసు పెరిగేకొలది ఈ వ్యాధి సంభవం కూడా పెరిగే అవకాశం ఉంది.[4]రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబల్యం చాల తక్కువ ఉంటుంది, అంటే ప్రతి 100 మందిలో 1 వ్యక్తికంటే తక్కువ నిష్పత్తిలో ఈ RA సోకే అవకాశం ఉంది. పురుషులకంటే స్త్రీలలో దీని ప్రభావం దాదాపు మూడింతలు ఎక్కువగా ఉంటుంది.

ఆస్టియో ఆర్థరైటిస్ మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ మధ్య తేడాలు:

ఆస్టియో ఆర్థరైటిస్రుమటాయిడ్ ఆర్థరైటిస్
నొప్పి సమయం: ఇందులో నిద్ర నుండి మేల్కోగానే కండరాల నొప్పి మరియు కీళ్ళు పట్టేసినట్టు అంతగా కనిపించదు, కానీ రోజు గడిచే కొద్ది, కీళ్ళ కదలిక కష్టంగా మరియు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.నొప్పి సమయం: ఇందులో నిద్ర నుండి మేల్కోగానే కండరాల నొప్పి మరియు కీళ్ళు పట్టేసినట్టుగా ఉంటుంది. మరియు రోజు గడిచే కొద్ది నొప్పి తీవ్రత తగ్గుతుంది.
లక్షణాలు: ఇందులో కేవలం మీ ఒక వైపు మోకాలు లేదా తొంటి కీళ్ళలో ప్రారంభ దశలో సమస్యలు రావడం గమనించవచ్చు.లక్షణాలు: ఇందులో చాలా సందర్భాల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ శరీరం యొక్క కుడి మరియు ఎడమ, రెండు వైపుల ఉండే కీళ్ళ పై ప్రభావం చూపుతుంది.
పెద్ద కీళ్ళు: ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా పెద్ద  కీళ్ళపై, అంటే మోకాళ్ళు మరియు తొంటి పై ఎక్కువ ప్రభావం చూపుతుంది.చిన్న కీళ్ళు: రుమటాయిడ్ ఆర్థరైటిస్  చిన్న కీళ్ళపై అనగా మెటికలు మొదలగువాటిపై ప్రభావం చూపుతుంది.
ప్రారంభ దశ: ఇది ముఖ్యంగా 40 నుండి 45 సoవత్సరాలు పైబడిన వారిలో ప్రారంభమవుతుంది.ప్రారంభ దశ: ఇది ముఖ్యంగా 30 నుండి 40 సoవత్సరాలు పైబడిన వారిలో ప్రారంభమవుతుంది.
ప్రభావం చూపే శరీర భాగం: ఆస్టియో ఆర్థరైటిస్ లో ప్రభావితమయిన కీళ్ళలోనే నొప్పి ఎక్కువగా ఉంటుంది.ప్రభావం చూపే శరీర భాగం: రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో రోగ లక్షణాలు కీళ్ళ పైనే కాకుండా కళ్ళు పొడిబారడం, కండరాల నొప్పులు, కణుపులు, మొదలగు లక్షణాలు కనిపిస్తాయి.
వ్యాధి రకం: ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. మరియు ఇది కీళ్ళ మృదులాస్థి పై ప్రభావం చూపి కీళ్ళ కదలికను కష్టతరం చేస్తుంది.వ్యాధి రకం: ఇది ఒక స్వయంనిరోధక వ్యాధి. ఇది శరీర కీళ్ళపై కప్పి ఉండే కణజాలం పై దాడి చేస్తుంది.

 ఎందుకని తేలికపాటి కీళ్ళ నొప్పి నిర్లక్ష్యం చేయకూడదు:

ఎవరికైన తమ శరీరంలో ఏవైనా కీళ్ళలో నిరంతరం నొప్పిగా ఉంటె, దీనిని నిర్లక్ష్యం చేసేకొలది వ్యాధి తీవ్రత పెరుగుతూ వెళ్తుంది. కీళ్ళ నిపుణులు లేదా రుమటాలజిస్ట్ ను సంప్రదించడం, తద్వారా కీళ్ళ నొప్పికి గల ప్రధమ కారణం విశ్లేషించడం ముఖ్యం. కీళ్ళనొప్పి కి చాలా కారణాలు ఉండవచ్చు, పైన పేర్కొన్న వ్యాధి వల్ల కాని లేక ప్రమాద వశాత్తు మీ కీళ్ళ టెన్డాన్ లేదా లిగమెంట్ లు గాయపడి ఉండవచ్చు.

ప్రారంభ దశలో రోగనిర్ధారణ మరియు చికిత్స యొక్క ప్రయోజనాలు:

తొలిదశలో గుర్తించడం వల్ల కలిగే ప్రధమ లాభం, సరైన చికిత్స పొందగలుగుతారు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ మరియు ఆర్థరైటిస్ యొక్క అనేక ఇతర రకాల రోగాలు పూర్తిగా నయం చేయగలవి కావు.

అయితే, సరైన చికిత్సతో  మీరు వ్యాధిని చాలావరకు అరికట్టవచ్చు. దీని వల్ల మీరు ఎక్కువ కాలం నొప్పిలేని మరియు క్రియాశీల జీవనాన్ని గడపడానికి అలాగే నొప్పితో కూడిన శస్త్రచికిత్సలు అనగా (కీళ్ళ మార్పిడి మరియు తొంటి మార్పిడి) చేయించుకోవలసిన అవసరాన్ని నివారించేందుకు సహాయపడుతుంది. ఈ రెండు వ్యాధులను అరికట్టడానికి మందులు లేదా ఫిజియోథెరపి వంటి చాలా రకాల కన్జర్వేటివ్ చికిత్స పద్దతులు  అందుబాటులో ఉన్నాయి.

ప్రారంభ దశలో వ్యాధి నిర్ధారణకు అయ్యే ఖర్చు:

మీరు మీ ప్రాంతంలోని ఎముకలు మరియు కీళ్ళ నిపుణులు లేదా రుమటాలజిస్ట్ ను సంప్రదిoచినపపుడు, వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోమని సూచించవచ్చు. ఉదాహరణకు, డాక్టర్ మీరు స్వీయ-రోగనిరోధక (auto-immune disease) రుగ్మతతో బాధపడుతున్నట్టు అనిపిస్తే, కొన్ని రక్త పరీక్షలు ESR, CRP, మరియు RA-factor వంటివి చేయించుకోమని సలహా ఇస్తారు. ఈ పరీక్షలకు అయ్యే ఖర్చు ప్రాంతాలవారీగా మారుతూ ఉంటుంది, కానీ ఈ పరీక్షలకు 1000 నుండి 1200 రూపాయల మధ్య ఖర్చవుతుంది. ఒక వేళ మీ డాక్టర్ మీకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్లు అనిపిస్తే, అప్పుడు ఒక x-ray చేయించుకోమని సిఫార్సు చేస్తాడు. X-Ray లో కీళ్ళ మధ్య రాపిడి/అరుగుదల ఉన్నట్లు మరియు స్పర్స్ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. కొన్నిసార్లు X-Ray ద్వారా కూడా డాక్టర్ కు తగినన్ని వివరాలు వెల్లడి కాకపోవచ్చు. అటువంటప్పుడు, MRI పరీక్ష సిఫార్సు చేస్తారు. MRI ద్వారా మృదులాస్థి మరియు ఇతర కణజాలాల పరిస్థితి క్షుణ్ణంగా పరీక్షించి వ్యాది నిర్ధారణ చేయడానికి సులువుగా ఉంటుంది.

ఒక్కో X-Ray డయాగ్నొస్టిక్ సెంటర్ ను బట్టి ఇంచుమించు 500 లోపే ఖర్చు కావచ్చు. అయితే, MRI ఒక ఖరీదయిన పరీక్ష. ఇది డయాగ్నొస్టిక్ సెంటర్ ని బట్టి 3500 నుండి 7500 రూపాయల వరకు ఉంటుంది.

Have a question?

Feel free to ask us for any help or information here!

 References:

  1. http://www.cdc.gov/arthritis/basics/index.html
  2. http://www.recentscientific.com/sites/default/files/2133.pdf
  3. http://www.japi.org/july2005/U-634.pdf
  4. http://www.cdc.gov/arthritis/data_statistics/arthritis-related-stats.htm
  5. http://www.ncbi.nlm.nih.gov/pubmed/8310203
  6. Photo Credit: http://news.stanford.edu/news/2014/april/images/13763-walking_news.jpg

 

Reviews

కీళ్ళ నొప్పి ని నిర్లక్ష్యం చేయరాదు. ఎందుకని?
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *