Simple ways to protect your joints in Telugu

మీ కీళ్ళు ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి ౩౩ మార్గాలు

వ్యాధిని నయం చేయడం కన్నా నివారించడం ఉత్తమం అని మనందరికీ తెలుసు కానీ నిజానికి మనలో ఎంతమంది దీనిపైన దృష్టి పెడుతున్నారు. కీళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం అనేది మన శ్రేయస్సుకి కీలకం. దీర్ఘకాల నొప్పి వలన మరియు కీళ్ళు పట్టేసినట్లు ఉండడం వలన చలన శక్తి తగ్గిపోతుంది. తద్వారా మన జీవనశైలి క్షీణించటం జరుగుతుంది. క్రమంగా ఇతర ఆరోగ్య సమస్యలు, మరియు నిరాశకు దారితీస్తుంది.

మన శరీరంలోని కదలికలకు వెన్నెముక, మోకాలి కీలు, తుంటి కీలు (హిప్ జాయింట్) ­చాల ముఖ్యమైనవి. వ్యాయామం, సరైన  ఆహారం మరియు ఇతర రక్షణ పద్థతుల ద్వారా కీళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోలేని పక్షంలో దీర్ఘకాలిక నొప్పితో బాధపడతారు. కీళ్ళు అంటే ఎముక మాత్రమే కాకుండా స్నాయుబంధనము, కండరబంధనము మరియు కండరాల వంటి మృదువైన కణజాలాలు కలిగి ఉంటుంది.

కీళ్ళ రక్షణకై కొన్ని సామాన్యమైన పద్ధతులు పాటించవచ్చు.  ఇవి సాధారణంగా రోజూ అభ్యాసం చేయవచ్చు. ఈ మార్గాలను విస్తృతంగా మూడు ప్రధాన అంశాలుగా వర్గీకరించవచ్చు.

మీ కీళ్ళను కదుపుతూ ఉండండి

కదలికల అవసరాన్ని బట్టి  కీళ్ళు శక్తిని పొందడమా లేదా కోల్పోవడమా అనే ఆధారంగా మన శరీరం రూపొందించబడింది.  ప్రత్యేకంగా ఒక కండరాలని నిర్దిష్టంగా సాధారణంగా ఉపయోగించడం వలన అది బలపడడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. అదే సూత్రం మన కీళ్ళ ఆరోగ్యానికి సహాయపడే కండరాలకి  కూడా వర్తిస్తుంది.

 Protect your joints in Telugu - Biking

 1. భౌతికంగా చురుకుగా ఉండండి: వ్యాయామం కీళ్ళ యొక్క చలనశక్తిని పెంచుతుంది. కండరాలను శక్తివంతం చేస్తుంది మరియు వశ్యతను నిర్వహిస్తుంది. వ్యాయామం చేయకపోవడం వలన కీళ్ళ బాగంలోని ఎముకలు మరియు కండరములలో నిరుపయోగ మార్పులు రావచ్చని మరియు కీళ్లలో రక్తం మరియు సైనోవియల్ ద్రవ ప్రసరణ జరగడానికి రొజూ వ్యాయామం చేయడం ముఖ్యమైనదని పరిశోధనలో నిరూపించబడింది.
 2. హైకింగ్ కి వెళ్ళండి: తాజా గాలిలో శ్వాస పీల్చుకోవడమే కాకుండా, హైకింగ్ కండరములు మరియు ఎముకలను బలపరుస్తుంది. మీరు వారాంతాలలో కొంతకాలం హైకింగ్ కి వెళ్లడం వలన ఈ ప్రయోజనాలు కలుగుతాయి.
 3. ఏదైనా జంతువు లేదా పక్షి లాంటివి పెంచుకోండి: మీరు ఇప్పటికే దేన్నైనా పెంచుకున్నట్లయితే మంచిది. పెంపుడు జంతువుతో సమయం గడపడం వలన మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనలో నిరూపించబడింది.  మీరు పెంచుకునే కుక్కతో రోజు కొంతసమయం నడవడం (వాకింగ్) వలన శారీరక కార్యకలాపాలు  పెరుగుతాయి.

కీళ్ళ సంరక్షణ

కీళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కదలికలు అవసరం కాని మితిమీరి వాడడం వలన కలిగే గాయాలు స్వయంగా తనకు తానే చేసుకునట్లు అవుతుంది. కాబట్టి కీళ్ళకు ఎక్కువ శ్రమ అనిపించేటువంటి వ్యాయామాలు, లేదా పనులు నివారించడం మంచిది.

 Protect your joints in Telugu - Avoid heavy weights

 1.  వ్యాయామం మితిమీరి చేయడం మానుకోండి: ప్రతి ఒక్కరూ రొజూ వ్యాయామం చేయమని సిఫార్సు చేస్తారు, కానీ మీ వ్యాయామ నియమావళి సరైనదై ఉండాలి. ఎక్కువగా వ్యాయామం చేయడం లేదా తప్పు పద్ధతులు పాటించడం వలన మీ కీళ్ళ పైన అధిక ఒత్తిడి పడుతుంది; అందుకే ఒక మార్గదర్శి ద్వారా శిక్షణ పొందడం మంచిది.
 2. భారీ బరువులు మోయడం మానుకోండి: ఇటీవల సిక్స్ ప్యాక్ యాబ్స్ సాధించడానికి యువకులలో ఆసక్తి పెరిగింది. అయితే, దానికి వెయిట్ ట్రైనింగ్ తో పాటుగా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం అవసరం అని అందరికీ తెలియకపోవచ్చు. కీళ్ళ పైన అధిక ఒత్తిడి వేసే వ్యాయామాలు చేయడం వలన కీళ్ళ మృదులాస్థి (కార్టిలేజ్) నశిస్తుంది మరియు కీళ్ళ వ్యాధికి దారి తీస్తుంది అని పరిశోధకులు కనుగొన్నారు. కండరములు మరియు ఎముకల పైన అధిక ఒత్తిడి వేయడం వలన ఎముకలు మరియు కీళ్ళు రెండు దెబ్బతింటాయి. ఇతరులను అనుకరించడం కన్నా సరైన వెయిట్ ట్రైనింగ్ పొందండి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి.
 3. బరువుతో కూడిన వ్యాయామాలు నెమ్మదిగా చేయండి: మీరు వ్యాయామశాలకు వెళ్ళడం మొదలు పెట్టాక మొదటి రోజు అత్యోత్సాహంతో అక్కడి వారిని చూసి ఎక్కువ బరువు గల వాటిని ఎత్తడానికి ప్రయత్నించకండి. జాగ్రత్తగా తక్కువ బరువుల తో వ్యాయామం ప్రారంభం చేయండి. ఉత్తమ క్రీడాకారికి తన శరీరం యొక్క పరిమితి తెలుసు. కాబట్టి నెమ్మదిగా బరువుని పెంచుతూ వ్యాయామం చేయడం వలన గాయాలు నివారించవచ్చు.
 4. తక్కువ ప్రభావం గల వ్యాయామాలు ప్రయత్నించండి: వైద్యులు ఎక్కువ ప్రభావం చూపే కిక్ బాక్సింగ్ మరియు స్టెప్ ఏరోబిక్స్ లాంటి వ్యాయామాల కంటే సైక్లింగ్ మరియు ఈత లాంటివి చేయమని సిఫార్సు చేస్తారు ఎందుకంటే మొదటి రకం వయామాలలో ఎముకలకు ప్రమాదం కలిగే అవకాశం ఎక్కువ.
 5. కీల్ల్లను మితిమీరి వాడకం నుండి రక్షించుకోండి: వివిధ వృత్తులను బట్టి వివిధ కీళ్ళ వాడకం అనేది ఆధారపడి ఉంటుంది. కొందరికి తమ వృత్తిలో ఎక్కువ గంటలు కూర్చోని పని చేయాల్సి ఉంటుంది, వారికి వీపు మరియు మెడ కండరాల పైన ఒత్తిడి పడుతుంది. మరి కొందరికి నిలబడి పని చేయాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణకి దుకాణంలో నుంచుని పనిచేసేవారికి మోకాల పైన  ప్రభావం అధికంగా ఉండవచ్చు. మీరు మీ శరీరంలో ఏ భాగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడం వలన మీరు పని చేయు సమయములో  మధ్యమధ్యలో  కొంత విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే  కీళ్ళ ఆయువు పెంచుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
 6. ఆటలాడే సమయంలో రక్షణ కవచాలను వాడండి: కీళ్ళపై అధిక ప్రభావం చూపే క్రీడలు ఆడే సమయంలో నిర్దేశిత రక్షణ కవచాలను ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇవి మున్ముందు పెద్ద ప్రమాదాలు కలగకుడా ఉపయోగపడుతాయి. వివిధ క్రీడల్లో పలు రకాల రక్షణ కవచాలు ఉంటాయి. ఉదాహరణకు క్రీడా పరమైన గాయాలు కలగకుండా హెల్మెట్, పాడ్స్, గార్డ్స్ తల, మెడ, భుజాలు, మోచేతులు, చీలమండలు మొగలగు శరీర భాగాలకు రక్షణగా ఉపయోగపడుతాయి.

మంచి అలవాట్లను పెంచుకోండి

మనం బహుశా ప్రతిరోజూ అరగంట లేదా గంట సమయం వ్యాయామం చేస్తాం కాని మిగతా సమయం ఎం చేస్తున్నాం అనేది కీళ్ళ ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

 Protect your joints in Telugu - Good Posture

 1. మీరు పనిచేయు సమయంలో సరైన భంగిమను పాటించండి: ఈరోజుల్లో అన్ని తరాల వారు కంప్యూటర్ ముందు అతుక్కుపోతున్నారు. మీ వృత్తిలో ఎక్కువ గంటలు మానిటర్ ముందు కూర్చొని పనిచేయాల్సినట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కంప్యూటర్ స్క్రీన్ మీ కళ్ళ తో సమంగా లేదా కొంత క్రిందకు ఉండేలా చూసుకోండి మరియు మీ కళ్ళకి కనీసం 20 నుండి 26 అంగుళాలు దూరం ఉండేలా చుడండి. ఇలా చేయడం వలన మీ తల తటస్థంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా మీ మెడ మరియు నడుము క్రింది భాగంలో అధిక ఒత్తిడిని నివారిస్తుంది.
 2. ఆర్మ్ రెస్ట్ ని వాడండి: మీ చేతులు మీ మోచేతులకు లంబ కోణంలో (90 డిగ్రీలు) సౌకర్యవంతమైన స్థానంలో ఉంచండి, మరియు మీరు టైప్ చేసేటప్పుడు లేదా మౌస్ క్లిక్ చేసేటప్పుడు మీ మణికట్టుని విశ్రాంతి స్థానంలో ఉంచండి. ఇలా చేయడం వలన కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ రాకుండా నిరోధించవచ్చు. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ – మణికట్టు మరియు బొటనవేలిని ఎక్కువగా కదపడం (కీబోర్డు మీద టైపు చేయడం, మౌస్ ని వాడడం, రాకెట్ బాల్ లేదా హ్యాండ్బాల్ వాడడం, కుట్టడం, రాయడం, చిత్రలేఖనం, మరియు కొన్ని సంగీత వాయిద్యాలు వాయించడం) వలన కలిగే స్థితి.
 3. ఫుట్ రెస్ట్ వాడండి: మీ వృత్తిలో ఎక్కువ గంటలు కూర్చొని పని చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే మీ పాదాలు విశ్రాంతి కలిగి ఉండేలా చూసుకోండి. ఫుట్ రెస్ట్ మీ కాళ్ళకు రక్త ప్రసరణ సరిగా అందించే స్థానంలో ఉంచుతుంది,  చీలమండ మరియు పాదాలు అప్పుడప్పుడు కదపడానికి అనుమతిస్తుంది. రక్త ప్రసరణ లోపము  ఉన్న వ్యక్తులు లేదా మధుమేహంతో  బాధపడుతున్న వ్యక్తులు ఫుట్ రెస్ట్ ని వాడడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
 4. విరామం తీసుకోండి: మీరుఎక్కువ సమయం కూర్చొని పని చేయాల్సినట్లయితే ప్రతి 30 నిమిషాలకి చాచడం లేదా నిలబడడం లాంటివి చేయండి. ఇది మీ కీళ్ళు బిగుసుకుపోకుండా  సహాయాపడుతుంది. నిశ్చల (ఎక్కువ సమయం కూర్చొని పనిచేయు వారు) జీవనశైలి కలిగిన వారికి మధుమేహం మరియు గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
 5. సరైన ల్యాప్టాప్ బ్యాగ్ ని వాడండి: ల్యాప్టాప్ బాగ్ ని వెనుక తగిలించుకోవడం వలన భుజం నొప్పికి కారణం కావచ్చు. మీ భుజాలని విశ్రాంతిగా ఉంచేందుకు సరైన పరిమాణంగల ట్రాలీ బ్యాగ్ ని వాడండి.
 6. హై హీల్ పాదరక్షల వాడకాన్ని మానేయండి: తక్కువ ఎత్తుగల (ఒక అంగుళం) పాదరక్షలను ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎక్కువ ఎత్తుగల పాదరక్షలు వాడకం వలన పాదాలు, మోకాళ్లు మరియు వెన్నెముక మీద అనవసరమైన ఒత్తిడి పడడమే కాకుండా కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులచే నిరూపించబడింది.

ఒత్తిడిని  నివారించండి

కీళ్ళను మరియు కండరములను  ఆరోగ్యంగా ఉంచుకోవడానికి భౌతిక వ్యాయామం ఎంత ముఖ్యమో మానసిక ఒత్తిడి నివారించడం కూడా అంతే ముఖ్యం అనేది మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. మానసిక ఒత్తిడి మరియు ఆర్థరైటిస్ వంటి జీవ కణజాల క్షీణత ఆరంభం అయ్యే పరిస్థితులకు మధ్య బలమైన బంధం ఉంది. వెన్నునోప్పికీ ఇంకా ఒత్తిడి, ఆతృత, మరియు సంక్షోభం లాంటి భావోద్వేగ ఆరోగ్య సమస్యలకు ఒకదానికి మరొకటి ముడిపడి ఉంటుంది. మానసిక ఒత్తిడి నియంత్రించడానికి కొన్ని మార్గాలను  క్రింద గమనించగలరు.

 Protect your joints in Telugu - Practice yoga

 1. యోగా: యోగ అనేది కీళ్ళు మరియు కండరముల ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శరీర బరువును ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. థాయ్-చి, యోగా, మరియు పైలేట్స్ లాంటివి సున్నితమైన  వ్యాయామాలు అయినప్పడికీ అవి కండరాలు మరియు కీళ్ళను బలపరుస్తాయి.
 2. నిద్ర: రాత్రిపూట సరైన నిద్ర వలన గాయపడ్డ కండరాలకి ఉపశమనం కలుగుతుంది అందుకే కీళ్ళ ఆరోగ్యానికి నిద్ర చాలా మంచిది. నేటి పోటీ ప్రపంచంలో, ప్రజలు నిద్ర పోవడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడాన్ని దాటేస్తున్నారు. ఇంత సమయం నిద్రకి కేటాయించాలి అనేటువంటి స్థిర నియమాలు లేవు.  నిద్ర సమయం అనేది  వయస్సు, వృత్తి మరియు నిద్ర యొక్క నాణ్యత పై ఆధారపడి మారుతుంటుంది. మంచిగా తగినంత నిద్రపోవడం మన శరీరానికి చాలా అవసరం.
 3. వార్మ్ ప్యాక్స్ తో విశ్రాంతి తీసుకోండి: వార్మ్ ప్యాక్స్ కీళ్ళపై ఉంచడం లేదా వ్యాయామం తర్వాత వేడి నీటి స్నానం చేయడం వలన మీ కండరాలు మరియు కీళ్ళకి విశ్రాంతి కలుగుతుంది.
 4. మర్దన (మసాజ్) చేయించుకోండి: రోజంతా పని చేసిన తర్వాత మర్దన చేయించుకోవడం వలన మీ కండరములలో టెన్షన్ మరియు అలసట తగ్గిపోతుంది. కీళ్ళు మరియు ఎముకల ఆరోగ్యానికి మీకు సరిపడే మర్దన పద్ధతిని ఎంచుకోవడం మంచిది.
 5. స్టాన మార్పిడి: ప్రస్తుతం ఉన్న స్థలాన్ని మార్చినట్లయితే ఒత్తిడి తగ్గే మార్గం ఉంటుంది. సెలవుల్లో వేరే చోట కాలం గడపడం వలన మీకు విశ్రాంతి కలుగుతుంది అంతేకాక అది మీ కీళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

ఆరోగ్యకరమైన మరియు శరీర సౌస్ఠవం కలిగిన జీవితం పొందాడానికి గల రహస్యం, మంచి ఆహారం తీసుకోవడమే.

Protect your joints in Telugu - Add in vegetables

 1. ఆహార నియంత్రణ: మనందరికీ ఆరోగ్యకరమైన ఆహారం తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసు. సమతుల్య ఆహారం కీళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. సమతుల్య ఆహారంలో శరీరానికి కావలిసినంత మోతాదులో తగిన కార్బోహైడ్రేట్, ప్రోటీన్, కొవ్వు, అన్ని విటమిన్లు మరియు ఖనిజాలు ఉండాలి కాని ఏదీ ఎక్కువగా ఉండకూడదు.
 2. కాల్షియం లోపం (డెఫిషియన్సీ) ని నివారించండి: కాల్షియం లోపం, బోలు ఎముకల వ్యాధికి (ఆస్టియోపొరోసిస్) దారితీస్తుంది. బోలు ఎముకల వ్యాధి – ఎముకలు బలహీనంగా తయారై  పెళుసుబారే ఒక వ్యాధి. పాలు, పెరుగు, అత్తి పండ్లు, మరియు సాల్మన్ చేపలు లాంటి ఆహార పదార్ధాలలో కాల్షియం సంవృద్దిగా లభిస్తుంది.

కిడ్నీ లేదా కాలేయ వ్యాధి లేదా పేగు గోడలకు హాని కలిగి ఉన్న వారిలో విటమిన్-డి జీవక్రియకి ఆటంకం ఏర్పడుతుంది.  ఇది వీరిలో ఎముకలు మరియు కీళ్ళ  బలహీనతకి కారణమవుతుంది.

 1. పండ్లు తినండి: సిట్రస్ పండ్లలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. అది కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్) వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది; కీళ్ళవ్యాధి – కీళ్ళ నొప్పి మరియు అరుగుదల పెంచే వ్యాధి. అన్ని పండ్ల రకాలు యాంటి ఆక్సిడెంట్ (అనామ్లజనకాలు) కలిగి ఉంటాయి; అందుకే పండ్లు తినడం వలన శరీరానికి పోషకపదార్థాలు లభిస్తాయి.
 2. చేపని గ్రిల్ పద్ధతిలో వండి తినండి: సాల్మన్ చేప మరియు మకెరేల్ చేపలలొ ఒమేగా -3 ఫాటీ యాసిడ్ లు ఉంటాయి. అవి కీళ్ళ నొప్పిని తగ్గించడం లో తోడ్పడుతాయి. కాల్చిన చేపలు తినడం లేదా చేప నూనె కాప్సుల్స్ ని వాడడం వలన మీ శరీరానికి మంచి కొలెస్ట్రాల్ (కొవ్వు పదార్ధం) అందుతుంది. అది చెడు కొలెస్ట్రాల్ ను క్రమంగా అరికట్టేందుకు సహాయపడుతుంది మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 3. మాంసాహారం తినేముందు గమనించండి: కాల్చి వండే పద్దతిలో మాంసంలో తక్కువ నూనె ఉంటుంది మరియు అది కావలసినంత పోషకాహారం అందిస్తుంది. తక్కు నూనె గల పదార్థాలు తినడం వలన కీళ్ళ ఆరోగ్యానికి మంచిది కావున వేయించిన మాంసంతో పోలిస్తే కాల్చిన మాంసాన్ని తినడం మంచింది. మాంసం లో కూడా ఎరుపు రంగు గల మాంసం, అంటే మటన్, టర్కీ, సముద్రపు చేపలు మరియు బీఫ్ వంటి మాంసాహారాలలో యూరిక్ ఆమ్లం అధిక మోతాదులో ఉంటుంది. కావున అవి తినకపోవడం మంచిది. అలాగే ఈస్ట్ కలిగిన ఇతర ఆహార పదార్ధాలు ఉదాహరణకు, బ్రెడ్ మరియు కేక్ కూడా ఈ కోవలోకే వస్తాయి. రక్తంలో అధిక యూరిక్ యాసిడ్  ఉన్నట్లయితే కీళ్లలో పేరుకుని గౌట్ మరియు కీళ్ళనొప్పులకు దారితీసింది.
 1. నీరు అధికంగా త్రాగండి: ప్రతి రోజు నీరు మరియు పండ్ల రసాలను ఎక్కువగా త్రాగండి. నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు ఆహార పోషకాల శోషణను (పీల్చుకోవడం) మెరుగుపరుస్తుంది.
 2. సన్ బాత్: చర్మంపై సూర్యరశ్మి పడడం వలన విటమిన్-డి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఆహారంలోని కాల్షియం మరియు ఫాస్పరస్ యొక్క శోషణకు విటమిన్-డి అతిముఖ్యమైనది; విటమిన్-డి  ఎముకల పెరుగుదల మరియు మరమ్మత్తు కోసం అవసరమైన పోషక పదార్ధం అని చెప్పవచ్చు. రోజూ 20-30 నిమిషాల పాటు చర్మంపైన సూర్యరశ్మి పడినట్లయితే మన శరీరానికి అవసరం అయినంత విటమిన్-డి ఉత్పత్తి అవుతుందని నిపుణులు సూచించారు.
 1. శీతలపానీయాలు (సాఫ్ట్ డ్రింక్స్) తీసుకోవడం మానేయండి: మీకు ఎక్కువ దాహం ఉన్నట్లయితే ఆక్సీకరించబడిన శీతలపానీయాలకు బదులుగా తాజా పండ్ల రసాలు త్రాగడం మంచిది. శీతల పానీయాల వినియోగం వలన ఎముకల ఖనిజ సాంద్రత తగ్గుతుందని మరియు ఎముక పగుళ్ళు (ఫ్రాక్చర్స్) కలిగే  ప్రమాదం ఉందని పరిశోధనల్లో కనుగొన్నారు.
 2. మద్యం త్రాగడం తగ్గించండి: మద్యం కీళ్ళలో యూరిక్ యాసిడ్ పేరుకుపోవడానికి  కారణమవుతుంది దానివలన కీళ్ళ నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. మద్యపానం వల్ల మూత్రవిసర్జనం అధికముతుంది. తద్వారా శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. దానివలన కీళ్ళపై  కూడా ప్రభవం పడుతుంది.
 1. పొగత్రాగడం మానేయండి: అన్ని రకాల పొగాకు రక్త నాళాలు కుదించుకుపోవడానికి కారణమవుతుంది. శరీరంలోని కీళ్ళు మరియు వివిధ భాగాలకు చేరే ఆమ్లజనితో (ఆక్సిజన్) కూడిన రక్త ప్రసరణ తగ్గిపోతుంది. అందువలన పొగాకు వినియోగం వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ధూమపానం ఎముకల ద్రవ్యరాశిని తగ్గిస్తుంది మరియు బోలు ఎముకల వ్యాధి (అస్టియోపోరోసిస్) కి దారితీస్తుంది.
 2. చిరుతిళ్ళ నుండి దూరంగా ఉండండి: చిరుతిళ్ళలో నూనె ఎక్కువగా మరియు పోషక పదార్ధాలు తక్కువగా ఉంటాయి. చిరుతిళ్ళ వల్ల మీ శరీరంలో కీళ్ళ ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు లోపిస్తాయి.
 1. మీఅనారోగ్యాలకు సరైన చికిత్సపొందండి: కిడ్నీ లేదా కాలేయ వ్యాధి లేదా పేగు గోడలకు హాని కలిగి ఉన్న వారిలో విటమిన్-డి జీవక్రియకి ఆటంకం ఏర్పడుతుంది. తద్వారా ఎముకలు మరియు కీళ్ళ బలహీనతకి కారణమవుతుంది. కాబట్టి సరైన చికిత్స పొందండి.
 2. దుష్ప్రభావాలను గుర్తించండి: మనలో చాలా మంది కీళ్ళపైన ప్రభావం చూపే సాధారణ మందులు వాడుతూ ఉంటారు. మీరు వీలైనంతవరకు వాడే సాధారణ మందుల యొక్క దుష్ప్రభావాల గురించి మీ వైద్యుడిని సంప్రదించి వాటిని వీలయితే మార్చి వేరే మందులు తీసుకోవడం తెలివైన పని.

నొప్పి రహిత జీవితాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కీళ్ళ నొప్పి జన్యు, పర్యావరణ మరియు హార్మోన్ల వలన ఊపందుకునేతువంటి వ్యాధి అయినప్పటికీ కొన్ని సాధారణ జాగ్రత్తలు అనుసరించడం వలన కీళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు మరియు వాటి  వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయవచ్చు.

నేను ఈ చిట్కాలు అన్నింటినీ ఎలా ఆచరిస్తాను? అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు.

నిజంగా, ఈ చిట్కాలు అన్నీ పాటించాల్సిన అవసరం మీకు ఉండకపోవచ్చు. ఎక్కడనుండయినా ప్రారంభించడం ఉత్తమ మార్గం. మీ అవసరాలు మీకు బాగా తెలుసు, మరియు ఉద్యోగం లేదా వృత్తిలో ఏ నిర్దిష్ట శరీర భాగంలో ఒత్తిడి పడుతుందో కూడా మీకు తెలుసు. కాబట్టి ముందుగా ఒక చిట్కాతో ప్రారంభించండి. ఏదైనా కనీసం ఒక వారం మొత్తం ఆచరించాలని గుర్తు చేసుకుంటూ ఉండండి. తరువాత  ఇంకా కొన్ని మంచి చిట్కాలను జోడిస్తూ ఆచరిస్తూ ఉండండి. దానివలన ప్రస్తుతం మీరు ఆరోగ్యమైన శరీరం మరియు మనస్సు కలిగి ఉండడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఒక నొప్పిరహిత జీవితాన్ని గడప గలుగుతారు.

33 ways to protect your joints in Telugu, Tips for healthy joints in Telugu, Steps to keep our joints healthy in Telugu.

Have a question?

Feel free to ask us for any help or information here!

References

Reviews

మీ కీళ్ళు ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి ౩౩ మార్గాలు
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *