ఆటోఇమ్యూన్ వ్యాధులు మరియు వాటి రకాలు!

ఆటోఇమ్యూనిటి అనేది, శరీర రోగనిరోధక శక్తి నియంత్రణ కోల్పోవడం వల్ల, శరీరం పై దాడి చేసే వ్యాధికారక కణాలపై కాక స్వీయ కణజాలాలపై దాడి చేసే ఒక రకమైన వ్యాధి. రోగనిరోధక శక్తి సాధారణంగా ఎలా పని చేస్తుందో మొదట చూద్దాం. మన శరీరం రెండు ప్రధాన పద్దతులలో వ్యాధి సంక్రమణల నుండి రక్షణ పొందుతుంది.

AutoImmune-Puzzle-Infographic_Telugu

 మీ వెబ్ సైట్ లో ఈ చిత్రం పొందుపరచాలనుకుంటున్నారా? ఐతే క్రింద URL ను ఉపయోగించండి.

https://www.healthclues.net/blog/wp-content/uploads/2016/04/AutoImmune-Puzzle-Infographic_Telugu.png

ఫ్యాగోసైట్స్ (Phagocytes) ఆధారిత రక్షణ

మన శరీరం లో భక్షకకణాలు, న్యూట్రోఫిల్స్, మరియు డెన్డ్రిటిక్ కణాలు, మాస్ట్ సెల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్ మరియు సహజ ప్రాణాంతక కణాలు అనబడే పెద్ద కణాలు ఉంటాయి. ఇవి శరీరం లో ప్రవేసించే ప్రాణాంతక రోగకారక కణాలను నాశనం చేయడానికి ఉపయోగపడుతాయి. ఈ ప్రక్రియలో ఈ కణాలు, రోగకారక కణాలను తమలోనికి పీల్చటం, చుట్టేయడం, తదుపరి పలు రకాల ఎంజైముల సహాయంతో వాటిని నాశనం చేయడం జరుగుతుంది. మన శరీరం లో ఫ్యాగోసైట్స్ కణాలు, పుట్టుక నుండి ఉండే సహజ రోగ నిరోధక కణాలు. మరొక ఉదాహరణ గా లాలాజలం లో ఉండే రోగనిరోధక ఎంజైమ్ లను చెప్పుకోవచ్చు.

ప్రతిరోధక (Antibody) ఆధారిత రక్షణ

మీ శరీరం ఇప్పటికే తెలిసిన వ్యాదికారకాలపై ప్రతిరోధకాలను కలిగి ఉండవచ్చు. ఈ వ్యాధికారక కణాలు రక్తప్రవాహంలో చేరినపుడు ప్రతిరోధక కణాలు వీటిని మూడు పద్దతులలో నాశనం చేయడం జరుగుతుంది. మొదటిది, ప్రతిరోధక కణం వ్యాదికారక కణాన్ని పూర్తిగా ఆక్రమించడం. రెండు, ప్రవేశించిన వ్యాదికారక కణాలను గమనిస్తూ, వాటిని సంహరించడానికి అవసరమైన శరీర రోగ నిరోధక కణాలను ఉత్తేజపరచడం. మూడు, వ్యాదికారక కణాలకు అతుక్కొని వాటిని ఇతర శరీర రక్షక కణాలు తమలోనికి గ్రహించి (మింగి) నాశనం చేయడానికి సహకరిస్తాయి. ఈ పద్దతిని అడాప్టీవ్ ఇమ్మ్యూనిటి అనికూడా అంటారు. కొత్త రకం వ్యాధి కారక కణాలు శరీరం లోనికి ప్రవేశించినపుడు, వాటిని నాశనం చేయడానికి శరీరం అవలంబించే పద్దతిని, అడాప్టీవ్ అనే పదం సూచిస్తుంది.

అడాప్టీవ్ లేదా ప్రతిరక్షక ఆధారిత రక్షణ ప్రక్రియలో స్వయం ప్రతిరక్షక (ఆటోఇమ్యూన్) వ్యాధులు అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ శరీరం తప్పుగా దాని సొంత కణాలపై దాడి గురించి ఖచ్చితమైన కారణాలు ఇవి అని చెప్పలేము. ఇవి దాడి చేసే శరీర అవయవాలను బట్టి ఆటోఇమ్యూన్ వ్యాధులు సుమారు 80 రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని రకాలు మొత్తం శరీరం పై ప్రభావం చూపుతాయి.

ఈ వ్యాధులను మొత్తం కలిపి చూసినపుడు, ప్రపంచ వ్యాప్తంగా, సుమారు 5% మానవ జనాభా, లేదా 100 మందిలో సుమారు 5 గురికి వీటివల్ల ప్రమాదం ఉంటుంది. మానవుల వివిధ జాతులలో అనేక వైవిధ్యాలలో ఈ వ్యాధులు కనపడుతాయి. ఉదాహరణకు టైప్ 1 డయాబెటిస్ సర్వసాధారణంగా తెలుపు లేదా కాకేసియన్ జాతులలో కనిపిస్తుంది, అయితే ల్యూపస్ ఆఫ్రికన్-అమెరికన్ మరియు హిస్పానిక్ జాతులలో ఎక్కువగా కనిపిస్తుంది. లింగ పరంగా, ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా పురుషుల కంటే మహిళల్లో మరింత ప్రబలంగా ఉంటాయి. అంచనా ప్రకారం స్వయం ప్రతిరక్షక (ఆటో ఇమ్యూన్) వ్యాధి బారిన పడేది దాదాపు 80% స్త్రీలే.

ఆటోఇమ్యూన్ వ్యాధుల కారణం

ఆటోఇమ్యూన్ వ్యాధులను బహుళజన్యు అని పిలుస్తారు. అనగా, జన్యు పరంగా ఉత్పరివర్తన (మ్యుటేషన్) లేదా లోపాలు ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాని ఇటువంటి జన్యువులు (జీన్స్) ఉన్న ప్రతి ఒక్కరికి రాకపోవచ్చు. అయితే, వంశపారంపర్యంగా కేవలం 30% ప్రమాదం ఉంటుంది. 70% ప్రమాదం పర్యావరణ కారకాలయిన హార్మోన్లు, ఆహారం, మందులు, టాక్సిన్ల మరియు అంటువ్యాధుల ప్రభావం వల్ల ఉంటుంది.

హార్మోన్లు, ముఖ్యంగా లింగ సంబంధమైన ఈస్ట్రోజెన్ మరియు ఆండ్రోజెన్ హార్మోన్లు రోగనిరోధక ప్రతిస్పందనను అధికం చేస్తాయి. స్త్రీలలో కొంతమందిలో సహజంగా కాని, లేదా వారు వాడే గర్భానిరోదక ఔషదాల మూలంగా కాని హార్మోన్ల స్రావం ఎక్కువ ఉంటుంది.

మనం తీసుకునే ఆహారంలోని పదార్థాలు కూడా స్వయం రోగ నిరోధకత అభివృద్ధికి దోహదపడవచ్చు. క్రిమిసంహారక మందుల మోతాదు సురక్షిత పరిమితులలో ఉన్నప్ప్పటికీ కొంతమందిలో ఇవి కూడా కారణం కావచ్చు. కొందరు వ్యక్తుల్లో గ్లూటెన్ ఒక ఆటోఇమ్యూన్ (స్వయంనిరోధిత) ప్రతిస్పందనను ప్రేరేపి౦చే అవకాశం ఉంటుంది. అయోడిన్ ఉత్పత్తుల ద్వారా అయోడిన్ అతిగా సేవించడం థైరాయిడ్ గ్రంధి సంబంధించిన ఆటోఇమ్యూన్ వ్యాధి సమస్య పెరగడాని అవకాశ౦ ఉన్నట్లు  నమ్ముతారు. పాదరసం, వెండి లేదా బంగారు వంటి భారీ లోహాలు ఉనికి యా౦టిబాడీల స్పందన ను ప్రేరేపించినట్లు ప్రయోగశాల పరీక్షలలో వెల్లడైంది.

వైరల్ మరియు బాక్టీరియా వ్యాధులు కూడా స్వయం రోగ నిరోధకతను ఉత్తేజ పరచవచ్చు. అంటురోగాల వల్ల ఇది ఎలా ఏర్పడగలదనేది వివిధ విధానాల వైద్య పరిశోధనలో సూచించబడింది, మరియు కొన్ని జంతువుల్లో ప్రయోగశాల పరీక్షల ద్వారా నిరూపించబడింది.

ఆటోఇమ్యూన్ డ్యామేజ్ మెకానిజం

ప్రతిరక్షక (యాంటిబాడి) సహాయంతో జరిగే నష్టంలో, స్వయంచాలక ప్రతిరక్షక (ఆటోయాంటిబాడి) కణాలు శరీర ఆరోగ్యకరమైన కణాలకు అతుక్కొని ఉంటూ ఇతర సహజ రోగనిరోధక కణాలను ప్రేరేపితం చేయడం మూలంగా, శరీర ఆరోగ్యకర కణాల పతనం జరుగుతుంది. అంతే కాకుండా ఇవి ఆరోగ్యవంతమైన కణాలకు అతుక్కొని ఉండి వాటి సహజ పనితీరును కూడా మార్చేస్తాయి. శరీరంలో ఉన్న ఆటోయాంటిబాడి రకం, ఒకరికి కలిగే ఆటోఇమ్యూన్ వ్యాధి రకాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

శరీరం లో టి-హెల్పర్స్ అనే రోగనిరోధక కణాల మోతాదు మితిమీరినపుడు, ఇవి సైటోకైన్స్ అనే రసాయనాలను స్రవించడం వల్ల, భక్షకకణాలు (మాక్రోఫేజెస్) ఉత్తేజితమై శరీరలోని ఆరోగ్యవంతమైన కణాలపై దాడి చేసి నాశనం చేయడం జరుగుతుంది.

ఆటోఇమ్యూన్ రోగ నిర్ధారణ క్లిష్టతరం

ఆటోఇమ్యూన్ రోగాన్ని నిర్దారించడం కొన్నిసార్లు, నిపుణులకు కూడా సవాలుగా మారవచ్చు. రోగి శరీరం లోని ఆటో యాంటిబాడి ని బట్టి తనకు దానికి సంభందించిన వ్యాధి సోకుతుందని ఖచ్చితంగా చెప్పలేము. కాని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.

నియంత్రణ కణాల లోపం వల్ల సోకే ఆటోఇమ్యూన్ రోగాన్ని సులువుగా నిర్ధారించలేము. అటువంటి సందర్భాలలో వైద్యుడు, రోగ లక్షణాలను బట్టి ఒక అంచనాకు వస్తారు. ఇందుకు సమయం పట్టవచ్చు.

అంతే కాక ఆటోఇమ్యూన్ రోగాలు, రకాన్ని బట్టి వివిధ శరీర భాగాలపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు మల్టిపుల్ స్క్లేరోసిస్ ఉన్నపుడు ఒక న్యూరాలజిస్ట్ (నరాల వైద్యుడు) అవసరం ఉండవచ్చు, అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నపుడు ఒక రుమటాలజిస్ట్ (కీళ్ళవ్యాధి వైద్య నిపుణుడు) అవసరం ఉంటుంది.

ప్రధాన వ్యాధి రకాలు మరియు ప్రభావం చూపే శరీర భాగాలు

ఆటోఇమ్యూన్ వ్యాధుల రకాలు

దాదాపు 80కి పైగా ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉన్నాయి మరియు సాధారణంగా వీటిని 2 రకాల సమూహాలుగా వర్గీకరించారు.

 1.  అవయవ నిర్దిష్ట (organ specific)  – ఇందులో ప్రధానంగా ఒక నిర్దిష్ట శరీర భాగం ప్రభావితమవుతుంది
 2. దైహిక (systemic) – ఇది శరీరం యొక్క బహుళ ప్రాంతాలలో ప్రభావితమవుతుంది

కొంతమందిలో ఆటోఇమ్యూన్ వ్యాధి ఒకటి కంటే అధిక రకాలుగా ఉంటుంది.

అవయవ నిర్దిష్ట ఆటోఇమ్యూన్ వ్యాధుల రకాలు మరియు అవి ప్రభావితం చేసే భాగాలు

 • మదుమేహ వ్యాది టైప్ 1a (క్లోమం)
 • ఆటోఇమ్యూన్ హెపటైటిస్ (కాలేయ౦)
 • ఎడిసన్ డిసీస్ (అడ్రినలిన్)
 • కొలియాక్ డిసీస్ (జీర్ణ వాహిక)
 • క్రోన్’స్ వ్యాధి (జీర్ణ వాహిక)
 • ప్రైమరీ బిలియరి సిరోసిస్ (కాలేయపు)
 • మ్యస్తేనియా గ్రావిస్ (నరాలు, కండరాలు)
 • గ్విల్లాయిన్-బర్రె సిండ్రోమ్ (నాడీ వ్యవస్థ)
 • గ్రేవ్స్ వ్యాధి (థైరాయిడ్)
 • పర్నిశియస్ అనేమియా (జీర్ణ వాహిక)
 • హషిమోతో’స్ థైరాయిడిటిస్ (థైరాయిడ్)
 • మల్టిపుల్ స్క్లేరోసిస్ (నాడీ వ్యవస్థ)
 • అల్సరేటివ్ కోలైలిటిస్ (జీర్ణ వాహిక)
 • స్క్లేరోజింగ్ కొలంజైటిస్ (కాలేయం)

 

దైహిక ఆటోఇమ్యూన్ వ్యాధుల రకాలు మరియు అవి ప్రభావితం చేసే భాగాలు

దైహిక ఆటోఇమ్యూన్ వ్యాధులు శరీర౦లో  అనేక అవయవాలు మరియు ఇతర శరీర కణజాలాలను ప్రభావితం చేయవచ్చు. దైహిక ఆటోఇమ్యూన్ వ్యాధులను రెండు రకాలుగా వర్గీకరించ వచ్చు

 1. రుమటాలజికల్ / కనెక్టివ్ కణజాల వ్యాధి
 2. వాస్కులైటిస్ (రక్త నాళాలు యొక్క వ్యాధి)

రుమటాలజికల్ దైహిక ఆటోఇమ్యూన్ వ్యాదుల రకాలు

 • యాంటిఫాస్ఫాలిపిడ్ యా౦టిబాడీ సిండ్రోమ్ (రక్త కణాలు)
 • డెర్మటోమియోసైటిస్ (కండరాలు, చర్మం)
 • మిక్స్డ్ కనెక్టివ్ టిష్యు డిసీస్ (కండరాలు)
 • పాలిమయాల్జియా రుమాటికా (కండరాలు)
 • పాలీమయోసైటిస్ (కండరాలు, చర్మం)
 • స్క్లెరోడెర్మా (చర్మం, పేగు, అతి తక్కువగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు)
 • జగ్రెన్స్ సిండ్రోమ్ (లాలాజల గ్రంధులు, కీళ్ళు, కన్నీటి గ్రంధులు)
 • ప్రైమరీ రేనాడ్స్ డిసీస్ (రక్త నాళాలు)
 • రుమాటిక్ ఫీవర్
 • రుమటాయిడ్ ఆర్థరైటిస్ (కీళ్ళు, అతి తక్కువగా ఊపిరితిత్తులు, కళ్లు, చర్మం)
 • సిస్టమిక్ ల్యూపస్ ఎరిథిమేటోసిస్ (చర్మము, కీళ్ళు, మూత్రపిండాలు, గుండె, మెదడు, ఎర్ర రక్త కణాలు, ఇతర)

 

ఆటోఇమ్యూన్ వ్యాధుల నిర్ధారణ (డయాగ్నోసిస్)

వైద్యులు సాధారణంగా ఈ వ్యాదుల నిర్ధారణ కోసం మునుపటి వైద్య పూర్వపరాలు, రక్త పరీక్షలు (ఆటోయాంటీబాడీస్, అవయవ పనితీరు, మరియు వాపు) పర్యవేక్షిస్తుంటారు. బయాప్సీ ద్వార ప్రభావిత కణజాలం నిర్ధారణ ఇతర పరిశోధనలు అవసరం కావచ్చు. కొన్నిసార్లు X-ray కూడా అవసరపడుతుంది.

ఆటోఇమ్యూన్ వ్యాదుల చికిత్స ఎంపిక

ప్రస్తుతం, ఆటో ఇమ్యూన్ వ్యాధులను పూర్తిగా నయం చేయడానికి ఎలాంటి చికత్స లేదు. అయితే చికిత్స ఎంపిక వ్యాధి దశను బట్టి  మరియు వ్యాధి రకంపై ఆధారపడి ఉంటుంది.

ఆటోఇమ్యూన్ వ్యాధి చికిత్సల యొక్క ప్రధాన లక్ష్యాలు

 • వ్యాది లక్షణాల ఉపశమనం కోసం
 • అవయవాల మరియు కణజాల నష్టాన్ని తగ్గించేందుకు
 •  అవయవ పనిని సంరక్షించేందుకు

ఆటోఇమ్యూన్ వ్యాధి (తరచూ నిపుణుల పర్యవేక్షణలో), ఎంపిక చికిత్సలు ఒకటి లేదా ఎక్కువ అంశాలను కలిగి వుంటాయి.

 • NSAID లు (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు)
 • అవయవ వ్యవస్థలు వాటి పనితీరు మెరుగుపరచడానికి (మధుమేహనికి ఇన్సులిన్ మరియు ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధిలో థైరాక్సిన్ ప్రత్యామ్నాయంగా వాడతారు)
 • ఇమ్యునోసప్రేస్సివ్ మందులు (రోగనిరోధక వ్యవస్థ యొక్క కార్యకలాపాలు నిరోధించడానికి)
 • కార్టికోస్టెరాయిడ్ వ్యాది నిరోధక మందులు (ప్రెడ్నిసోలోన్ వంటి)
 • ఇమ్మ్యునోగ్లోబులిన్ పునఃస్థాపన చికిత్స
 • ఎముకలు, కీళ్ళు, లేదా కండరాలు ప్రభావితమయినపుడు ఫిజియోథెరపీ ద్వార నయం చేయవచ్చు.

Sources:

 1. http://www.aun.edu.eg/SECI/RaniaBakry/Immunology%20autoimmune%20disease.pdf
 2. http://www.niams.nih.gov/health_info/autoimmune/understanding_autoimmune.pdf
 3. https://www.womenshealth.gov/publications/our-publications/fact-sheet/autoimmune-diseases.pdf
 4. https://www.womenshealth.gov/publications/our-publications/fact-sheet/autoimmune-diseases.pdf
 5. https://en.wikipedia.org/wiki/Immune_system#Innate_immune_system
 6. http://www.novimmune.com/science/antibodies.html
 7. http://pdl.com/technology-products/how-do-antibodies-work/
 8. http://www.roitt.com/elspdf/Autoimmune_Disease_Mechanisms.pdf
 9. http://www.omicsonline.org/autoimmune-disorders-an-overview-of-molecular-and-cellular-basis-in-todays-perspective-2155-9899.S10-003.pdf
 10. https://en.wikipedia.org/wiki/Autoimmunity
 11. https://en.wikipedia.org/wiki/Immune_system#Innate_immune_system
 12. Photo credit: NIAID via Foter.com / CC BY

Leave a Review

How did you find the information presented in this article? Would you like us to add any other information? Help us improve by providing your rating and review comments. Thank you in advance!

Name
Email (Will be kept private)
Rating
Comments
ఆటోఇమ్యూన్ వ్యాధులు మరియు వాటి రకాలు! Overall rating: ☆☆☆☆☆ 0 based on 0 reviews
5 1

2 thoughts on “ఆటోఇమ్యూన్ వ్యాధులు మరియు వాటి రకాలు!

 1. can u put a post which explains lucoderma (white patches, bolli, tella machalu), which can be helpful for many people to understand ..

  • Hi, thank you for contacting us. Sorry, we currently specialize in dealing with orthopedics related issues. You should be able to find plenty of information about this disease on several other websites, though.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *