ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్స విధానాలు

ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కీళ్ళ నొప్పి, మరియు వాతం లక్షణాలు గల ధీర్ఘకాలిక వ్యాధి. ముఖ్యంగా కీలు వద్ద ఉన్న కార్టిలేజ్ కి హాని కలగడం వల్ల, కదలిక సమయం లో కీళ్ళ మధ్య రాపిడి ఎక్కువ జరిగి చాల నొప్పిగా ఉంటుంది.

ఇది మన శరీరంలోని ఏ కీళు పైనైనా ప్రభావం చూపించవచ్చు, ముఖ్యంగా మన శరీర బరువు మోసే తొంటి, మోకాలు, మరియు అరికాలు పై ప్రభావం ఉంటుంది. ఇది 50 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ వలన మోకాలు లో ఉన్న కార్టిలేజ్ నెమ్మదిగా అరుగుదలకు లోనవుతుంది. కార్టిలేజ్ అరిగిపోవడం వలన మోకాలు లో ఎముకల మధ్య దూరం తగ్గి రాపిడి పెరుగి నొప్పిని కలిగిస్తుంది.

సాదారణ చికిత్స పద్దతులు

ఇతర రోగాలకు లాగానే అస్థియో ఆర్థరైటిస్ కూడా, ప్ర్రారంభ దశలో సాదారణ చికిత్స పద్దతుల ద్వారా నయం చేయవచ్చు. రోగి యొక్క కండిషన్ బట్టి డాక్టర్ x-ray, MRI వంటి డయాగ్నొస్టిక్ పరీక్షలు సూచిస్తాడు. డయాగ్నొస్టిక్ రిపోర్ట్ లో రోగ తీవ్రత తెలుస్తుంది. దాని బట్టి ట్రీట్మెంట్ పద్దతిని సజెస్ట్ చేస్తారు.

జీవనశైలిలో మార్పులు

మీ జీవనశైలిలో మార్పులు మీ మోకాలిని రక్షించుకోవడం మరియు కీళ్ళనొప్పులు అదుపు చేసుకోవడానికి తోడ్పడుతాయి.

  • బరువు తగ్గడం ఫలితంగా, మోకాల్లపై ఒత్తిడి మరియు నొప్పి తగ్గుతుంది.
  • మెట్లు ఎక్కడం మరియు నడక తగ్గించడం వల్ల కీళ్ళ నొప్పి తగ్గుతుంది.
  • కీళ్ళ పై తక్కువ ప్రభావం చూపే (స్విమ్మింగ్, సైక్లింగ్) వంటి అలవాట్లు చేసుకోవాలి.

ఫిజియోథెరపి

కొన్ని రకాల ఎక్సర్సైజుల, కీళ్ళ కదలిక పెంచి కండరాల ద్రుడత్వం పెంచడానికి ఉపయోగ పడతాయి. పేషెంట్ కండిషన్ బట్టి సరైన వ్యాయామ పద్దతులు సూచించడం లో, ట్రైనింగ్ పొంది అనుభవం గల నిష్ణాతుడైన ఫిజియోథెరపిస్ట్ చాల అవసరం.

 మోకాలి ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ లో ఫిజియోథెరపీ ముఖ్య లక్ష్యాలు:

  • మోకాలి నొప్పి మరియు వాపు తగ్గించడం.
  • మోకాలి కీలు కదలిక ను సాధార స్ధితికి తేవడం.
  • మోకాలు, తోడ మరియు తోడ వెనుక కండరాలు బలపరచడం.
  • పేషెంట్ లో శరీర క్రింది భాగపు కండరాలు ( పిక్క, నడుము,పొత్తికడుపు ) బలపరచడం.
  • కండరాల పొడవు సాధారణీకరణ.
  • పేషెంట్ లో చురుకుదనం మరియు సంతులనం మెరుగుపరచడం.
  • కదలిక, మరియు నడక మెరుగుపరచడం.

Knee Cap Comfeel

నొప్పి నివారణ మందులు

మోకాలి ఆర్థరైటిస్ చికిత్సలో అనేక రకాల మందులు ఉపయోగపడతాయి. నొప్పి నివారించడంలో ఏ ఔషదమైనా ప్రతి పేషెంట్ పై ఒకే రకమైన ప్రభావం చూపదు. పేషెంట్ కండిషన్, మరియు ఔషదాలకి తన శరీర స్పందనకు అనుగుణంగా  మంచి ఔషదాలు వాడడం చాల ముఖ్యం.

నొప్పి నివారణ లో అనుసరించే పద్దతుల్లో డ్రగ్ థెరపీ ఒకటి. ఇందులో అసిటమినోఫిన్ (acetaminophen), నాన్-స్టిరాయిడల్ యాంటి ఇన్ఫ్లమేటరీ (non-steroidal anti-inflammatory drugs) వంటి నొప్పి నివారణ ఔషదాలు వాడుతారు. వీటిని వైద్యుని సలహా పై వాడడం చాలా మంచిది.

హైలురోనిక్ యాసిడ్ (Hyaluronic acid) మందులు

సాంకేతికంగా ఇవి మందులు కాకపోయినప్పటికి, ఈ పదార్థాలను (Hyaluronic acid) మోకాలి కీళ్లలోకి ఇంజెక్ట్ చేస్తారు. దీని వల్ల కీళ్లలో సహజసిద్దమైన హైలురోనిక్ యాసిడ్ (Hyaluronic acid)  ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన కీళ్ళ లో, హైలురోనిక్ యాసిడ్, కీళ్ళ కదలిక సహజంగా ఉండడానికి తోడ్పడుతుంది.

కార్టికోస్టెరాయిడ్ (Corticosteroid)ఇంజక్షన్

గ్లూకోకార్టికాయిడ్ ఇంజక్షన్లు  ఆర్థరైటిస్ లో నొప్పిని తగ్గించడానికి వాడే మరొక రకమైన ఔషదాలు. మందుల వాడకం తరువాత కూడా ఇంకా కొద్దిపాటి కీళ్ళ నొప్పి కనిపించే వారిలో, వీటిని నొప్పి ఉన్న జాయింట్స్ లో నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఇంజక్షన్స్  కొన్ని రోజుల నుండి 6 నెలల వరకు ఉపశమనాన్ని ఇస్తాయి.

శస్త్రచికిత్స పద్దతులు

ఆర్థరైటిస్ వల్ల మీకు నొప్పి మరియు మున్ముందు వైకల్యం కలిగే సూచనలు ఉంటే మీ వైద్యుడు శస్త్రచికిత్స సిఫారసు చేయవచ్చు. మీరు ఎంచుకొనే  శస్త్రచికిత్స పద్దతి వల్ల మీకు వీలైనంత మేలు జరగాలే కానీ, కీడు జరగ కూడదు. అందుకని మీరు శస్త్రచికిత్స చేయించుకునే ముందు అనుభవజ్ఞులయిన వైద్యులతో వివిధ శస్త్రచికిత్స విధానాలు మరియు దాని వల్ల కలిగే సమస్యల గురించి రెండవ అభిప్రాయం (second opinion) తీసుకోవడం చాలా ఉపయోగపడుతుంది.

ఆర్థ్రోస్కోపి

ఆర్థ్రోస్కోపి పద్దతి లో చిన్న కోత విధించి చాలా సూక్ష్మమైన పరికరాన్ని కీళ్ళ మధ్య లోనికి ప్రవేశ పెట్టి అక్కడ గల సమస్య ను అంచనా వేసి, ఎముక స్పర్స్ తొలగించడం లేదా వాపు మరియు నొప్పికి దారితీసే ఎముకల కఠినమైన అంచులు తొలగించడం జరుగుతుంది. ఇది ఆర్థరైటిస్ చికిత్సా పద్దతుల్లో చాల అరుదైనది. చాలావరకు మోకాలులో ఉండే మెనిస్కస్ (meniscus) అనే భాగంలో పగుళ్ళు ఏర్పడినపుడు ఈ విధానాన్ని అనుసరిస్తారు.

సైనోవెక్టమి (Synovectomy)

ఈ విధానం కీళ్ళ మధ్య గల సైనోవియం (synovium) అనే భాగం వాపుకు గురై భరించలేని నొప్పి, మరియు కీళ్ళ కదలికలకు తీవ్ర ఇబ్బంది కలిగించే సందర్భం ఉన్నపుడు నిర్వహిస్తారు. ఇది కీళ్ళలో సైనోవియల్ భాగాన్ని ప్రభావితం చేసే రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) లో నిర్వహిస్తారు.

కార్టిలేజ్ గ్రాఫ్టింగ్

ఈ విధానంలో రోగి శరీరం లో ఆరోగ్యంగా ఉన్న కార్టిలేజ్ కణజాలాన్ని(cartilage tissue) కొంత తీసి, వ్యాధి ప్రభావితం ఉన్న కీళ్ళ భాగంలో అమర్చడం జరుగుతుంది. ఈ పద్దతి సాధారణంగా తక్కువ వయసు ఉండి కార్టిలేజ్ లో తక్కువ భాగం దెబ్బ తిన్నప్పుడు నిర్వహిస్తారు.

ఆస్టియోటోమి

ఈ విధానం రోగం ఆరంభ దశలో ఉండి, కీలు ఒక వైపున మాత్రమే వ్యాధి ప్రభావం ఉన్నపుడు ఉపయోగపడుతుంది. రోగి యొక్క తోడ మరియు పిక్క ఎముక జాయింట్ ల మధ్య రాపిడి తగ్గించడానికి, వైద్యుడు ఈ రెండు ఎముకలను కాస్త కట్ చేసి రిఫార్మ్ చేయడం జరుగుతుంది.  దీని వల్ల శరీర బరువు నేరుగా ప్రభావిత కీలుపై పడడం తగ్గి, కీలు కదలిక మెరుగుపడి నొప్పినుంది ఉపశమనం కలుగుతుంది.

పాక్షిక మోకాలు మార్పిడి (Partial Knee Replacement)

కేవలం కొంత భాగంలో మాత్రమే ఆస్టియో ఆర్థరైటిస్ ప్రభావం ఉన్నపుడు, ఈ విధానాన్ని అనుసరిస్తారు. క్షీణించిన భాగం మాత్రం సరిచేసి మిగతా భాగాన్ని అలానే ఉంచుతారు.

ROM Knee Brace

ROM Knee Brace

మొత్తం మోకాలు మార్పిడి (Total Knee Replacement)

ఈ విధానాన్ని Total Knee Replacement లేదా నీ ఆర్థ్రోప్లాస్టి (Knee Arthroplasty) అని కూడా అంటారు. ఇది చాల ఆధునిక చికిత్సా విధానం. వ్యాధి తీవ్రత అధికంగా ఉండి నొప్పి అధికంగా ఉన్నవారిలో ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది. చికిత్సా సమయం లో వైద్యులు, వ్యాధి ప్రభావితమైన మోకాలి ఎముకలు మరియు మోకాలి చిప్ప ను కట్ చేసి కృత్రిమ మోకాలును అమరుస్తారు. కృత్రిమ మోకాలు మార్పిడిలో  లోహపు అలాయ్ (metal alloy), ఉన్నత నాణ్యత గల ప్లాస్టిక్, మరియు సిరామిక్ లతో తయారు చేయబడిన ఇంప్లాంట్స్ వాడుతారు.

Photo Credit: www.biodigital.com

Reviews

ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్స విధానాలు
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.

2 thoughts on “ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్స విధానాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *