ఆక్సినియం ఇంప్లాంట్లపై అదనపు ఖర్చు సరైనదేనా?

వయసు పైబడిన వారిలో, కీళ్ళవాతం మరియు ఆర్థరైటిస్ తో బాధపడేవారిలో కనిపించే సాధారణ సమస్య మోకాళ్ళ నొప్పి. ముందుగా ఫిజియోతెరఫీ చేయించి, అప్పటికి పరిస్థితి చక్కబడకపోతే సర్జరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యకు ఇప్పుడు మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (knee replacement surgery) అందుబాటులో ఉంది. అయితే వైద్యుడు ఒక రోగికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయి౦చుకొమని సలహా ఇచ్చినపుడు, తను చాలా విషయాల గురించి ఆలోచిoచాల్సిన అవసరం ఉంటుంది. అవి ఏ౦టంటే:

 1. శస్త్రచికిత్సకు ముందు ఇద్దరు లేదా ముగ్గురు వైద్యుల నుండి రెండవ అభిప్రాయం (second opinion) తీసుకోవడం
 2. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడం ఏ వయసు వారికి సరైనది?
 3. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత మాములుగా నడవగలమా?
 4. ఏ రకమైన ఇంప్లాంట్ మీకు అనుకూలంగా ఉంటుంది మరియు ఎలా ఎంచుకోవాలి?
 5. అమర్చిన ఇంప్లాంట్ ఎన్ని సంవత్సరాలు మన్నుతాయి?
 6. ఇంప్లాంట్లకు అయ్యే ఖర్చు

ప్రస్తుతం చాలా రకాల ఇంప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏది మీకు నప్పుతుంది మరియు ఎంత కాలం మన్నుతుంది అనే దానిపై చాలా మందికి సందేహలుంటాయి. ఒక కృత్రిమ మోకాలి ఇంప్లాంట్ యొక్క జీవిత కాలం 15 నుండి 20 సంవత్సరాల మధ్య ఉంటుంది. సమయంతో పాటు, కీళ్ళ పై ఒత్తిడి పెరిగి మోకాళ్ళకు అమర్చిన ఇంప్లాంట్లు కూడా అరుగుదలకు లోనవుతాయి. ఈ అరుగుదల వల్ల అమర్చిన ఇంప్లాంట్ల నుండి కొన్నిసార్లు లోహపు అణువులు కరిగి కీళ్ళ భాగాలలో చేరుకుంటాయి. కనుక లోహపు ఇంప్లాంట్లు ఎంచుకొనే సమయంలో జాగ్రత్త వహించాలి.

ఈ వ్యాసంలో ఆక్సినియం ఇంప్లాంట్లపై అదనపు ఖర్చు ఉపయోగకరమో లేదో తెలుసుకుందాం. ఉదాహరణకు, మధ్య వయస్కులలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో ఫ్లెక్సిబుల్ ఇంప్లాంట్లను ఎంచుకుంటారు. ఎందుకంటే అవి వారికి రోజువారీ శారీరక కార్యకలాపాలలో అనువుగా ఉంటాయి. మరోవైపు, ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిలో నడక మరియు రోజువారి శారీరక కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి. అలాంటి వారిలో తక్కువ ఫ్లెక్సిబిలిటి కలిగియున్న ఒక సాధారణ ఇంప్లాంట్ కూడా సరిపోతుంది.

ఆక్సినియం ఇంప్లాంట్ అనేది, 97.5% జిర్కోనియం మరియు 2.5% నియోబియం లోహల మిశ్రమం తో తయారు కాబడిన ఒక రకమైన ఇంప్లాంట్. ఇంప్లాంట్ తయారీ ప్రక్రియ సమయంలో, ఆక్సిజన్ జిర్కోనియం లోహ౦తో కలిసిపోవడానికి గాను తీవ్రమైన వేడి మరియు ఆక్సిజనీకరణానికి లోనవుతుంది. ఆక్సిజన్, లోహపు ఉపరితలంపై చేరే టపుడు లోహపు పొర పై, 5 మైక్రాన్ల మేర మందం లో సిరామిక్ పొర లాగా తయారవుతుంది.

మీరు ఆక్సినియం ఇంప్లాంట్ల కోసం అదనపు ఖర్చు చెయడం అవసరమా?

సగటు నాణ్యత గల విదేశి ఇంప్లాంట్ల వ్యయం చాలా తక్కువగానే ఉంటుంది, అంతేగాకుండా ఎక్కువవకాలం పని చేసిన ట్రాక్‌రికార్డు వాటికి ఉంది. ఆసుపత్రులు, కంపెనీల నుండి విక్రయించే ఎంతో ఖరీదైన ఇంప్లాంట్లు అత్యున్నత స్థాయి డిజైన్‌తో కూడుకున్నవన్న హామీతో ఉంటాయి. మనిషి శరీరంలో అ ఇప్లాంట్స్‌ను అమర్చినప్పుడు అవి అత్యున్నతమైనవి అనేందుకు తగిన విశ్వసనీయ ఆధారాలు లేవు.

ఆక్సినియం ఇంప్లాంట్ల వల్ల కలిగే ప్రయోజనాలు గురించి పరిశోధన ద్వారా కూడా రుజువు కాని అంశాలేంటంటే:

 1. 0035% కన్నా తక్కువ గమనించదగ్గ నికెల్, అనే మెటల్ కొంతమంది రోగులలో ఒక ప్రతిచర్యను(రియాక్షన్) కలిగిస్తుంది.
 2. ఇంప్లాంట్ మెటల్ అడుగు భాగానికి ఉండడం వల్ల సిరామిక్ పూత వల్ల అరుగుదల తగ్గడమే కాకుండా ఎక్కువ కాలం మన్నుతాయి.
 3. 20% కోబాల్ట్ క్రోమియం తో పోలిస్తే ఆక్సినియం ఇంప్లాంట్లు తక్కువ బరువు కలిగి ఉంటాయి.

ఒక ఆసక్తికరమైన పరిశోధన అధ్యయనం ప్రకారం ఉత్తర సిడ్నీ ఆర్థోపెడిక్ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్, వారు రెండు కాళ్ళలో మోకాలు భర్తీ పొందిన నలభై రోగులపై విశ్లేషించారు. వారిలో ఒక మోకాలు కోబాల్ట్ క్రోమియం తో మరొక మోకాలు ఆక్సినియం ఇంప్లాంట్ వేసారు. ఈ రోగులకు శస్త్ర చికిత్స జరిగిన తర్వాత అనేక దశలలో అంచనా వేయడం జరిగింది, అనగా 5 రోజులు, 6 వారాలు, ఒకటి, రెండు మరియు 5 సంవత్సరాలు.

ఈ అధ్యయనం ప్రకారం, 38% రోగులు కోబాల్ట్ క్రోమియం ఇంప్లాంట్ లను, 18% రోగులు జిర్కొనియం ఇంప్లాంట్ లను ఎంచుకొన్నారు. 44% రోగులు ఇంప్లాంట్ ల ఎంపికలో ఎటువంటి ప్రాధాన్యత చూపలేదు. కాని ఈ రెండు రకాల ఇంప్లాంట్ లలో పెద్ద తేడా ఉన్నట్లుగా ఏమీ రుజువవలేదు.

ఈ పరిశోధన ద్వారా నిర్ధారణ అయిన అంశం ఏంటంటే?

ఇప్పటివరకు నిర్వహించిన పరిశోధన ఆధారంగా, ఆక్సినియం ఇంప్లాంట్లలో అరుగుదల తక్కువ ఉన్నట్లేమీ రుజువవలేదు. అలాగని వీటిని కోబాల్ట్ క్రోమియం ఇంప్లాంట్లతో పోల్చినపుడు వాటికన్నా వీటిలో ఎక్కువ తేడా కూడా ఎం లేదు. అంతిమంగా ఇది మీరు మరియు మీ సర్జన్ నిర్ణయించే విషయం, కానీ ఈ పరిశోధన ఆక్సినియం ఇంప్లాంట్ కోసం వెచ్చించే అదనపు ఖర్చు వల్ల ప్రయోజనాలు అంత ఎక్కువగా ఏమి ఉండబోవని సూచించింది.[1, 2, 3]

References

 1. Five-Year Comparison of Oxidized Zirconium and Cobalt-Chromium Femoral Components in Total Knee Arthroplasty: A Randomized Controlled Trial;Hui, Catherine; Salmon, Lucy; Maeno, Shinichi; Roe, Justin; Walsh, William; Journal of Bone and Joint Surgery, Volume 93 (7): 624 – Apr 6, 2011
 2. In Vivo Wear Performance of Cobalt-Chromium Versus Oxidized Zirconium Femoral Total Knee Replacements; Gascoyne, Trevor C.; Teeter, Matthew G.; Guenther, Leah E.; Burnell, Colin D.; Bohm, Eric R.; The Journal of Arthroplasty, Volume 31 (1) – Jan 1, 2016
 3. No difference in vivo polyethylene wear particles between oxidized zirconium and cobalt–chromium femoral component in total knee arthroplasty; Yukihide, Minoda; Kanako, Hata; Hiroyoshi, Iwaki; Mitsuhiko, Ikebuchi; Yusuke, Hashimoto; Knee Surgery, Sports Traumatology, Arthroscopy, Volume 22 (3) – Mar 1, 2014

Leave a Review

How did you find the information presented in this article? Would you like us to add any other information? Help us improve by providing your rating and review comments. Thank you in advance!

Name
Email (Will be kept private)
Rating
Comments
ఆక్సినియం ఇంప్లాంట్లపై అదనపు ఖర్చు సరైనదేనా? Overall rating: ☆☆☆☆☆ 0 based on 0 reviews
5 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *