రుమటాయిడ్ ఆర్థరైటిస్, గుండెకు ఎలా హాని చేస్తుంది

ఎందుకు మీ గుండెపై కాస్త ఎక్కువ శ్రద్ధ వహించడం అవసరం!

రుమటాయిడ్ ఆర్థరైటిస్ రుగ్మతలతో బాధపడుతున్న పేషంట్లకు దాని ముఖ్య లక్షనాలైన, వాపు, మరియు చేతి వేళ్ల కణుపుల వంటి చిన్న కీళ్ళ నొప్పులు, మొదలైనవ వాటి గురించి బాగా తెలుసు. రుమటాయిడ్ ఆర్ధరైటిస్ ప్రస్తుతం కీళ్ళ (సైనోవయల్ జాయింట్స్) పైనే కాకుండా గుండెకు సంబందించిన సమస్యలకు (Atrial fibrillation – హృదయ స్పందన క్రమం తప్పడం, మరియు స్ట్రోక్) కూడా కారణమవుతుందని అనేక పరిశోధన అధ్యయనాలు చెబుతున్నాయి.

మన శరీరంలో ధమనులు గట్టిపడి, ఇరుకుగా మారడం, గుండెపోటు రావడానికి చాల అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది. Current Neurology and Neuroscience Reports లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, స్ట్రోక్ ప్రమాదం రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగుల్లో అధికంగా ఉన్నట్లు తేలింది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారు, ఈ రోగ లక్షణాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండడం వల్ల, చాలావరకు గుండె సంబధిత రోగాలు సోకే ప్రమాదాన్ని అరికట్టవచ్చు.

ఎలా?

  • సాధరణంగా కీళ్ళ వాపు మరియు నష్టాన్ని తరచూ పరీక్షించుకోవడంతో పాటు, ప్రతి రోజు పల్స్ మరియు రక్తపోటు పర్యవేక్షణ వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులను ప్రారంభ దశల్లో గుర్తించవచ్చు.
  • RA లో అందుబాటులో ఉన్న వివిధ చికిత్సా విధానాలలో, NSAID మందుల ఆధారిత చికిత్స పద్దతి, అధిక రక్తపోటు (hypertension) తో సహసంబంధాన్ని కలిగిఉన్నట్లు గుర్తించారు. మరోవైపు తొలిదశలో DMARDs (biologic మరియు non-biologic) లతో ట్రీట్మెంట్ ద్వారా గుండె సమస్యలు కలిగే అవకాశం చాల తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
  • గుండె దడ మరియు స్ట్రోక్ వ్యాదులు ధూమపానం వల్ల పెరుగుతాయి. RA రోగుళ్ళో ఎవరైతె ధూమపానం చేస్తారో వాళ్ళకు గుండెకు సంభందించిన నష్టాలు రెండింతలు పెరుగుతాయి.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ పై ఇప్పటివరకు చాలా పరిశోధనలు జరిగాయి. ఈ అధ్యయనాల ఆధారంగా వైద్యులు రుమటాయిడ్ ఆర్థరైటిస్  రోగులలో అవగాహన కలిగించడం, మరియు గుండెకు సంబంధించిన ఇబ్బందుల గురించి ఒక అంచనా ప్రణాళికను రూపొందించుకోవడం చాల అవసరం.

ఈ అవగాహన రోగి మరియు వైద్యులకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కలిగే గుండెకు సంబందించిన వ్యాదుల తీవ్రమైన నష్టాలను తగ్గించేందుకు సహాయపడుతుంది.

Sources:

Reviews

ఎందుకు మీ గుండెపై కాస్త ఎక్కువ శ్రద్ధ వహించడం అవసరం!
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *