ఆరోగ్యశ్రీ

ఆరోగ్యశ్రీ మరియు మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స

ఆరోగ్యశ్రీ ఒక గొప్ప ఏకైక ఆరోగ్య భీమా పధకం. ఈ పథకం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోని దారిద్య్రరేఖకు దిగువున ఉన్న (బిపియల్) కుటుంబాలకు నాణ్యమైన వైద్యాన్ని స్పెషాలిటి ఆసుపత్రులలో చికిత్సను అందించడం. ఈ పథకం కింద గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం, క్లోమం, మూత్రపిండాలు, పిల్లలలో పుట్టుకతో వచ్చే అవయవలోపల సంబందిత శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్స (కీమోథెరపి, రేడియోథెరపి, శస్త్రచికిత్సలు), కాలిన గాయాల చికిత్స మరియు అటు పిమ్మట వచ్చే అవయవ కాలిన భాగాల సమస్యలను తగ్గించే శస్త్రచికిత్స, మరియు ఇతర చికిత్సలకు ఈ పధకం  ద్వార ప్రతి కుటుంబానికి రూ. 2 లక్షల మేరకు భీమా కవరేజ్ ఉంది.

భారతదేశ జనాభాలో చాలా శాతం నేడు మోకాళ్ళ ఆస్టియో ఆర్థరైటిస్ మరియు ఇతర  కీళ్ళ వ్యాధులతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి మోకాళ్ళ అర్త్రిటిస్ నొప్పితో బాధపడుతూ, అది ముదిరే దశకు చేరుకున్నప్పుడు కీళ్ళ నొప్పిని మరియు వాటి కదలిక నయంచేయడానికి పరిమిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మోకాలి అర్త్రిటిస్ దీర్ఘకాలిక దశకి చేరితే, పూర్తి లేదా పాక్షిక మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల ద్వార మోకాళ్ళ నొప్పి మరియు కీళ్ళ కదలికల సమస్యలు లేకుండా జీవితాన్ని గడపవచ్చు.

మన దేశంలో వయసు పై బడిన పెద్దలు కీళ్ళ నొప్పులు మరియు నడకలేకపోవడం వంటివి వయసు మీరడం వల్ల వచ్చే మార్పులలో భాగంగా స్వికరించడానికి అలవాటుపడిపోయారు అని చెప్పవచ్చు. మునుపటి రోజుల్లో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కుటుంబంలోని వృద్ధులకు, పెద్దవాళ్ళకు కుటుంబ సభ్యులు అండగా ఉండేవారు. ఆయుర్దాయం ఎక్కువ ఉన్న వారిలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు, ఆ బాధను అనుభవించవలసిన గడువు కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. మరోవైపు మారుతున్న ఆర్థిక స్థితుల మూలంగా పిల్లలు పెద్దవారికి తోడుగా గ్రామాలలో ఉండలేకపోతున్నారు.

ఇక్కడ సమస్య ఏంటంటే మోకాలి మార్పిడి శస్త్రచికిత్స దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న లేదా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఇది చాలా ఖరీదైన ప్రక్రియ. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఆసుపత్రి, ఇంప్లాంట్లు, మరియు ఇతర చికిత్సలు కలిపి 1.8 లక్షల నుండి 2.5 లక్షల వరకూ ఖర్చవుతుంది. మరియు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స (knee replacement) ను ఆరోగ్యశ్రీ పధకంలో వర్తించే శస్త్రచికిత్సలలో చేర్చలేదు. ఒకవేళ ఆరోగ్యశ్రీలో ఈ మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్సను చేర్చి ఉంటే ఆర్థరైటిస్ భాదిత రోగులకు ఇది చాలా ఉపయోగపడేది.

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ను కూడా ఆరోగ్యశ్రీ లో చేర్చాలని, అప్పుడప్పుడు ప్రజలు కోరుతున్నారు. ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చిత్తరంజన్ రనావత్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేసారు, 2011 లోనే మోకాలు మార్పిడి అవసరమైన పేదలకు సబ్సిడీ ద్వారా అందించమని ప్రభుత్వాన్ని కోరారు. మరియు ప్రముఖ డాక్టర్ కె. జె. రెడ్డి, అపోలో హాస్పిటల్స్ చెందిన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ మోకాలు మార్పిడి ప్రక్రియను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు.

వైద్యశాలలు ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండకూడదనేది, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ లో చేర్చకపోవడానికి గల ముఖ్య వాదన. అవసరం లేని రోగులకు కూడా ఈ చికిత్సను సూచించే అవకాశం ఉందని. ఆరోగ్యశ్రీ లో ఉన్న చాలా ఇతర విధానాలకు లాగానే ఈ పద్దతి లో కూడా ప్రభుత్వ నియమిత బృందం ద్వారా నాణ్యతను పరిశీలించడానికి మరియు దుర్వినియోగం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి మార్గం ఉందని చెప్పవచ్చు.

ఈ ప్రక్రియలో మరొక కోణం వైద్య విధానానికి సంబంధించినది. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విధానం కొన్ని సమస్యలతో కూడుకుంది, మరియు మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత రోగి పూర్తిగా కోలుకోవడానికి ఒక సంవత్సరం పట్టవచ్చు. మోకాలి మార్పిడి తరువాత కొన్ని నెలల వరకు రిహాబిలిటేషన్ (ఫిజియోథెరపీ) అవసరం కావచ్చు. గ్రామాల్లో నివసిస్తున్న మరియు తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు చాలా వరకు మంచి ఫిజియోథెరపీ కేంద్రాలు అందుబాటులో లేవు. ఇది కూడా తొందరగా కోలుకోవడానికి దోహదపడని ఒక కారణంగా చెప్పవచ్చు.

మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స ను ఆరోగ్యశ్రీలో చేర్చాలనే అంశం పై ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి, కాని అప్పటి వరకు , పేదవారికి ఏదైన ప్రత్యామ్నాయ మార్గం ఉందా? అదృష్టవశాత్తు, కొన్ని లాభాపేక్షలేని ఆసుపత్రులు, ఆర్గనైజేషన్లు హైదరాబాద్ మరియు ఇతర మెట్రో నగరాల్లో ఉన్నాయి. ఇవి అర్హులయిన పేదవారికి తక్కువ ఖర్చుతో మోకాళ్ళ శస్త్రచికిత్స ను అందిస్తున్నాయి.

Healthclues ద్వారా ఇలాంటి రుగ్మతలతో బాధపడుతున్న రోగులు సహాయం పొందగలిగారు. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా మోకాలు మార్పిడి శస్త్రచికిత్స అవసరం ఉండి, కానీ ఈ ప్రక్రియ యొక్క సాధారణ ఖర్చును  భరించలేని పరిస్థితులు ఉంటే, మా ఇ-మెయిల్ [email protected] లేదా ఫోన్ ద్వారా 9640 378 378 మమ్మల్ని సంప్రదించగలరు.

 

Aarogyasri in telugu, Aarogyasri and knee replacement in telugu.

 

Leave a Review

How did you find the information presented in this article? Would you like us to add any other information? Help us improve by providing your rating and review comments. Thank you in advance!

Name
Email (Will be kept private)
Rating
Comments
ఆరోగ్యశ్రీ మరియు మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స Overall rating: ☆☆☆☆☆ 0 based on 0 reviews
5 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *